Pawan Kalyan: అలాంటివారికి ఓటు వెయ్యకండి.. పవన్ కి సపోర్టుగా హరిష్ శంకర్ ట్వీట్?

Harish Shankar Supports Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్. ప్రస్తుతం మరోసారి పవన్ కళ్యాణ్ తో త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేయనున్నారు. ఈ నేపథ్యంలో హరీష్ శంకర్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ సందర్భంగా వేసినట్లు తెగ వైరల్ అవుతుంది..  

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 13, 2024, 10:48 AM IST
Pawan Kalyan: అలాంటివారికి ఓటు వెయ్యకండి.. పవన్ కి సపోర్టుగా హరిష్ శంకర్ ట్వీట్?

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావిడి మామూలుగా లేదు. ఇప్పటికే ఎక్కడెక్కడో ఉంటున్న వాళ్ళు కూడా తమ సొంత ఊళ్ళకి చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా అందరూ తమ బాధ్యతను నిర్వర్తించుకుంటున్నారు. 

ఇప్పటికే అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు కూడా సామాన్య ప్రజల లాగా లైన్లో నుంచుని తమ వంతు వచ్చాక ఓటు వేసి తిరిగి వచ్చారు. తాజాగా మరొక సెలబ్రిటీ కూడా ఇన్ డైరెక్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కే తన ఓటు అని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఆయన మరెవరో కాదు డైరెక్టర్ హరీష్ శంకర్. 

‘రాజకీయాల్లోకి వచ్చి సంపాదించిన నాయకులకు కాదు సంపాదించినది రాజకీయాల్లోకి వచ్చి ప్రజల కోసం ఖర్చు పెట్టే నాయకులకే మన ఓటు వేయాలని, ఓటు మన హక్కు మాత్రమే కాదు బాధ్యత’ అంటూ ట్వీట్ చేశారు హరీష్ శంకర్. 

 

తను సినిమాల్లో సంపాదించిన డబ్బు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కోసం ఖర్చుపెట్టిన సంగతి తెలిసిందే. ఇలా హరేష్ శంకర్ ఇన్ డైరెక్ట్ గా తన ఓటు పవన్ కళ్యాణ్ కి అని తెలియజేశారు. కాగా పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ ల మధ్య స్నేహం ఇప్పటిది కాదు. గతంలో పవన్ కళ్యాణ్ కెరియర్ లో అతి పెద్ద హిట్ సినిమాలలో ఒకటైన గబ్బర్ సింగ్ కి దర్శకత్వం వహించింది హరీష్ శంకర్. పులి, తీన్ మార్, పంజా వంటి మూడు వరుస డిజాస్టర్ ల తర్వాత పవన్ కళ్యాణ్ అందుకున్న మొట్టమొదటి బ్లాక్ బస్టర్ ఆ సినిమా. అందుకే పవన్ కళ్యాణ్ కి ప్రియమైన వ్యక్తులలో హరీష్ శంకర్ కూడా ఒకరు. 

మరోవైపు హరీష్ శంకర్ కూడా పవన్ కళ్యాణ్ కి పెద్ద అభిమాని. తాజాగా ఇప్పుడు మళ్లీ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా కూడా విడుదల కి సిద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలోనే హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ పై తనకున్న గౌరవాన్ని, ఇష్టాన్ని మరొకసారి చాటుకున్నారు.

Also read: Voter Slip: ఓటరు స్లిప్ అందకున్నా నో ప్రాబ్లెమ్, ఇలా సింపుల్‌గా డౌన్‌లోడ్ చేయవచ్చు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News