Prabhas: ప్రభాస్ ఇజ్జత్ కా సవాల్.. అదే కనుక జరిగితే రెబల్ స్టార్ పరువు గంగలో కలిసినట్టే..

Prabhas: ప్రభాస్ ఇజ్జత్ కా సవాల్ అంటున్నారు. అది కనుక జరిగితే రెబల్ స్టార్‌ ఫ్యాన్స్‌తో పాటు డార్లింగ్ స్టార్‌డమ్ పై అనుమానాలు కలిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంతకీ ప్రభాస్ అభిమానులు ఇంతగా బాధ పడుతున్న మ్యాటర్ ఏమిటంటే.. ?

Last Updated : Feb 15, 2024, 09:47 AM IST
Prabhas: ప్రభాస్ ఇజ్జత్ కా సవాల్.. అదే కనుక జరిగితే రెబల్ స్టార్ పరువు గంగలో కలిసినట్టే..

Prabhas:బాహుబలి తర్వాత ఆ రేంజ్ సక్సెస్‌లేని ప్రభాస్.. గతేడాది చివర్లో 'సలార్ పార్ట్ -1 సీజ్ ఫైర్' మూవీతో మళ్లీ పవర్‌ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చారు. ఈ సినిమాకు పోటీగా షారుఖ్ 'డంకీ' విడుదల కావడం.. నార్త్‌లో అక్కడ సలార్ సినిమాను తొక్కాలని చూడటం వంటి కొన్ని కారణాలతో ఈ సినిమా వెయ్యి కోట్ల మార్క్‌ను రీచ్ కాలేకపోయింది. కేవలం రూ. 700 కోట్లకే థియేట్రికల్ బాక్సాఫీస్ రన్ కంప్లీట్ చేసుకుంది.

 

ఆ సంగతి పక్కన పెడితే..  ప్రస్తుతం ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తున్నారు. కల్కి, రాజా సాబ్, సలార్ 2 శౌర్యాంగ పర్వం, స్పిరిట్, సిద్ధార్ధ్ ఆనంద్‌లతో వరుస సినిమాలు కమిటయ్యాడు. దాంతో పాటు మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న 'కన్నప్ప'లో ప్రభాస్.. మహా శివుడి పాత్రలో కాసేపు అలా కనిపించనున్నారు.

 

మోహన్ బాబు ఫ్యామిలీతో పాటు మంచు విష్ణుతో ఉన్న స్నేహంతో పాటు మొహమాటం కారణంగా ప్రభాస్ ఈ సినిమాలో కెమియో రోల్ చేస్తున్నాడు. దీంతో ఈ సినిమా రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆదిపురుష్‌లో ప్రభు శ్రీరాముడి పాత్రలో కనిపించిన రెబల్ స్టార్.. ఇపుడు 'కన్నప్ప'లో శివుడు పాత్రలో కనిపించనున్నారు.

ఆ సంగతి పక్కన పెడితే.. ఈ మధ్యాకలంలో బడా సినిమాల్లో క్యామియో రోల్స్ ఎక్కువైపోయాయి. హిందీ హీరోలు ఎక్కువగా ఇలాంటి క్యామియో రోల్స్ ఎక్కువగా చేస్తుంటారు. కానీ సౌత్ హీరోలు అతిథి పాత్రల్లో నటించడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఇక రజినీకాంత్ లాస్ట్ ఇయర్ బ్లాక్ బస్టర్ 'జైలర్‌'లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ అతిథి పాత్రల్లో కనిపంచారు. కథలో భాగంగా ఆయా పాత్రలు ఉండటంతో ఈ సినిమాలు సూపర్ హిట్‌గా నిలిచాయి.  

అప్పట్లో రామ్ చరణ్ 'బ్రూస్‌లీ' మూవీతో చిరంజీవి క్యామియో రోల్‌తో ఎలాంటి యూజ్ దక్కలేదు. అసలు మెలేజ్ కూడా రాలేదు. అంతకు ముందు చిరంజీవి 'శంకర్ దాదా జిందాబాద్‌'లో పవన్ కళ్యాణ్ క్యామియో వల్ల సినిమాకు ఎలాంటి ప్రయోజనం దక్కలేదు. లాస్ట్ ఇయర్ సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'కిసీ కీ బాయ్ కిసీ కా జాన్' సినిమాలో వెంకటేష్ నటించారు. అటు రామ్ చరణ్ కూడా క్యామియో పాత్రలో ఓ పాటలో అలరించాడు. అయినా ఈ సినిమాకు పెద్దగా ఒరిందేమి లేదు.

