Ileana: నన్ను విమర్శించండి.. నా ప్రియుడిని వివర్శిస్తే తట్టుకోలేను.. ఇలియానా హాట్ కామెంట్స్..

Ileana: ఇలియానా గురించి కొత్తగా ఇంట్రడ్యూస్ అవసరం లేదు. వైవియస్ చౌదరి చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన 'దేవదాస్‌' మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఇలియానా.. ఆ తర్వాత పోకిరి సినిమాతో నెంబర్ వన్ హీరోయిన్‌గా టాలీవుడ్ తెరను ఏలింది. తాజాగా పెళ్లికి ముందే ఓ బిడ్డకు జన్మనిచ్చి వార్తల్లో నిలిచింది. ఈ సందర్భంగా తన బిడ్డకు కారకుడైన ప్రియుడును ఎవరైనా విమర్శిస్తే తట్టుకోలేనంటూ వ్యాఖ్యలు చేసింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 18, 2024, 03:38 PM IST
Ileana: నన్ను విమర్శించండి.. నా ప్రియుడిని వివర్శిస్తే తట్టుకోలేను.. ఇలియానా హాట్ కామెంట్స్..

Ileana: గోవా సుందరి ఇలియానా గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. వైవియస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన 'దేవదాసు' మూవీతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఈ భామ వెనుదిరిగి చూసుకోలేదు. ఇక పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్‌ బాబు హీరోగా నటించిన 'పోకిరి' బ్లాక్ బస్టర్‌తో ఇలియానా టాప్ హీరోయిన్ అయింది. ఆ తర్వాత తెలుగులో టాప్ హీరోలందరి సరసన నటించింది. అంతేకాదు తెలుగులో రూ. కోటి పారితోషకం అందుకున్న తొలి హీరోయిన్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఓవైపు తెలుగులో టాప్ హీరోయిన్‌గా రాణిస్తూనే హిందీలో తన లక్‌ పరీక్షించుకుంది. అక్కడ కూడా పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అంతేకాదు ఈమె గత కొన్నేళ్లుగా మైఖేల్ వ్యక్తితో రిలేషన్‌లో ఉంది. అతని ద్వారా ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. అతని పేరు కోవా ఫినిక్స్ డోలన్ అని పేరు పెట్టింది. అతని రాకతో నా జీవితం పూర్తిగా మారిపోయింది.

ఈ సందర్భంగా పెళ్లి కాకముందే పిల్లాడిని కనడంపై కొంత మంది తనను ట్రోల్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది ఇలియానా. మరోవైపు సోషల్ మీడియాలో తన భర్త మైఖేల్‌ను విమర్శించడాన్ని తట్టుకోలేకపోయానన్నారు. తాను పబ్లిక్‌ డొమైన్‌లో ఉన్నాను కాబట్టి తనను ఏమన్నా పెద్దగా బాధపడను. లైట్ తీసుకుంటాను. కానీ తన బిడ్డకు కారకుడైన మైఖేల్‌ను ఏమైనా అంటే తట్టుకోలేన్నారు. అతను నేను గర్భవతిగా ఉన్నపుడు ఎంతో ఆప్యాయంగా చూసుకున్నాడు. అతనితో పాటు మా అమ్మ కూడా తనను కంటికి రెప్పలా కాపాడిందనే విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. తాను మనో ధైర్యం కోల్పోయినపుడు ధైర్యం నూరిపోసిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం తనకు తన ప్రియుడు, కొడుకే లోకం అంటోంది గోవా సుందరి. నా భర్త మంచి మనసున్న వ్యక్తి. నేను నటించిన సినిమాలోని పాటల పల్లవులను కూడా హమ్ చేస్తూ ఉంటాడు. అతని మంచితనానికి ఇంతకన్నా  నిదర్శనం లేదన్నారు.

ఇలియానా మైఖేల్ కంటే ముందు ఓ ఫారెన్‌ ఫోటోగ్రాఫర్‌తో డేటింగ్ చేసిన విషయం తెలిసిందే కదా. ఆ తర్వాత అతనితో బ్రేకప్‌ తర్వాత మైఖేల్‌తో సహ జీవనం చేస్తుంది. వీళ్లిద్దరి ప్రేమ గుర్తుగా ఓ బాబు కూడా జన్మించాడు. ఇలియానా చివరగా తెలుగులో రవితేజ హీరోగా నటించిన 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమాలో నటించింది.

ఇదీ చదవండి: తెలంగాణ పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి .

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News