Samantha: ‘నేను చేసిన తప్పు అదే..నా ఇష్టాలను కూడా ప్రభావితం చేశారు’.. భాగస్వామి గురించి సమంత

Samantha about Naga Chaitanya: ఏం మాయ చేసావే సినిమాతో మనందరినీ మాయ చేసిన హీరోయిన్ సమంత. సినిమాలలో సక్సెస్ ఫుల్ గా రన్ అయినా సమంత జీవితం రియల్ లైఫ్ లో మాత్రం అంత సజీవంగా సాగలేదు…తాను జీవితంలో ఎదుర్కొన్న కొన్ని అనుభవాల గురించి సమంత పెట్టిన ఒక మెసేజ్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది..

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 18, 2024, 06:33 PM IST
Samantha: ‘నేను చేసిన తప్పు అదే..నా ఇష్టాలను కూడా ప్రభావితం చేశారు’.. భాగస్వామి గురించి సమంత

Samantha-Naga Chaitanya: ఎన్నో సంవత్సరాలుగా తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న నటి సమంత. ప్రస్తుతం హిందీలో సైతం ఎన్నో అవకాశాలు దక్కించుకుంటోంది ఈ హీరోయిన్. కాగా తన ఆరోగ్య పరిస్థితుల వల్ల కొద్ది రోజుల సినిమాలకు బ్రేక్ ఇచ్చి రెస్ట్ తీసుకుంటోంది. అయితే ఈ గ్యాప్ లో సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా పాల్గొంటుంది సమంత. తరచుగా తన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంలో సమంత ముందుంటుంది. తన అభిమానులతో ఈ ప్లాట్ ఫామ్స్ ద్వారా ముచ్చటిస్తూ ఉంటుంది.

ఇప్పుడు కూడా ఇదే కొనసాగిస్తూ తాజాగా రెడ్డిట్ ద్వారా  ఫ్యాన్స్‌ అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానలు ఇచ్చింది. అలాగే తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు ఏంటో కూడా చెప్పింది. ఈ నేపథ్యంలో ఆమె కొన్ని వ్యాఖ్యలు చేయగా అవన్నీ నాగచైతన్య గురించే అని సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోందో.

‘నా ఇష్టాయిష్టాలు ఏంటో తెలుసుకునేందుకు నాకే చాలా సమయం పట్టింది. ఎందుకంటే గతంలో నా జీవిత భాగస్వామి వాటిని ఎక్కువగా ప్రభావితం చేశాడు.  ఆ కష్ట సమయాల దగ్గర నుంచి నేను విలువైన పాఠాలు నేర్చుకోగలమని అర్థం చేసుకున్నాను. అక్కడ నుంచే నా వ్యక్తిగత ఎదుగుదల మొదలైంది’అని సమంత చెప్పుకొచ్చింది.  కాగా ఈ పోస్టులో సమంత ఆ టైంలో తన పార్ట్నర్ వల్లే సమస్యలు అన్ని ఎదుర్కొన్నాను అని రాయడంతో.. ఇన్ డైరెక్ట్ గా ఈ హీరోయిన్ చెప్పింది తన మాజీ భర్త నాగచైతన్య గురించే అని కింద చాలామంది కామెంట్లు పెట్టారు. ప్రస్తుతం సమంత చేసిన ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.

కాగా గతంలో కూడా సమంత ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. నాగ చైతన్యతో విడాకుల తర్వాత వరుస ఫ్లాపులు రావడం.. ఆరోగ్య సమస్యలు ఎదురవడం వల్ల తాను మానసికంగా చాలా కుంగిపోయానని  చెప్పింది.  2017లో పెళ్లి చేసుకున్న నాగచైతన్య సమంత.. నాలుగేళ్ల పాటు కలిసి ఉండి.. 2021లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు కెరీర్‌ పరంగా బిజీ అయ్యారు. అయితే వీరిద్దరూ ఎందుకు విడిపోయారు అనే విషయంపై మాత్రం ఇంకా కూడా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.

Also Read Rythu Bandhu and Loan Waiver: తెలంగాణ రైతులకు శుభవార్త.. ఒకేసారి రైతుబంధు, రుణమాఫీ

Also Read Addanki Dayakar: అద్దంకి దయాకర్‌కు మరోసారి హ్యాండిచ్చిన కాంగ్రెస్.. అసలేం జరిగిందంటే..?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News