Deepika Padukone: తోటి హీరోయిన్స్ ని ఆశ్చర్యపరుస్తున్న దీపిక రెమ్యూనరేషన్.. కల్కి కి ఎంత తీసుకుందంటే!

Deepika Padukone Remuneration:బాలీవుడ్ లో హీరోలతో సమానంగా సత్తా చాటుతున్న హీరోయిన్ దీపిక. ఇప్పటికే బాలీవుడ్ బామ్మలందరికంటే ఎక్కువ పారితోషకం తీసుకుని కల్కి కోసం ఎంత తీసుకుందంటే.. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 12, 2024, 12:37 PM IST
Deepika Padukone: తోటి హీరోయిన్స్ ని ఆశ్చర్యపరుస్తున్న దీపిక రెమ్యూనరేషన్.. కల్కి కి ఎంత తీసుకుందంటే!

Deepika Remuneration for Kalki 2898AD: బాలీవుడ్ లో దీపికా ప‌దుకొణే రేంజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోలోగా సినిమాలు చేసినా ..స్టార్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా కలెక్షన్స్ తెగలిగే సత్తా దీపికాకే ఉంది. ఒంటిచేత్తో 500 కోట్లు సాధించి రికార్డు సృష్టించిన స్టార్ హీరోయిన్ దీపిక. పద్మావతి మూవీ తో తానేంటో నిరూపించుకుంది. ఆమెకు ఉన్న రేంజ్ కు ప్రత్యేకంగా హీరోల స‌ర‌స‌నే న‌టించాల్సిన అవసరం లేదు. మాంచి కంటెంట్ ఉండే స్టోరీ చేస్తే చాలు..బాక్సాఫీస్ ని సోలో గా షేక్ చేసే సత్తా ఉన్న నటి దీపిక.

ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ లో చేసే ఒక్కో సినిమాకి 10 నుంచి 15 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది. దీపిక ఇప్పటివరకు తీసుకున్న రెమ్యూనరేషన్ ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్స్ లో పెద్ద చర్చ కాగా.. కల్తీ సినిమాకి తీసుకున్న నిర్ణయం అందరిని మరింత ఆశ్చర్యపరుస్తుంది.

ప్రభాస్ కల్కి మూవీ తో ఆమె తెలుగు తెరపై మెరవనుంది. అయితే ఈ మూవీకి దీపిక తీసుకుంటున్న పారితోషకం వివరాలు మిగిలిన స్టార్ హీరోయిన్స్ ను షాక్ చేస్తున్నాయి. మామూలుగా సినిమాలలో హీరోయిన్లకు కాల్షీట్లు తక్కువ పడతాయి.. భారీగా యాక్షన్ సన్నివేశాలు చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి హీరోలతో పోల్చుకుంటే వాళ్ల రెమ్యూనరేషన్ చాలా తక్కువ గానే ఉంటుంది.

హీరోల మాదిరిగా ఎక్కువ కాల్షీట్లు కేటాయించాల్సిన అవసరం ఉండదు కాబట్టి సులభంగా వాళ్ళు ఏడాదిలో ఒక 5 సినిమాల వరకు ఈజీ గా చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే కల్కి మూవీ కోసం దీపిక మామూలు కంటే కాస్త ఎక్కువ కాల్షీట్లు కేటాయించాల్సి వ‌చ్చిందిట‌. పైగా ఈ మూవీలో దీపిక కొన్ని రిస్కీ షాట్స్ లో కూడా చేస్తోంది. అందుకే ఇంతవరకు ఏ సినిమాకి డిమాండ్ చేయనంతగా ఈ మూవీకి దీపిక డిమాండ్ చేస్తుందని టాక్.

ఈ మూవీ కోసం ఆమె తీసుకుంటున్న అమౌంట్ ఎంతో తెలుసా..అక్ష‌రాలు 20 కోట్లు. ఇది కేవలం మినిమం మాత్రమే.. పారితోషకం అంతకంతకు పెరిగేదే తప్ప తగ్గే అవకాశం లేదు అని టాక్. ఇంతవరకు ఏ స్టార్ హీరోయిన్ ఇంత రేంజ్  పారితోషికం తీసుకోలేదు. దీంతో భారీ పారితోషకం అందుకున్న హీరోయిన్ గా దీపిక రికార్డ్ సృష్టించింది. ఐశ్వ‌ర్యారాయ్,కంగ‌నా ర‌నౌత్,క‌త్రినా కైఫ్,అలియాభ‌ట్ లాంటి బ్యూటీస్ ను ఇప్పటికే బీట్ చేసిన దీపిక..కల్కి మూవీ తో అందుకోలేనంత ఎత్తుకు ఎదిగిపోయింది.

Also Read: Miscarriage: గర్భం కోల్పోయిన భార్య.. కన్నీటిసంద్రంలో మునిగిన స్టార్‌ క్రికెటర్‌

Also Read: Transgender: అవమానాలనే మెట్లుగా చేసుకుని ఎదిగిన ట్రాన్స్‌జెండర్‌.. ఈ కథ స్ఫూర్తిదాయకం

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News