Yashoda Twitter Review : యశోద ట్విట్టర్ రివ్యూ.. దుమ్ములేపిన సమంత.. కష్టానికి తగ్గ ప్రతిఫలం

Yashoda Twitter Review సమంత నటించిన యశోద మూవీ మీద ప్రస్తుతం పాజిటివ్ టాక్ నడుస్తోంది. సోషల్ మీడియాలో సమంత నటన మీద ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ సినిమాకు ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చేట్టు కనిపిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 11, 2022, 06:34 AM IST
  • నవంబర్ 11న యశోద విడుదల
  • ట్ట్విట్టర్‌లో సమంత జోరు
  • యశోదపై పాజిటివ్ కామెంట్స్
Yashoda Twitter Review : యశోద ట్విట్టర్ రివ్యూ.. దుమ్ములేపిన సమంత.. కష్టానికి తగ్గ ప్రతిఫలం

Samantha Yashoda Twitter Review : సమంత యశోద ట్విట్టర్ రివ్యూ ఇప్పుడు నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. ఆమె ముఖ్య పాత్రలో నటించిన యశోద సినిమాకు ఇప్పుడు ఫుల్ పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ట్విట్టర్‌లో సమంత, యశోద పేర్లు మార్మోగిపోతోన్నాయి. సమంత కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కిందంటూ నెటిజన్లు అంటున్నారు. ఆల్రెడీ యూఎస్ ప్రీమియర్లు పడటంతో అక్కడి నుంచి ఈ టాక్ స్ప్రెడ్ అవుతోంది. ఇంకొన్ని గంటల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ షోలు పడనున్నాయి. ఆ తరువాత యశోద ఫుల్ టాక్ బయటకు వస్తుంది.

 

ఇప్పుడు మాత్రం ట్విట్టర్‌లో సమంత మీద ప్రశంసల వర్షం కురుస్తోంది. ఫస్ట్ హాఫ్‌ అదిరిందని, సెకండాఫ్ ఎంతో ఎమోషనల్‌గా సాగిందని అంటున్నారు. మొత్తంగా ఓ సారి సినిమాను చూడొచ్చంటూ చెబుతున్నారు. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ ఈ సినిమాను నిలబెట్టేసిందని అంటున్నారు. సమంత దుమ్ములేపేసిందని అందరూ పొగిడేస్తున్నారు.

 

డీసెంట్ ఎంగేజింగ్ ఎమోషనల్ థ్రిల్లర్ అంటూ యశోద మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. సమంతే ఈ సినిమాకు ప్రాణమని అంటున్నారు. క్యాస్టింగ్ కరెక్ట్‌గా సరిపోయిందట. మణిశర్మ బీజీఎం సూపర్‌గా ఉందంట. విజువల్స్, యాక్షన్ పార్ట్ అదిరిపోయిందట. కాన్సెప్ట్‌కు దండం పెట్టేస్తున్నారు.

మొత్తానికి సమంత కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కేసిందని నెటిజన్లు అంటున్నారు. మరి తెలుగు రాష్ట్రాల్లో సమంతకు ఇంకా ఎలాంటి పేరు వస్తుందో, యశోదకు ఎలాంటి టాక్ వస్తుందో.. వసూళ్లు ఎలా ఉంటాయో ఇంకొన్ని గంటలు ఆగితే తెలుస్తోంది. పూర్తి టాక్, పూర్తి రివ్యూ రావాలంటే మాత్రం ఇంకా వేచి చూడాల్సిందే.

అయితే యశోద సినిమాకు ముందు నుంచి కూడా మంచి టాకే ఉంది. ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్లు అన్నీ కూడా మంచి స్పందన దక్కించుకున్నాయి. ఇక సమంతకు వచ్చిన వ్యాధి, ఆ వ్యాధితో బాధపడుతూనే డబ్బింగ్ చెప్పడం, ఆస్పత్రి నుంచి బయటకు రాలేని స్థితి, లేచి నిలబడలేని స్థితిలో ఉన్నా కూడా ప్రమోషన్స్‌కు రావడం, స్పెషల్ ఇంటర్వ్యూ ఇవ్వడం, అందులో ఆమె కంటతడి పెట్టుకుంటూ చెప్పిన విషయాలు ప్రేక్షకులను కదిలించాయి. యశోద మీద మరింత పాజిటివిటీని పెంచాయి.

Also Read : Anusha Shetty Photos: నాగశౌర్యకు కాబోయే భార్య ఎంత అందంగా ఉందో చూశారా?

Also Read : Urfi Javed F word: కేసులెందుకు అని అడిగితే బూతులతో విరుచుకుపడిన వింత జీవి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News