ప్రభాస్ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం

సాహో తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా ఇదే 

Last Updated : Sep 30, 2018, 02:16 PM IST
ప్రభాస్ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం

బాహుబలి 2 విడుదల తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలు ఏవీ విడుదల కాకపోయినా... అతడు మాత్రం ఎప్పటికప్పుడు బిజీగానే ఉంటూ వస్తున్నాడు. బాహుబలి 2 తర్వాత కొద్ది నెలలు విశ్రాంతి తీసుకుని సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమా చేసిన ప్రభాస్ ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగానే తాజాగా మరో సినిమాను ప్రారంభించేశాడు. ఇటలీలో షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాను రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తుండగా.. సినిమాలోని అధిక భాగం షూటింగ్ యూరప్‌లో జరగనుంది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో 20వ సినిమా కానుంది. 

ఈ సినిమా షూటింగ్ కోసం ప్రభాస్ సహా మూవీ యూనిట్ సభ్యులు అందరూ ఇటలీ బయల్దేరి వెళ్లారు. ఈ సినిమాలో పూజా హెగ్డెతో మంచి రొమాంటిక్ ట్రాక్ సైతం ఉన్నట్టు సమాచారం.

Trending News