Samantha: సమంత బాలీవుడ్ ఎంట్రీ షురూ.. కండలవీరుడుతో జోడి కట్టనున్న సామ్..

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్దమైంది. సామ్ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ తో రొమాన్స్ చేసేందుకు రెడీ అయినట్లు టాక్ వినిపిస్తోంది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 17, 2023, 11:54 AM IST
Samantha: సమంత బాలీవుడ్ ఎంట్రీ షురూ.. కండలవీరుడుతో జోడి కట్టనున్న సామ్..

Samantha Bollywood debut: టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత(Samanth) త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా దీనికి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం, సామ్.. కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman khan) ప‌క్క‌న‌ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు విష్ణువర్ధన్ (Vishnu Vardhan) ద‌ర్శ‌క‌త్వం వహించనున్నారు. ఈ మూవీని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ నిర్మించ‌నున్నాడు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

మరోవైపు వరుణ్​ ధావన్​తోనూ సామ్​ ఓ వెబ్​సిరీస్​ చేస్తోంది. ‘సిటాడెల్’​ అనే హాలీవుడ్​ యాక్షన్​ స్పై థ్రిల్లర్​ సిరీస్​కు ఇది ఇండియన్​ వెర్షన్​.  ఫ్యామిలీ మ్యాన్ సూపర్ హిట్ త‌ర్వాత సమంత నటిస్తున్న రెండో వెబ్ సిరీస్ ఇదే. ఇప్పటికే పుష్ప చిత్రంలోని ఊ అంటావా’ సాంగ్ తో నార్త్​ ఆడియెన్స్​ను ఓ ఊపు ఊపేసింది సామ్. తాజాగా సల్మాన్ తో సినిమా సామ్ కు మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.

Also Read: Allu Arha: మట్టితో వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసిన అల్లు అర్హ, వీడియో వైరల్

ఇటీవల విజయ్ దేవరకొండ లీడ్ రోల్ లో నటించిన ఖుషి సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. శివనిర్వాణ దర్వకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇందులో సమంత నటనకు మంచి మార్కులే పడ్డాయి. విజయ్, సామ్ కెమిస్ట్రీ ఆడియెన్స్ ను ఫిదా చేసింది. ''‘లైఫ్ లో ఎదురయ్యే బాధలన్నింటికీ మందు కాలమే. కాలం గడిచే కొద్దీ గాయం నయమవుతుంది. మనసుకు తగిలిన దెబ్బకు కూడా కాలమే మందు''’అంటూ రీసెంట్ గా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది సామ్. 

Also Read: Jawan Movie: 700 కోట్లు దాటిన జవాన్ కలెక్షన్స్.. తొమ్మిదో రోజు ఎంతంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News