Project K Update: రెండు పార్టులుగా ప్రభాస్-నాగ్ అశ్విన్ మూవీ?

Project K Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'ప్రాజెక్టు-కే' రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 27, 2023, 11:04 AM IST
Project K Update: రెండు పార్టులుగా ప్రభాస్-నాగ్ అశ్విన్ మూవీ?

Project K To Release In Two Parts: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా 'ప్రాజెక్టు-కే'కు సంబంధించి రోజుకో ఓ ఆసక్తికర వార్త నెట్టింట సందడి చేస్తోంది. భారీ బడ్జెట్ తో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు మేకర్స్. రీసెంట్ గా ఈ చిత్రంలో కమల్ హాసన్  భాగమయ్యారు. ఇందులో ఆయన విలన్ గా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ఆదిపురుష్ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి. ఈ మూవీని ఐదు భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా జనవరి 12, 2024న విడుదల చేయనున్నారు. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట చక్కెర్లు కొడుతోంది. 

మేకర్స్ ప్రాజెక్ట్ కేను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మెుదటి పార్ట్ చివరిలో హీరో విలన్ తో పోరాడటానికి భవిష్యత్తులోకి ప్రయాణించడాన్ని చూపిస్తే.. రెండో భాగంలో హీరోకి విలన్ కు జరిగే పోరుకు గురించి చూపించనున్నారని సమాచారం. ప్రేక్షకుల మదిలో గుర్తిండిపోయే చిత్రంగా దీనిని తీర్చిదిద్దుతున్నారు. అందుకే ఎక్కడా కాంప్రమైస్ కాకుండా విజువల్ ఎఫెక్ట్స్, CGI మరియు AI కోసం భారీగా ఖర్చు పెడుతున్నారు. 

ఈ చిత్రంలో కమల్ హాసన్ తోపాటు ఇందులో బాలీవుడ్ స్టార్లు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే మరియు దిశా పటానీలు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. సుమారు రూ. 500 కోట్లతో వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి అశ్వని దత్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఈ మూవీకి డైలాగ్ రైటర్ గా సాయి మాధవ్ బుర్రా పనిచేస్తున్నారు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు. వచ్చే నెలలో ఈ మూవీకి సంబంధించిన ఆఫీషియల్ టైటిల్, మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన లాంఛ్ ఈవెంట్ ను అమెరికాలో చేయనున్నారు. 

Also Read: Thalapathy vijay: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్​పై కేసు.. ఆ పాటే కారణమా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News