Prabhas: కీలకమైన నెలగా మారిన మార్చ్.. ప్రభాస్, రామ్ చరణ్ అభిమానుల ఆశలన్నీ ఈ నెల పైనే!

Ram Charan: ఫిబ్రవరి సినిమా సందడి ఊహించిన రేంజ్ లో లేకపోవడంతో సినీ లవర్స్ ఆశలు మొత్తం రాబోయే మార్చి పై ఉన్నాయి. అంతేకాకుండా ఈ మార్చ్ లో ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఇద్దరు హీరోల సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఆశిస్తున్నారు అభిమానులు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 4, 2024, 11:30 AM IST
Prabhas: కీలకమైన నెలగా మారిన మార్చ్.. ప్రభాస్, రామ్ చరణ్ అభిమానుల ఆశలన్నీ ఈ నెల పైనే!

Ram Charan- Prabhas:
టాలీవుడ్ లో ప్రభాస్ కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి చిత్రంతో వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న ఈ యాక్టర్ వరుస డిజాస్టర్ తో బాధపడుతూ వచ్చాడు. అయితే ప్రభాస్ నటించిన సలార్ చిత్రం డార్లింగ్ అభిమానులకు  సాటిస్ఫాక్షన్ కలిగించే విధంగా రికార్డులు సృష్టించింది. ఈ నేపథ్యంలో రాబోయే అతని నెక్స్ట్ చిత్రాలపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రభాస్ కల్కి మూవీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని మే తొమ్మిదిన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

మరో పక్క ఈ చిత్రం వాయిదా పడుతుంది అన్న పుకార్లు జోరుగా సాగుతున్నాయి. కానీ చిత్ర బృందం మాత్రం రూమర్స్ ని కొట్టి పారేస్తూ కల్కి ఎట్టి పరిస్థితుల్లో మే 9న విడుదల అవుతుంది అని .. మార్చి లో మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేస్తాము అని కచ్చితంగా చెబుతున్నారు. మూవీ కి సంబంధించిన సాంగ్స్ ని కూడా మార్చి లోనే విడుదల చేయబోతున్నట్లు ఇన్సైడ్ టాక్. ఈ నెలలో ప్రమోషన్స్ ప్రారంభమైతే కచ్చితంగా చిత్రం విడుదల మే 9న ఉంటుంది అన్న భరోసా ప్రేక్షకులకు కలుగుతుంది. దీంతో డార్లింగ్ అభిమానులు ఎప్పుడు కల్కి ప్రమోషన్స్ మొదలవుతాయా అని ఆశగా ఎదురు చూస్తున్నారు.

మరోవైపు ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ నుంచి మరొక చిత్రం శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే.అతను నటిస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రం నుంచి అప్డేట్ సరిగ్గా రాకపోవడం చెర్రీ అభిమానులకు ఎంతో కొరతగా ఉంది. ఈ విషయంపై సోషల్ మీడియాలో వాళ్ళు పలు రకాలుగా తమ అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు. సినిమా షూటింగ్ ప్రారంభమై సంవత్సరాలు గడుస్తున్న ఇంకా ఎప్పుడు విడుదల అవుతుంది అన్న విషయం పై కూడా స్పష్టత లేదు.

మూవీ షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు రామ్ చరణ్ ఫస్ట్ లుక్ లేక టీజర్  విడుదల కాలేదు.మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా  చిత్ర బృందం టీజర్ విడుదల చేస్తారు అని టాక్. మరోపక్క రామ్ చరణ్, బుజ్జిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రానికి సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ రామ్ చరణ్ పుట్టినరోజు కు విడుదల చేసే అవకాశం ఉంది. రామ్ చరణ్ ..గేమ్ ఛేంజర్ మూవీ సెప్టెంబర్ లో విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు టాక్. కనీసం ఈ నెలలో అయినా తమ హీరో మూవీ కి సంబంధించిన అప్డేట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మెగా అభిమానులు. ఈ నేపథ్యంలో మార్చి నెల నిజంగా ప్రభాస్, రామ్ చరణ్ సినిమాల విషయంలో నిర్ణయాత్మకమైన నెలగా మారబోతోంది.

Read More: Grapes Fruit Benefits: ద్రాక్ష పండు రుచికరం మాత్రమే కాదు ఆరోగ్యకరమైనది కూడా..!

Read More: Rashmika: చిన్నప్పటి కళ ఇప్పటికి నెరవేరింది.. రష్మిక ఎమోషనల్ పోస్ట్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News