Yashoda Overseas Collections : రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. సమంత యశోద జోరు మామూలుగా లేదు

Yashoda Movie Day 2 Collections సమంత యశోద మూవీకి రెండో రోజు మంచి కలెక్షన్లు వచ్చాయి. ఫస్ట్ డే కంటే రెండో రోజు వసూళ్లే ఎక్కువగా ఉన్నాయి. మౌత్ టాక్‌తో సినిమాకు వసూళ్లు  పెరిగాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 13, 2022, 02:23 PM IST
  • ఓవర్సీస్‌లో దుమ్ములేపిన యశోద
  • రెండు రోజుల్లోనే సమంత బ్రేక్ ఈవెన్
  • బాక్సాఫీస్ వద్ద సమంత సందడి
Yashoda Overseas Collections : రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. సమంత యశోద జోరు మామూలుగా లేదు

Samantha Yashoda in Overseas : సమంత ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయింది. యశోద సినిమా మీద జనాలు కురిపిస్తున్న ప్రేమను చూసి సమంత మురిసిపోతోంది. తన సినిమాకు పొగిడిన ప్రతీ ఒక్కరికీ రిప్లైలు ఇస్తోంది. యశోద సినిమాకు రివ్యూలు సైతం పాజిటివ్‌గా వచ్చాయి. మౌత్ టాక్ కూడా అదిరింది. దీంతో మొదటి రోజు కలెక్షన్ల కంటే రెండో రోజు ఎక్కువగా వచ్చాయి. ఈ వీకెండ్ మొత్తం సమంత జోరే కనిపించేట్టుగా ఉంది. సమంత తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించేసింది.

ఇవన్నీ ఒకెత్తు అయితే రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ కొట్టడంతో యశోద హాట్ టాపిక్ అవుతోంది. ఈ సినిమాకు ఓవర్సీస్‌లో భారీ స్పందన వచ్చింది. రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ క్రాస్ చేసింది. ఈ చిత్రం దాదాపుగా అక్కడ $350k డాలర్లను వసూల్ చేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో దగ్గరదగ్గరగా రూ. 2.8 కోట్లు అన్న మాట. ఈ సినిమాను ఓవర్సీస్‌లో దాదాపు కోటిన్నరకు మాత్రమే అమ్మారు. అంటే ఇప్పటికే లాభాల బాట పట్టినట్టు. సమంత యశోద ఇలా రెండు రోజుల్లోనే అక్కడ బ్రేక్ ఈవెన్ అయింది.

కానీ గత రెండు నెలల్లో ఓవర్సస్ మార్కెట్లో బ్రేక్ సాధించడం తెలుగు సినిమాలకు గగనంగా మారింది. జిన్నా చిత్రం అయితే కనీసం రెండు వేల డాలర్లను కూడా వసూల్ చేయలేక చతికిలపడింది. ఇలా రెండు రోజుల్లోనే సమంత అక్కడ బ్రేక్ ఈవెన్ సాధించింది. యశోద సినిమా ఇప్పుడు హాఫ్ మిలియన్ డాలర్ వైపు పరిగెడుతోంది. అయితే ఇది మిలియన్ క్లబ్బులో జాయిన్ అవుతుందా? లేదా? అన్నది చూడాలి.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చిత్రం రెండో రోజు మంచి వసూళ్లను సాధించినట్టు తెలుస్తోంది. రెండో రోజు దగ్గరగ్గగా 2.82 కోట్ల షేర్ రాబట్టేసింది. అలా ఈ రెండు రోజుల్లో 5.76కోట్ల షేర్ రాబట్టినట్టు ట్రేడ్ వర్గాల లెక్కల చెబుతున్నాయి.
ఇంకా ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ సాధించాలంటే దాదాపు ఆరు కోట్లకు పైగా రాబట్టాల్సి ఉంటుంది. అంటే మొదటి వారంలో యశోద కచ్చితంగా బ్రేక్ ఈవెన్ చాన్స్ కనిపిస్తోంది. ఆదివారం నాటి కలెక్షన్లు కూడా భారీగానే ఉండేట్టు కనిపిస్తోంది.

Also Read : Varsham 4K Special Screening : అతి చేసిన త్రిష.. హర్టైన ప్రభాస్ అభిమానులు.. డార్లింగ్ ఫ్యాన్స్ ఫైర్

Also Read : Baladiya Buzz Interview : గీతూ ఎలిమినేషన్.. బాలాదిత్య కామెంట్స్ వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News