Ileana D'cruz : తల్లి కాబోతోన్న ఇలియానా?.. హీరోయిన్ పోస్ట్‌పై కామెంట్లు.. తండ్రి ఎవరంటూ ట్రోల్స్

Ileana D'cruz Pregnant ఇలియానా తాజాగా వేసిన పోస్ట్‌ను చూస్తే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. తాను తల్లి కాబోతోన్నట్టుగా పరోక్షంగా చెబుతూ ఓ పోస్ట్ వేసినట్టు అనిపిస్తోంది. ఇక ఇలియానా తల్లి కాబోతోందా? అంటూ నెటిజన్లు రకరకాల ప్రశ్నలతో ఆరా తీస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 18, 2023, 09:18 AM IST
  • నెట్టింట్లో కొత్త చర్చ మొదలు
  • గర్భం దాల్చిన గోవా బ్యూటీ
  • ఇలియానా తల్లి కాబోతోందా?
Ileana D'cruz : తల్లి కాబోతోన్న ఇలియానా?.. హీరోయిన్ పోస్ట్‌పై కామెంట్లు.. తండ్రి ఎవరంటూ ట్రోల్స్

Ileana D'cruz Pregnant  గోవా సుందరి ఇలియానా సినిమా కెరీర్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. అయితే బాలీవుడ్‌, టాలీవుడ్ ఇలా ఎక్కడ కూడా ఇలియానాకు హిట్లు రావడం లేదు. ఏదో సో సోగా కెరీర్ అలా సాగుతోంది. అయితే ఇలియానా ఇప్పుడు ఓ బాంబ్ పేల్చింది. తాను తల్లి కాబోతోన్నట్టుగా పరోక్షంగా ప్రకటించింది. దీంతో తండ్రి ఎవరు అని అందరూ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం కంగ్రాట్స్ చెబుతూ వచ్చారు.

ఓ చిన్న టీ షర్ట్.. చిన్న పిల్లలకు వేసే టీ షర్ట్‌ను షేర్ చేసింది.. ఆ టీ షర్ట్ మీద జీవితంలో కొత్త అడ్వెంచర్ మొదలు కాబోతోంది.. అంటూ కనిపిస్తోంది. ఇక రెండో ఫోటోలో అమ్మ అనే లాకెట్‌ను ధరించినట్టు కనిపిస్తోంది.. అమ్మను కాబోతోన్నాను.. కొత్త జీవితం ప్రారంభం కాబోతోందంటూ ఇలియానా చెప్పకనే చెప్పినట్టు అయింది. ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. త్వరలోనే రాబోతోన్నాడు.. నా లిటిల్ డార్లింగ్‌ను చూడాలని ఎంతో ఆత్రుతగా ఉంది అంటూ ఇలియానా పోస్ట్ వేసింది.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ileana D'Cruz (@ileana_official)

దీంతో జనాలు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంత మంది ఇలియానాకు కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ఇంకొంత మంది మాత్రం ట్రోల్స్ చేస్తున్నారు. అసలు నీకు పెళ్లే కాలేదు.. అసలు మొగుడు ఎవరు? ఆ బిడ్డకు తండ్రి ఎవరు? అది ముందు బయటపెట్టు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. అవన్నీ ఆమె పర్సనల్ విషయాలు.. అవన్నీ మీకు ఎందుకు అంటూ మరి కొంత మంది నెటిజన్లు ఇలియానాకు మద్దతుగా నిలుస్తున్నారు.

Also Read:  Renu Desai Video : ఏడ్వాలో నవ్వాలో కూడా అర్థం కాని పరిస్థితులు.. రేణూ దేశాయ్ పోస్ట్

ఇలియానా ఇప్పుడు సినిమాలకు దూరంగానే ఉంటోంది. ఆమె నటించిన ఏ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ అవ్వడం లేదు. ఇలియానా సౌత్‌కు దూరమై చాలా కాలమే అయింది. ఆమె రవితేజతో చివరగా నటించిన అమర్ అక్బర్ ఆంటోని డిజాస్టర్‌గా నిలిచింది. అంతకు ముందు నటించిన దేవుడు చేసిన మనుషులు సినిమా కూడా డిజాస్టర్‌గా నిలిచింది. అలా ఇలియానా సినీ కెరీర్‌ సౌత్‌లో ముగిసినట్టు అనిపిస్తోంది. బాలీవుడ్‌లోనూ ఇలియానాకు హిట్లు అనేవి ఎప్పుడూ రాలేదు. సోషల్ మీడియాలో అందాలను ప్రదర్శిస్తూ కాలాన్ని వెళ్లదీస్తోంది.

Also Read: Renu Desai Video : ఏడ్వాలో నవ్వాలో కూడా అర్థం కాని పరిస్థితులు.. రేణూ దేశాయ్ పోస్ట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News