Naga Chaitanya Shobitha Dhulipalla : అడ్డంగా దొరికిపోయిన శోభితా-నాగ చైతన్య?.. ఆడేసుకుంటున్న సమంత ఫ్యాన్స్.. అక్కినేని అభిమానుల మాట ఇదే

Naga Chaitanya Shobitha Dhulipalla నాగ చైతన్య, శోభిత ధూళిపాళ మధ్య ఏదో ఉందని, ఇద్దరూ డేటింగ్‌ చేస్తున్నారని, పెళ్లి కూడా చేసుకుంటారనే రూమర్లు ఆ మధ్య తెగ వైరల్ అయ్యాయి. దీనిపై సమంత కూడా పరోక్షంగా కౌంటర్లు వేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 25, 2022, 11:19 AM IST
  • శోభిత, నాగ చైతన్యల పిక్ వైరల్
  • సమంత అభిమానుల ట్రోలింగ్
  • తిప్పి కొడుతోన్న అక్కినేని ఫ్యాన్స్
Naga Chaitanya Shobitha Dhulipalla : అడ్డంగా దొరికిపోయిన శోభితా-నాగ చైతన్య?.. ఆడేసుకుంటున్న సమంత ఫ్యాన్స్.. అక్కినేని అభిమానుల మాట ఇదే

Naga Chaitanya Shobitha Dhulipalla : సమంత, నాగ చైతన్యల మధ్య ఎందుకు దూరం పెరిగింది.. ఎవరు విడాకులు ముందుగా అడిగారో.. అసలు ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో అనే విషయాల మీద ఎవ్వరికీ క్లారిటీ లేదు. మొదట్లో అయితే.. సమంత వ్యవహారం వల్లే విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. సమంత స్టైలిష్ట్ ప్రీతమ్ జుకాల్కర్‌తో సన్నిహితంగా ఉండటం, ఆ ఫోటోలు వైరల్ అవ్వడంతోనే ఇలా జరిగిందని అన్నారు. సమంత తనకు సోదరిలాంటిదని ప్రీతమ్ తన మీద వచ్చిన రూమర్లకు బాధపడుతున్నట్టుగా జాతీయ మీడియాలో ప్రస్థావించాడు.

 

ఇలా మొదట్లో సమంత వల్లే విడాకులు అయ్యాయని టాక్ వచ్చింది. ఆ తరువాత మెల్లిగా నాగ చైతన్య వైపు ఈ పవనాలు వీచాయి. ఆ సమయంలోనే ఇలా నాగ చైతన్య శోభిత ధూళిపాళ వ్యవహారం తెర మీదకు వచ్చింది.ఈ ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ, త్వరలోనే పెళ్లి చేసుకుంటారని రూమర్లు వచ్చాయి. ఇవి ఒక్కసారిగా సోషల్ మీడియాను ఊపేశాయి. అయితే ఈ రూమర్లన్నీ కూడా సమంత పీఆర్ టీం క్రియేట్ చేసిందని అక్కినేని అభిమానులు అన్నారు.

 

అలా అక్కినేని ఫ్యాన్స్ చేసిన ఆరోపణల మీద సమంత స్పందించింది. అమ్మాయిల మీద రూమర్లు వస్తే.. అవి నిజం, అదే అబ్బాయి మీద రూమర్లు వస్తే మాత్రం అమ్మాయి చేయించిందని అంటారా? కొంచెం ఎదగండి.. విడాకులకు కారణమైన వారే హాయిగా ఉంటున్నారు.. నువ్ కూడా హాయిగా ఉండు.. నీ పని మీద నువ్ దృష్టి పెట్టుకో.. నీ ఫ్యామిలీని నువ్ చూసుకో.. ముందుకు సాగు అంటూ ఇలా ఓ నెటిజన్‌కు రిప్లై ఇచ్చింది సమంత.

 

దీంతో నాగ చైతన్య శోభిత రూమర్లు నిజమేనేమో అని అందరూ ఫిక్స్ అయ్యారు. సమంత ట్వీట్ అప్పట్లో దుమారమే రేపింది. అయితే ఇప్పుడు సమంత అభిమానులు ఓ ఫోటోను షేర్ చేస్తున్నారు. అయితే ఇందులో నాగ చైతన్య, శోభితలు పక్కపక్కనే నిల్చున్నట్టుగా కనిపిస్తోంది. కానీ నిశితంగా గమనిస్తే అవి ఎడిటెడ్ పిక్స్ అని అర్థమవుతోంది.

 

ఫోటోల కింద సరిగ్గా చూస్తే అవి ఎడిట్ చేసినవని అర్థమవుతోంది. ఎడిట్ అయితే బ్యాక్ గ్రౌండ్ కూడా సేమ్ ఉంటుందా? అని అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. సమంత అభిమానులు మాత్రం ఇవి నిజంగానే దిగిన ఫోటోలు అని అంటే.. అక్కినేని అభిమానులు మాత్రం ఎడిట్ చేసిన ఫోటోలు అని వాదిస్తున్నారు. మొత్తానికి మరోసారి శోభిత, నాగ చైతన్య వ్యవహారం తెర మీదకు వచ్చింది.

Also Read : Richa Chadha controversy : మా ప్రెసిడెంట్‌కు కోపం తెప్పించిన బాలీవుడ్ నటి.. ఏం ఆడది ఇది?.. మంచు విష్ణు ట్వీట్ వైరల్

Also Read : Veera Simhaa Reddy First Single : పగిలిపోయిందని చూపించిన తమన్.. అది దేవి శ్రీ ప్రసాద్‌కు కౌంటరా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News