Randeep Hooda Accident: బాలీవుడ్ హీరోకి తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు! శస్త్రచికిత్స అవసరం

Randeep Hooda rushed to hospital after severe injuries at Film Shooting. బాలీవుడ్ హీరో రణదీప్ హుడా నటిస్తున్న తాజా వెబ్ సిరీస్ 'ఇన్‌స్పెక్టర్ అవినాష్' షూటింగ్ సందర్భంగా గుర్రపు స్వారీ చేస్తూ కిందపడిపోయాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Jan 13, 2023, 07:48 PM IST
  • బాలీవుడ్ హీరోకి తీవ్ర గాయాలు
  • ఆస్పత్రికి తరలింపు
  • శస్త్రచికిత్స అవసరం
Randeep Hooda Accident: బాలీవుడ్ హీరోకి తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు! శస్త్రచికిత్స అవసరం

Randeep Hooda severely injured while horse riding at Inspector Avinash Shooting: బాలీవుడ్ హీరో రణదీప్ హుడా ప్రమాదంకు గురయ్యాడు. హుడా నటిస్తున్న తాజా వెబ్ సిరీస్ 'ఇన్‌స్పెక్టర్ అవినాష్' షూటింగ్ సందర్భంగా గుర్రపు స్వారీ చేస్తూ కిందపడిపోయాడు. చిత్ర యూనిట్ వెంటనే అతన్ని ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రికి తరలించింది. రణదీప్ హుడాకు వైద్యులు మెరుగైనన వైద్యం అందించారు. అయితే హుడా కొన్ని రోజులు పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు.

రణదీప్ హుడా ఎడమ కాలికి గాయం కావడంతో.. శస్త్రచికిత్స చేసే అవకాశమున్నట్లు సమాచారం తెలుస్తోంది. షూటింగ్ సమయంలో హుడా గాయపడడం ఇదే మొదటిసారి కాదు. బాలీవుడ్ సీనియర్ హీరో సల్మాన్ ఖాన్‌ నటించిన 'రాధే' సినిమా షూటింగ్ సమయంలో హుడా ప్రమాదంకు గురయ్యాడు. యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు ఆయన గాయపడ్డాడు. అప్పుడు హుడా కుడి కాలుకు మోకాలి శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది.

రణ్‌దీప్ హుడా నటించబోయే 'వీర్ సావర్కర్' తదుపరి షెడ్యూల్.. 2023 ఫిబ్రవరిలో ప్రారంభం కావాల్సి ఉంది. ఈ చిత్రంలోని సావర్కర్ పాత్ర కోసం రణ్‌దీప్ హుడా చాలా బరువు తగ్గాడు. వినాయక్ దామోదర్ సావర్కర్ పాత్రకు సరిపోయేలా కఠినమైన డైట్‌ని పాటిస్తూ.. 22 కిలోల బరువు తగ్గాడు. నెట్‌ఫ్లిక్స్ సిరీస్ 'క్యాట్‌'లో చివరిసారిగా రణ్‌దీప్ హుడా కనిపించాడు. తేరా క్యా హోగా లవ్లీలో ఇలియానా డిక్రూజ్‌తో కలిసి హుడా కనిపించనున్నాడు. 

Also Read: రిటైర్‌మెంట్‌ తీసుకోవాలని ఎంఎస్ ధోనీ అప్పుడే నిర్ణయం తీసుకున్నాడు.. అసలు విషయం చెప్పేసిన మాజీ కోచ్!  

Also Read: Kuldeep Yadav: తుది జట్టు కూర్పు చాలా ముఖ్యం.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి: కుల్దీప్ యాదవ్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News