Mamitha Baiju : ప్రేమలు బ్యూటీ తెలుగు ఎంట్రీ…ఏకంగా స్టార్ హీరో సినిమాతో

Mamatha Biju Next Movie : ప్రేమలు సినిమాతో మలయాళం ప్రేక్షకులు మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టిన మమిత బైజు ఇప్పుడు టాలీవుడ్ లో కూడా అడుగుపెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హీరోయిన్గా నటించే అవకాశం వచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు కోడైకూస్తున్నాయి

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 12, 2024, 10:57 PM IST
Mamitha Baiju : ప్రేమలు బ్యూటీ తెలుగు ఎంట్రీ…ఏకంగా స్టార్ హీరో సినిమాతో

Mamitha Baiju Tollywood Entry : మలయాళం సినిమా ప్రేమలు తెలుగులో కూడా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ ఆయన సంగతి తెలిసిందే. అయితే సినిమా కంటే ఎక్కువగా ఆ సినిమాలో హీరోయిన్ నటించిన మమిత బైజు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ఈ ఒక్క సినిమా సక్సెస్ తో మమిత ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. 

నిజానికి ప్రేమలు సినిమా కంటే ముందు ఆమె పది సినిమాలకు పైగానే నటించింది. అందులో కొన్నిట్లో హీరోయిన్ గా కూడా నటించింది. కానీ ఆ సినిమాలు ఏమీ.. తీసుకురాని పేరు ప్రేమలు సినిమా మమిత బైజు కి తీసుకువచ్చింది. ఈ ఒక్క సినిమాతో ఆమె మలయాళంలో మాత్రమే కాక తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది.

ఈ సినిమా తెలుగులో కూడా డబ్ అయ్యి రిలీజ్ అయింది. తెలుగు ఆడియన్స్ కూడా ప్రేమలు సినిమాని బాగానే హిట్ చేశారు. అటు మలయాళం ఇటు తెలుగు ప్రేక్షకులు మమిత పెర్ఫామెన్స్ కి ఫిదా అయిపోయారు. దీంతో టాలీవుడ్ లో కూడా మమిత బైజు మంచి ఇమేజ్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నిర్మాతలు కూడా మమితను తెలుగులో హీరోయిన్ గా పరిచయం చేయడానికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే చాలామంది తెలుగు నిర్మాతలు ఆమెను సంప్రదించారట. అందులో విజయ్ దేవరకొండ హీరోగా గౌతం తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలు ఈమెకు హీరోయిన్ గా అవకాశం వచ్చిందని తెలుస్తోంది. 

నిజానికి ఈ సినిమాలో ముందు శ్రీలీల హీరోయిన్ గా అనుకున్నారు. కానీ కొన్ని కారణాలవల్ల ఆమెను కాకుండా వేరే హీరోయిన్ ని వెతుకుతున్న దర్శక నిర్మాతలు మమిత బైజుని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలామంది మలయాళం హీరోయిన్లు తెలుగులో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు.

కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ లాంటి హీరోయిన్లు స్టార్ స్టేటస్ ని కూడా అందుకున్నారు. మరి వారి బాటలోనే వెళుతున్న మమిత బైజు కూడా తెలుగులో పేరు తెచ్చుకుంటుందో లేదో చూడాలి. విజయ్ దేవరకొండ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి. సినిమా హిట్ అయితే ఆమెకి మరిన్ని తెలుగు ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.

Read more: AP Elections: ఏపీలో ప్రలోభాల పర్వం.. పిఠాపురం, మంగళగిరి, కుప్పం, నగరిలో భారీగా డబ్బులు, కానుకలు

Read more: Election commission: పోలింగ్ సిబ్బందికి ఈసీ అందించే ఫుడ్ మెనూ ఏంటో తెలుసా..?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News