Pawan Kalyan: మళ్ళీ సినిమాల మీద దృష్టిసారిస్తున్న పవన్.. ముందుగా వచ్చే సినిమా అదే!

Pawan Kalyan : ఎన్నికల హంగామా అయిపోయింది. మళ్లీ జనసేనాని పవన్ కళ్యాణ్ సినిమాల మీద దృష్టి పెట్టే అవకాశం వచ్చింది. పెండింగ్ లో ఇప్పటికే చాలా సినిమాలు ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ వాటిల్లో ఏది ముందు పూర్తి చేస్తారు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది.   

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 15, 2024, 12:14 PM IST
Pawan Kalyan: మళ్ళీ సినిమాల మీద దృష్టిసారిస్తున్న పవన్.. ముందుగా వచ్చే సినిమా అదే!

Pawan Kalyan Movies : ఎట్టకేలకి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావిడి పూర్తయింది. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీచేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఆయన విజయం సాధించే అవకాశాలు ఈసారి ఎక్కువగానే ఉన్నాయని కొందరు చెబుతున్నారు. విజయం గురించి పక్కన పెడితే ఎన్నికల సందర్భంగా చాలా మంది సినీ సెలబ్రిటీలు పవన్ కళ్యాణ్ కి తమ మద్దతు ప్రకటించారు. మెగా కుటుంబ సభ్యులతో పాటు హరీష్ శంకర్ వంటి డైరెక్టర్లు కూడా.. ఇన్ డైరెక్టుగా పవన్ కళ్యాణ్ కి తమ ఓటు అని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇక ఫలితం గురించి తెలియాలంటే జూన్ దాకా ఆగాల్సిందే. 

ఎన్నికల విషయాలను కాసేపు పక్కన పెట్టేస్తే పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలను ఎప్పుడు మొదలు పెడతారు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. ఒకవేళ పవన్ సినిమాల షూటింగ్ మొదలుపెడితే.. అందులో ముందుగా ఏ సినిమా మొదలుపెడతారు.. ఏది పూర్తి చేస్తారు అనేది కూడా చర్చనీయంగా మారింది.

ఎన్నికలకి ముందు వరకు పార్టీకి సంబంధించిన చాలా పనులతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. చాలా వరకు సినిమాలను పెండింగ్ లో పెట్టేసారు. ఈ క్రమంలో ప్రస్తుతానికి అయితే పవన్ కళ్యాణ్ ఫోకస్ మొత్తం ఓజీ సినిమా మీదనే ఉన్నట్లు తెలుస్తోంది. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాకి సంబంధించిన మిగిలిన షూటింగ్ కూడా పూర్తి చేసి సినిమాని విడుదల చేయాలని పవన్ కళ్యాణ్ కూడా ప్లాన్ చేస్తున్నారట. నిన్న మొన్నటిదాకా ఎలక్షన్స్ హడావిడి, ప్రచారాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల్లో పాటు రెస్ట్ తీసుకొని తన కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి అనుకుంటున్నారట. పవన్ కళ్యాణ్ త్వరలో విహారయాత్రకు వెళ్లే అవకాశం కూడా ఉందని సమాచారం. తిరిగి వచ్చాక పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా షూటింగ్ మీద దృష్టి పెడతారని తెలుస్తోంది. 

అంతేకాకుండా త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కూడా పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. ప్రస్తుతం హరీష్ శంకర్ రవితేజ హీరోగా ఒక సినిమాతో బిజీగా ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ ఓకే అంటే.. హరీష్ శంకర్ ఆ సినిమాను హోల్డ్ లో పెట్టైనా సరే ఈ సినిమాను పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. 

మరోవైపు హరి హర వీర మల్లు షూటింగ్ కూడా పూర్తి చేయాల్సి ఉంది. మొత్తంగా ఈ సినిమాల షూటింగ్స్ అన్నీ ఈ ఏడాది చివరిలోపు పూర్తి చేయాలి అని పవన్ కళ్యాణ్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటి అంటే.. అందరూ అనుకుంటున్నట్టు పవన్ కళ్యాణ్ ఒకవేళ ఎన్నికల్లో గెలిస్తే మాత్రం సినిమాల షెడ్యూల్స్ లో మార్పులు రావచ్చు.

Read more: MP Elections 2024: ఎన్నికల వేళ కాంగ్రెస్ బంపర్ ఆఫర్.. ఇద్దరు భార్యలున్న వారికి కూడా ఆ పథకం.. వీడియో వైరల్..

Read more: Smell of Cooking Food: వంట స్మెల్ చూసి వావ్ అంటున్నారా..?.. షాకింగ్ విషయాలు వెల్లడించిన ఎన్ఓఏఏ పరిశోధకులు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News