తాజాగా రజినీకాంత్ 'లాల్ సలామ్‌' విషయానికొస్తే.. ఈ సినిమాలో క్యామియో రోల్లో నటించారని ప్రచారం చేసారు. కానీ సినిమాలో ముప్పావు వంతు భాగం తలైవా ఉంటాడు. పైగా ఈ సినిమాను రజినీకాంత్ సినిమా అనే ప్రచారం చేసారు. ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు తెలుగులో కనీసం ఓపెనింగ్స్ రాలేదు. జైలర్ వంటి లైఫ్ టైమ్ హిట్ కొట్టిన తర్వాత వచ్చిన సినిమాకు ఈ రేంజ్ వసూళ్లు రావడం చూసి ట్రేడ్ వర్గాలు షాక్‌కు గురువుతున్నాయి. ఈ సినిమాకు తెలుగులో కనీసం ఓపెనింగ్స్ లేక షోలు కూడా క్యాన్సిల్ చేసారు. తెలుగులో నెగిటివ్ షేర్స్ రావడం అది కూడా రజినీకాంత్ సినిమాకు ఈ రేంజ్ వసూళ్లు చేసి ఆయన అభిమానులే నోరెళ్ల బెడుతున్నారు. ఆయన నటించిన పాత సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేసినా.. బీభత్సమైన వసూళ్లు దక్కేవి. అలాంటిది తలైవా సినిమాకు ఈ రేంజ్ వసూళ్లు రావడం అనేది ఒకింత షాకింగ్ పరిణామమే.

అసలు ఇలాంటి ఓ రోజు వస్తుందని బహుశా రజినీకాంత్‌ ఫ్యాన్స్‌తో పాటు ఆయన కూడా ఊహించి ఉండరు. ఏదైతే చూడకూడదని ఆయన అభిమానులు ఆశించారో అదే జరిగింది రజినీకాంత్ విషయంలో. మొత్తంగా అయ్యో ఫాఫం అనేలా తయారైంది తలైవా పరిస్థితి. ఈ సినిమాలో తలైవా రాకతో ఈ మూవీ లెవల్ కూడా పెరిగింది. తీరా రిలీజ్‌ సమయం వచ్చే వరకు ఈ మూవీపై ఎలాంటి హోప్స్ లేవు. ఇక తమిళంలో ఈ సినిమా చూడటానికి ఆయన ఫ్యాన్స్ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. దీంతో తమిళనాడులో చాలా చోట్ల ప్రీమియర్స్ కాకుండా.. తండ్రి వంటి సూపర్ స్టార్‌ను పెట్టుకొని కూడా రొటిన్ కథతో ఈ సినిమాను తెరకెక్కించడం ఈ సినిమాకు కోలుకోలేని దెబ్బ తీసింది.

తాజాగా ప్రభాస్ ఫ్యాన్స్ కూడా మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న 'కన్నప్ప' మూవీలో ప్రభాస్, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలు క్యామియో రోల్స్ చేస్తున్నారు. గతంలో ప్రభాస్.. ప్రభుదేవా దర్శకత్వంలో అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటించిన 'యాక్షన్ జాక్సన్‌'లో కెమియో రోల్ చేసారు. అది ఓపెనింగ్స్‌కు పెద్దగా ఉపయోగాపడలేదు. ఇపుడు చాలా యేళ్ల తర్వాత కన్నప్ప సినిమాలో ప్రభాస్ అతిథి పాత్ర హైప్ తీసుకొచ్చి ఈ మూవీకి కాసుల వర్షం కురిపిస్తుందా.. ? లేకపోతే 'లాల్ సలాం' తరహాలో ప్రేక్షకులు ప్రభాస్ సినిమా కాదని ఆయన ఫ్యాన్స్ ఈ సినిమాను లైట్ తీసుకుంటారా అనేది చూడాలి. ఒకవేళ ప్రభాస్ హీరో కాదు కాబట్టి.. కన్నప్పకు షాక్ ఇస్తారా ? ఒకవేళ అదే గనుక జరిగితే ప్రభాస్‌కు ఇది కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి. లాల్ సలాం తరహాలో కన్నప్ప కు ప్రభాస్ ఫ్యాక్టర్ పనిచేస్తుందా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Also read: AP Capital Issue: ఏపీ రాజధానిపై నిర్ణయం కేంద్రానిదే, మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News