Jawan Collection: 5 రోజుల్లో రూ. 500 కోట్లు.. బాక్సాఫీసుపై 'కింగ్' ఖాన్ దండయాత్ర

ప్రపంచవ్యాప్తంగా జవాన్ సినిమా అంచనాలను మించి కలెక్షన్ లను సాధిస్తుంది. 5 రోజులకు గాను 500 కోట్లు కొల్లగొట్టిన షారుక్ సినిమాకి అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటి వరకు బాలీవుడ్ చరిత్రలో వారాంతలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా 'జవాన్' నిలిచింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 12, 2023, 05:12 PM IST
Jawan Collection: 5 రోజుల్లో రూ. 500 కోట్లు.. బాక్సాఫీసుపై 'కింగ్' ఖాన్ దండయాత్ర

Jawan Collection: కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్.. ఈ ఏడాది మరోసారి బాక్సాఫీసుకు తన పవరేంటో చూపిస్తున్నారు. జనవరిలో 'పఠాన్' చిత్రంలో సూపర్ హిట్ సాధించిన షారుఖ్.. ఇప్పుడు 'జవాన్' మూవీతో బ్లాక్ బాస్టర్ సొంతం చేసుకున్నారు. ఈ సినిమా థియేటర్లలో రిలీజైన రోజు నుంచి ఇప్పటి వరకు కలెక్షన్స్ పెరుగుతున్నాయి. బాలీవుడ్ బాక్సాఫీసు ఎదుట షారుఖ్.. సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నారు. ఇప్పుటికే ఈ చిత్రం సూపర్ హిట్ సొంతం చేసుకొని.. మొదటి వారాంతంలోనే రూ. 500 కోట్ల మార్క్ ను దాటేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 520.79 కోట్ల గ్రాస్ ను ఈ మూవీ వసూలు చేసింది. 

'జవాన్' చిత్రం విడుదలైన వారం రోజుల్లో కేవలం బాలీవుడ్ లో రూ. 71.63 కోట్లతో పాటు 4వ రోజు రూ. 8.47 కోట్ల వసూళ్లలో విజయవంతంగా కొనసాగుతోంది. మిగిలిన భాషల్లో ఇప్పటి వరకు రూ. 80.10 కోట్ల భారీ వసూళ్లను సాధించింది. ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం బాలీవుడ్ చరిత్రలో వారాంతలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా 'జవాన్' నిలిచింది. ఈ క్రమంలో మూవీ కొత్త రికార్డులను సృష్టించడం పక్కా అని సినీ విశ్లేషకులు అంటున్నారు. 

Also Read: Mammootty: మమ్ముట్టి ఇంట్లో మరో విషాదం... తల్లి మృతి చెందిన బాధ నుంచి తేరుకోకముందే ..  

షారుక్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన 'జవాన్' చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఎంటర్‌టైన్మెంట్ తో పాటు ప్రభావవంతమైన సందేశాన్ని ఈ చిత్రం ద్వారా అందించారు. 

షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో 'జవాన్' మూవీ తెరకెక్కింది. షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. హిందీలోనే కాకుండా దక్షిణాది భాషలన్నింటిలోనూ ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా భారీగా విడుదల చేశారు. ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా నటించగా.. విజయ్ సేతుపతి విలన్ పాత్ర పోషించారు. వీరితో పాటు దీపికా పదుకొణె, ప్రియమణి తదితరులు నటించారు.

Also Read: Realme 60X 5G Price: మొదటి సేల్‌లోనే Realme Narzo 60x 5Gపై భారీ తగ్గింపు, డిస్కౌంట్‌ ఆఫర్స్‌, ఇతర వివరాలు!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News