Salaar Review in Telugu: అదిరిపోయిన 'సలార్' పబ్లిక్ రెస్పాన్స్.. ఇండస్ట్రీ షేక్ అవ్వడం ఖాయం..!

Salaar Public Response: రెబల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన స‌లార్ మూవీ శుక్ర‌వారం వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజైంది. ఈ సినిమా ట్రైలర్ లో మన డార్లింగ్ ని ప్ర‌శాంత్ నీల్‌ పీక్స్‌లో చూపించ‌డంతో ఈ సినిమాపై పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో భారీగా హైప్ ఏర్ప‌డింది. కాగా ఇప్పుడు ఈ చిత్రం చూసిన వారందరూ సినిమా బ్లాక్ బస్టర్ అంటూ ట్విట్టర్ లో రివ్యూల రాస్తున్నారు…

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 22, 2023, 06:41 PM IST
Salaar Review in Telugu: అదిరిపోయిన 'సలార్' పబ్లిక్ రెస్పాన్స్.. ఇండస్ట్రీ షేక్ అవ్వడం ఖాయం..!

 Salaar Review: ప్రభాస్ హీరోగా ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ హోంబలే బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్ నిర్మించిన చిత్రం సలార్. ఈ సినిమాకు కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. పృథ్వీరాజ్ సుకుమారిన్ ముఖ్యపాత్రలో కనిపించగా ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్గా చేసింది. కాగా ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాపై సోషల్ మీడియాలో, ట్విట్టర్‌లో నెటిజన్లు ఎలా రియాక్ట్ అయ్యారు.. ఈ చిత్రం పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం..

‘ప్రభాస్ సలార్ సినిమా ఇప్పుడే చూశాను. ఈ సినిమా మాన్‌స్టర్ బ్లాక్‌బస్టర్. స్క్రీన్ మీద కనిపించిన ప్రతీ సారి ప్రభాస్ భాయ్ గూస్‌బంప్స్ వచ్చాయి. ఫెంటాస్టిక్ పర్ఫామెన్స్. యూనిట్ అందరికి కంగ్రాట్స్. ప్రశాంత్ నీల్ విజువల్ ట్రీట్ ఇచ్చాడు. ఈ సినిమా ప్రతీ ఒక్కరు చూడాల్సిన సినిమా’ అని హీరో నిఖిల్ ట్వీట్ చేశాడు.

 

 

“కిడ్స్ ఎంట్రన్స్ సీన్ అదిరిపోయింది.. ప్రభాస్ ఓపెనింగ్ సీన్ వేరే లెవల్.. ఇక ప్రీ ఇంటర్వెల్ అయితే గూస్ బంప్స్.. ఇక ఇంటర్వెల్ అయితే మరణ మాస్” అంటూ ఒక నేటిజన్ పోస్ట్ చేశాడు.

 

“ఇది కాదయ్యా ఊచకోత.. రాచకోత. ఏం తీశాడు భయ్యా. రాజమౌళిని బోయపాటిని మిక్సీలో వేసి తీసినట్లున్నాయ్ ఫైట్స్. అసలు సినిమాలో మూడు సీన్లు చాలు.. ఇది మెంటల్ మాస్ బ్లాక్ బస్టర్. హిట్టు కొట్టేశాం. కేజీఎఫ్‌ను మించి ఉందయ్యా సినిమా" అంటూ ఒక అభిమాని సినిమా గురించి రివ్యూ ఇచ్చేశారు.

 

కాగా ఇంకొక నేటిజన్ ఈ చిత్రంలోని పాజిటివ్స్ తో పాటు నెగిటివ్స్ కూడా రివ్యూ ఇచ్చాడు. “ మొత్తం పైన సంతృప్తినిచ్చే యాక్షన్ డ్రామా.. ఈ సినిమా మంచి యాక్షన్‌ని కలిగి ఉంది కానీ చాలా వరకు ఎమోషనల్ కనెక్షన్ లేదు! కొన్నిసార్లు సినిమా చాలా స్లోగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్.. మరికొన్ని బ్లాక్‌లు చాలా బాగున్నాయి కానీ మధ్యలో కొన్ని సీన్లు మాత్రం ప్రభావవంతంగా ఉండవు. కొన్ని సమయాల్లో కొంచెం గందరగోళంగా ఉంది.  BGM సినిమా అతిపెద్ద లెట్ డౌన్‌లలో ఒకటి.  ఏది ఏమైనప్పటికీ, ప్రభాస్‌ను మాస్ అవతార్‌లో చూడటం ఒక విందుతో పాటు సినిమాని కలిపి ఉంచే కొన్ని నీల్ మార్క్ ఎలివేషన్ బ్లాక్‌లు.  చూడదగినది!  రేటింగ్: 2.75/5’ అంటూ ఈ సినిమాకి 2.75 రేటింగ్ కూడా ఇచ్చారు.

 

కాగా ఈ రివ్యూలు.. రెస్పాన్స్ లు అన్నీ చూస్తూ ఉంటే. సినిమా తప్పకుండా హిట్ నుంచి బ్లాక్ బస్టర్ వరకు అయ్యే ఛాన్సులు ఉన్నాయని అర్థమవుతుంది. ప్రభాస్ గత రెండు చిత్రాలకి మొదటి షో నుంచి డిజాస్టర్ టాక్ వచ్చింది. కానీ సలార్ కి మాత్రం మంచి రెస్పాన్స్ వస్తూ ఉండటంతో ప్రభాస్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు అందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి డైనోసార సక్సెస్ ని చూస్తుందో వేచి చూడాలి.

Also read: CM Revanth Reddy Tour: ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన, మోదీని కలిసే అవకాశం, త్వరలో కేబినెట్ విస్తరణ

Also read: SRH New Captain: ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ మార్పు ? అందుకే అతడిని అంత ధరకు కొనుగోలు

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

  

Trending News