HBD Balakrishna: బాలకృష్ణకు బర్త్‌డే విషెస్ వెల్లువ, యువరాజ్, చిరంజీవి, ఇతర ప్రముఖులు శుభాకాంక్షలు

HBD Balakrishna: డైలాగ్ డెలివరీతో టాలీవుడ్ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసే అతికొద్ది మంది నటులలో నందమూరి నటసింహం బాలకృష్ణ ఒకరు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా సినీ ఇండస్ట్రీతో పాటు క్రీడా, వ్యాపార, ఇతరత్రా రంగాల వారు బాలకృష్ణకు శుభకాంక్షలు తెలిపారు.

Written by - Shankar Dukanam | Last Updated : Jun 10, 2021, 04:40 PM IST
HBD Balakrishna: బాలకృష్ణకు బర్త్‌డే విషెస్ వెల్లువ, యువరాజ్, చిరంజీవి, ఇతర ప్రముఖులు శుభాకాంక్షలు

Celebrities Wishes Nandamuri Balakrishna On His Birthday: పద్నాలుగేళ్ల వయసులో బాలనటుడిగా తెలుగు చిత్రపరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ తనదైన నటన, పాత్రలతో మెప్పించి తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ పేరును నిలబెట్టారు. పౌరాణిక పాత్రల్లోనూ తనకు తిరుగులేదని బాలయ్య నిరూపించుకున్నారు.

డైలాగ్ డెలివరీతో టాలీవుడ్ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసే అతికొద్ది మంది నటులలో నందమూరి నటసింహం బాలకృష్ణ ఒకరు. నేడు ఆయన పుట్టినరోజు (Happy Birthday Balakrishna) సందర్భంగా సినీ ఇండస్ట్రీతో పాటు క్రీడా, వ్యాపార, ఇతరత్రా రంగాల వారు బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. బాలకృష్ణ సార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మానవత విలువలతో, మీ అద్బుతమైన నటనతో మరెంతో మందిలో స్ఫూర్తి రగిలించాలని ఆకాంక్షిస్తున్నానంటూ టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) నటుడు బాలకృష్ణకు బర్త్‌డే విషెస్ తెలిపారు.

Also Read: Rakul Preet Singh New Dish: రకుల్ ప్రీత్ కొత్త వంటకం, తప్పించుకున్న నటి సోదరుడు

‘మిత్రుడు బాలకృష్ణకి  జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ట్వీట్ చేశారు. బాలయ్యకు మరో అగ్ర నటుడు విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బాలయ్య మరింత ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని వెంకటేష్ ఆకాంక్షించారు.

‘జన్మదిన శుభాకాంక్షలు బాల బాబాయ్.మీరు అన్నివేళలా ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను.  Wishing you a very Happy 61st Birthday Babai’ #HappyBirthdayNBK అని బాలయ్యకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపాడు.

Also Read: Yami Gautam Wedding Photos: టాలీవుడ్ నటి యామీ గౌతం పెళ్లి ఫొటోస్ గ్యాలరీ

‘నిత్య యవ్వనుడు నందమూరి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు. మీకు అంతా శుభమే జరగాలని ఆకాంక్షిస్తూ’ దర్శకుడు క్రిష్ ట్వీట్ చేశాడు.

టాలీవుడ్ డైరెక్టర్స్ సురేందర్ రెడ్డి, బాబీ, గోపీచంద్ మలినేని, నటుడు నాగశౌర్య, తదితరులు బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని, మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News