Dulquer Salman: మహానటి సినిమాలో దుల్కర్ సల్మాన్ ఫేవరెట్ సీన్ అదే.. బయటపెట్టిన హీరో

Mahanati: సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన మహానటి సినిమా.. ఎంత పెద్ద విజయం సాధించిందో తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమా ఒక క్లాసిక్ గా నిలిచింది. ఈ చిత్రం ఈ మధ్యనే 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. దుల్కర్ సల్మాన్ పెట్టిన ఒక పోస్ట్ వైరల్ అవుతుంది

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 15, 2024, 11:41 AM IST
Dulquer Salman: మహానటి సినిమాలో దుల్కర్ సల్మాన్ ఫేవరెట్ సీన్ అదే.. బయటపెట్టిన హీరో

Nag Ashwin Kalki2898AD:
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సినిమా మహానటి. సావిత్రి బయోపిక్ గా వచ్చిన ఈ చిత్రం తెలుగులో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ చిత్రంలో అద్భుతంగా నటించిన కీర్తి సురేష్ కి.. నేషనల్ అవార్డు సైతం వచ్చింది. ఇక ఈ సినిమా ద్వారానే ములయాలి హీరో దుల్కర్ సల్మాన్ తెలుగు సినిమాలోకి అడుగు పెట్టారు. ఈ సినిమా 2018 మే తొమ్మిదో తారీఖున విడుదలై మంచి విజయం సాధించింది. ఈ క్రమంలో ఈ చిత్రం ఈ మధ్యనే ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. దుల్కర్ సల్మాన్ పెట్టిన ఒక పోస్ట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది

అసలు విషయానికి వస్తే మహానటి సినిమాకు సినిమాటోగ్రఫీ హైలెట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించిన దాని.. ఈ చిత్రం ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. మహానటిలోని ఒక సీన్ ని షేర్ చేశారు. కాగా అదే సీన్ తన ఫేవరెట్ సీన్ అంటూ దుల్కర్ రిప్లై ఇచ్చాడు.

ఇంతకీ ఆ సీన్ ఏమిటి అంటే..ఈ సినిమాలో సావిత్రికి జెమినీ గణేషన్ ముందు పెళ్లిళ్ల గురించి నిజం తెలిసాక.. కొంచెం బాధలో ఉంటుంది. అయితే ఒక సినిమా షూటింగ్ కోసం వీరిద్దరూ చాముండేశ్వరి అమ్మవారి గుడికి వెళ్ళగా.. అక్కడ జెమినీ గణేషన్(దుల్కర్ సల్మాన్) చెప్పే మాటలు విని సావిత్రి (కీర్తి సురేష్)ఆయన్ని పెళ్లి చేసుకుంటుంది. ఈ సీన్ ఈ సినిమా విడుదలైనప్పుడు ఎంతోమంది ప్రేక్షకుల మదిని కూడా దోచింది. అయితే ఇప్పుడు ఇదే సీన్ తన ఫేవరెట్ సీన్ అని బయటపెట్టాడు దుల్కర్ సల్మాన్.

కాగా సావిత్రి జీవిత చరిత్రను చెప్పిన ఈ సినిమాని ఎంతో చక్కగా తీర్చిదిద్దారు నాగ్ అశ్విన్. మొదటి సీన్ నుంచి చివరి సీన్ వరకు.. ఎక్కడ బోర్ కొట్టకుండా మనసుని హత్తుకునేలా తీశారు. ఇకపోతే ఈ దర్శకుడు ప్రస్తుతం ప్రభాస్ తో కల్కి 2898AD సినిమా చేస్తున్నాడు. మరో పక్క దుల్కర్ సల్మాన్.. తొలిప్రేమ లాంటి సెన్సేషనల్ హిట్ తీసిన దర్శకుడు వెంకీ అట్లూరితో.. లక్కీ భాస్కర్ అనే చిత్రం చేస్తున్నారు.

Read more: MP Elections 2024: ఎన్నికల వేళ కాంగ్రెస్ బంపర్ ఆఫర్.. ఇద్దరు భార్యలున్న వారికి కూడా ఆ పథకం.. వీడియో వైరల్..

Read more: Smell of Cooking Food: వంట స్మెల్ చూసి వావ్ అంటున్నారా..?.. షాకింగ్ విషయాలు వెల్లడించిన ఎన్ఓఏఏ పరిశోధకులు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News