Genelia Riteish Deshmukh : సమంత నాగ చైతన్యలానే జెనిలీయా రితేష్ దేశ్ ముఖ్.. జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో?

Majili Marathi Remake రితేష్ దేశ్‌ముఖ్ తాజాగా దర్శకుడిగా మారాడు. మజిలీ సినిమాను మరాఠిలో రీమేక్ చేశాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. దీంట్లో సమంత, చైతూల మ్యాజిక్ రిపీట్ చేసే ప్రయత్నం చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 25, 2022, 03:15 PM IST
  • మజిలీతో చైసామ్ మ్యాజిక్
  • మజిలీ మరాఠి రీమేక్ టీజర్
  • రితేష్, జెనిలీయా జంట ఆకట్టుకునేనా?
Genelia Riteish Deshmukh : సమంత నాగ చైతన్యలానే జెనిలీయా రితేష్ దేశ్ ముఖ్.. జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో?

Naga Chaitanya Samantha Majili Marathi Remake : మజిలీ సినిమా అంతటి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడానికి ప్రధాన కారణం సమంత, నాగ చైతన్య నిజంగా భార్యాభర్తలు అవ్వడం, వారిద్దరి మధ్య ప్రేమ ఉండటంతో ఆ పాత్రలకు జనాలు ఇట్టే కనెక్ట్ అయ్యారు. పిచ్చిగా ప్రేమించే శ్రావణి పాత్రలో సమంత అద్బుతంగా నటించింది. నాగ చైతన్య, సమంతల ప్రేమకు నిదర్శనంగానే ఈ సినిమాను అందరూ చూశారు. ఇప్పుడు ఈ సినిమాను మరాఠీలో రీమేక్ చేశారు.

 

రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియాలు ఈ మరాఠీ రీమేక్ నిర్మించారు. మొదటి సారిగా రితేష్‌ దర్శకుడిగా మారి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అయితే నాగ చైతన్య, సమంతలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రితేష్‌, జెనీలియాలు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సంసార జీవితాన్ని చక్కగా సాగిస్తున్నారు. ఇప్పుడు మజిలీని మరాఠీలో తీసి చైసామ్ మ్యాజిక్‌ను మళ్లీ రిపీట్ చేయాలని రితేష్, జెనీలియాలు భావిస్తున్నారు.

మజిలీ మరాఠీ వేడ్ సినిమా టీజర్‌ను నిన్న విడుదల చేశారు. దీంట్లో అయితే ఎమోషన్ బాగానే అనిపిస్తోంది. ప్రేమ అంటే ఏంటో చెప్పిన డైలాగ్స్ బాగున్నాయి.. ప్రేమ అంటే సముద్రం.. ప్రేమ అంటే వర్షం.. ప్రేమ అంటే ఇసుకలాంటిది అంటూ ఇలా చెబుతూ చూపించిన సీన్స్ అద్భుతంగా అనిపించాయి.

ఇక సమంతాలనే జెనీలియా ఎంట్రీని కూడా ఓ రేంజ్లో పెట్టేశారు. ఆ సీన్‌కు అక్కడ కూడా విజిల్స్ పడేలా ఉన్నాయి. వేడ్ అంటే పిచ్చి ప్రేమ అని అర్థం. అయితే రితేష్ దర్శకుడిగా చేస్తోన్న ఈ తొలి ప్రయత్నం అక్కడి వారిని ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి. ఈ చిత్రం డిసెంబర్ 30న విడుదల కాబోతోంది.

Also Read : Alia Bhatt Daughter Name : అలియా భట్ కూతురు పేరు ఏంటంటే?.. ఏ ఏ భాషలో ఏ ఏ అర్థమంటే?

Also Read : Nandamuri Balakrishna Vs Chiranjeevi : నిన్ను తాకే దమ్మునొడు లేనే లేడయ్యా.. బాలయ్యపై డైరెక్టర్ గోపీచంద్ మలినేని కామెంట్స్.. మండిపడ్డ మెగా ఫ్యాన్స్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News