Kushi Movie Trailer: రౌడీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 'ఖుషి' ట్రైలర్‌ రిలీజ్ డేట్ ఫిక్స్..

Kushi Movie: విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ 'ఖుషి'. ఈ సినిమా సెప్టెంబరు 01న ఆడియెన్స్ కు ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ డేట్ ను లాక్ చేశారు మేకర్స్. ఎప్పుడంటే..  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 7, 2023, 03:33 PM IST
Kushi Movie Trailer: రౌడీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 'ఖుషి' ట్రైలర్‌ రిలీజ్ డేట్ ఫిక్స్..

Kushi Movie Trailer Update: విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), సమంత(Samantha)  లీడ్ రోల్స్ లో నటిస్తున్న చిత్రం '‘ఖుషి (Kushi)'’. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబరు 01న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని.. ప్రమోషన్స్ కు రెడీ అయింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, సాంగ్స్  మూవీపై అంచనాలను ఓ రేంజ్ లో పెంచేశాయి. నా రోజా నువ్వే, ఆరాధ్య సాంగ్స్ కు అయితే ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ పాటలు యూట్యూబ్ లో రికార్డు క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. 

ఈ మూవీ ట్రైలర్ ను ఆగస్టు 09న రిలీజ్ చేయబోతున్నట్లు విజయ్ దేవరకొండ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ ట్రైలర్ నిడివి 2 నిమిషాల 41 సెకన్ల ఉందంటూ విజయ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఇది వరకే ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కు సీబీఎఫ్‌సీ (CBFC) ‘యూ’ సర్టిఫికేట్ ఇచ్చింది. కాశ్మీర్‌ బ్యాక్‌గ్రాప్‌లో సాగే లవ్ స్టోరీగా తెలుస్కోంది. నిజానికి ఈ మూవీ రెండు నెలల ముందే విడుదల కావాల్సి ఉండగా.. హీరోయన్ సమంతకు మయోసైటిస్ వ్యాధి భారిన పడటంతో షూటింగ్ ఆలస్యమైంది. దాంతో ఈ సినిమా విడుదలను సెప్టెంబరు నెలకు పోస్ట్ పోన్ చేశారు మేకర్స్. ఈ మూవీలో జయరాం, సచిన్‌ ఖేడేకర్‌, మురళీశర్మ తదితరులు కీ రోల్స్ చేస్తున్నారు. ఈ మూవీకి నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి నిర్మాతలుగా వ్యవహారించారు. 

Also Read: Megastar Chiranjeevi: నో అన్నయ్య.. ఐ మిస్ యు డార్లింగ్.. కీర్తీ సురేష్‌పై మెగాస్టార్ క్రేజీ కామెంట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News