Poonam Kaur : పవన్ కళ్యాణ్‌ సినిమాపై పూనమ్ కౌర్‌ ఫైర్.. భగత్‌ సింగ్‌ను కించపర్చడమేనంటూ ట్వీట్

Ustaad Bhagat Singh Poster పవన్ కళ్యాణ్‌ పోస్టర్‌ల మీద ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అప్డేట్‌తో నేడు ట్విట్టర్ మొత్తం రచ్చ రచ్చగా మారుతోంది. నేటి సాయంత్రం ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ను మేకర్లు విడుదల చేయబోతోన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 11, 2023, 12:19 PM IST
  • నెట్టింట్లో ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్లు
  • పోస్టర్ మీద మండిపడ్డ పూనమ్ కౌర్
  • సెటైర్లు వేస్తున్న పవర్ స్టార్ ఫ్యాన్స్
Poonam Kaur : పవన్ కళ్యాణ్‌ సినిమాపై పూనమ్ కౌర్‌ ఫైర్.. భగత్‌ సింగ్‌ను కించపర్చడమేనంటూ ట్వీట్

Poonam Kaur Fires on Ustaad Bhagat Singh పవన్ కళ్యాణ్‌ పూనమ్ కౌర్ మధ్య ఎప్పుడూ కోల్డ్ వార్ నడుస్తూనే ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక గురూజీ అంటూ పరోక్షంగా ట్వీట్లు వేస్తూ త్రివిక్రమ్‌ను కూడా ఇరికిస్తుంటుంది. పూనమ్ కౌర్ విషయంలో ఆ మధ్య కత్తి మహేష్‌ చేసిన కామెంట్లు, పూనమ్ కౌర్ ఆడియో లీక్ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. ఓ పెద్ద డైరెక్టర్ తనని ఎలా అవమానించాడో పూనమ్ కౌర్ చెప్పిన మాటలు అందరికీ తెలిసిందే.

ఇప్పుడు పూనమ్ కౌర్ మళ్లీ ట్రెండ్ అవుతోంది. దీనికి ఓ కారణం ఉంది. పూనమ్ కౌర్ ట్విట్టర్‌లో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే తాజాగా పవన్ కళ్యాణ్‌ సినిమా మీద పూనమ్ కౌర్ ఫైర్ అయింది. ఇది తప్పు, ఆ మహనీయుడిని అవమానించడమే అంటూ మండి పడిపోయింది. ఈ ట్వీట్ మీద ఇప్పుడు అభిమానులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు.

 

పవన్ కళ్యాణ్ కాళ్ల కింద ఉస్తాద్ భగత్ సింగ్ పేరు పెట్టారు. దీనిపై పూనమ్ కౌర్ స్పందించింది. ఇది కచ్చితంగా ఆయన్ను అవమానించడం లాంటిదే.. దీన్ని వెంటనే భగత్ సింగ్ యూనియన్‌కు రిపోర్ట్ చేయండి అని ట్వీట్ వేసింది. దీనిపై పవన్ కళ్యాణ్‌ అభిమానులు ఫైర్ అవుతున్నారు. పనీ పాట లేకుండా ఉన్నట్టుగాన్నావ్.. అందుకే ఇలాంటి ట్వీట్లు వేసుకుంటూ ఉంటున్నావ్ అని కౌంటర్లు వేస్తున్నారు.

తాజాగా మళ్లీ ఓ ట్వీట్ వేసింది పూనమ్ కౌర్. స్వతంత్ర సమరయోధులను మీరు గౌరవించకపోయినా కూడా కనీసం మర్యాద అయినా ఇవ్వాలి.. ఇలా కించపర్చకూడదు.. ఆయన పేరుని నీ కాలి వద్ద పెట్టుకుంటావా?.. ఇది ఇగోనా? నీ నిర్లక్ష్యమా? అంటూ పూనమ్ కౌర్ మండిపోతోంది.

Also Read:  Adipurush Trailer: ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్.. మా రాఘవుడి కథే రామాయణం.. ఆ ఒక్కటే మైనస్

పూనమ్ కౌర్ పవన్ కళ్యాణ్‌ మధ్య ఏం జరిగిందనే విషయం మీద ఇప్పటికీ ఓ చర్చ నడుస్తూనే ఉంటుంది. పూనమ్ కౌర్ ఎప్పుడూ కూడా తనకు జరిగిన అన్యాయం ఏంటో బయటకు చెప్పదు. పరోక్షంగా ట్వీట్లు వేస్తూ త్రివిక్రమ్ మీద కౌంటర్లు వేసినట్టుగా అనిపిస్తుంది. కానీ ఇంత వరకు పూనమ్ కౌర్ ఏ విషయాన్ని కూడా క్లియర్‌ కట్‌గా చెప్పనేలేదు.

Also Read:  HBD Sai Pallavi : నీ చెల్లిగా పుట్టినందుకు నేను లక్కీ.. మిస్ అవుతున్నా.. సాయి పల్లవి సిస్టర్ స్పెషల్‌ విషెస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News