Ravi Teja: మాట నిలబెట్టుకున్న రవితేజ.. బిగ్ బాస్ కంటెస్టెంట్ కి సినిమాలో ఛాన్స్

Amardeep Chowdary Movie : బిగ్ బాస్7 చూసిన వారికి సీరియల్ యాక్టర్ అమర్ దీప్ చౌదరి నటుడిగా కంటే ముందు మాస్ మహారాజా రవితేజ వీరాభిమానిగా బాగా తెలుసు. హెయిర్ కట్ తో సహా.. అన్నిటిలో రవితేజాన్ని ఫాలో అయ్యే అమర్ ని చూసి ఏకంగా రవితేజానే ఇంప్రెస్ అయ్యాడు.. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 13, 2024, 04:13 PM IST
Ravi Teja: మాట నిలబెట్టుకున్న రవితేజ.. బిగ్ బాస్ కంటెస్టెంట్ కి సినిమాలో ఛాన్స్

 Amardeep in Raviteja movie : జానకి కలగనలేదు తెలుగు సీరియల్ తో మంచి పేరుతెచ్చుకున్న అమర్దీప్ చౌదరి గురించి తెలియని సీరియల్ ప్రేమికులు ఉండరు. బిగ్ బాస్ 7 కి వచ్చిన అమర్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. అమర్, ప్రియాంక, శోభ శెట్టి ఎప్పుడూ క్లోజ్ గా ఉండడంతో.. వారిని స్పా బ్యాచ్ అని పిలిచేవారు. ఫైనల్స్ దాకా ఉన్న అమర్ దీప్ బిగ్ బాస్ 7 రన్నర్ గా విజయం సాధించాడు. 

అయితే ఈ షో ఫైనల్స్ కి వచ్చిన రవి తేజ అమర్ కి సినిమా ఆఫర్ ఇచ్చారు. తన సినిమాలో తప్పకుండా అతనికి ఛాన్స్ ఇస్తాను అని చెప్పారు. కాగా ఇన్ని రోజుల తరువాత ఈ మాటని నిలబెట్టుకున్నారు మన మాస్ మహారాజా.  వివరాల్లోకి వెళితే.. షో ఫైనల్స్ జరుగుతున్న సమయంలో రవి తేజ ముఖ్య అతిథిగా విచ్చేయగా, హోస్ట్ నాగార్జున సరదాగా ఇప్పటికిప్పుడు రవితేజ సినిమాలో ఆఫర్ అంటే.. షో వదిలి వచ్చేస్తావా.. అని అడగగా.. అమర్ వెంటనే ఆలోచించకుండా ఒకే చెప్పేస్తాడు. 

దీంతో ఇన్నాళ్లు షోలో పడ్డ కష్టాన్ని తనతో సినిమా అవకాశం కోసం వదులుకోవడానికి సిద్ధమైన అమర్ ని చూసి ఇంప్రెస్స్ అయిన రవితేజ.. తనతో సినిమా అవకాశం నిజంగానే ఇస్తాను అని మాట ఇచ్చారు. ఇక షో అయిపోయి అమర్ రన్నర్ గా బయటకి వచ్చేసాడు. ఇది జరిగి కూడా కొన్ని నెలలు అవుతోంది. ఈ క్రమంలో తాజాగా రవితేజ అమర్ కి సినిమా ఆఫర్ ఇచ్చి తన మాట మీద నిలబడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా అమర్ దీప్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకున్నారు. 

తాజాగా అమర్ దీప్ తన ప్రియనటుడు రవితేజ తో షూటింగ్ సెట్స్ లో దిగిన ఒక ఫోటోని షేర్ చేశారు. "ఫైనల్లీ మాస్ మహారాజా.. నా కల నెరవేరింది. ఐ లవ్ యూ అన్నా.. నా దేవుడు నువ్వేనయ్యా. నువ్వంటే నాకు పిచ్చి, ఫ్యాన్ బాయ్ మూమెంట్" అంటూ పోస్ట్ చేసాడు. 

 

దీంతో రవితేజ లాంటి స్టార్ సినిమాలో అవకాశం కొట్టేశాడు అని అందరూ అమర్ దీప్ కి శుభాకాంక్షలు చెబుతున్నారు. రవితేజ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు అభిమానులు మరోసారి రవితేజని అభినందిస్తున్నారు.

Also read: Loksabha polls 2024: ప్రతి ఒక్కరూ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలి..

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

Trending News