Chiranjeevi vs Rajini: చిరుని ఢీ కొట్టనున్న రజనీకాంత్..మరో రెండు సినిమాలు కూడా?

Bhola Shankar vs Jailer: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ ఆగస్టు 11న రిలీజ్ అవుతూ ఉండగా దానికి పోటీగా రజనీకాంత్ జైలర్ సినిమా ఆగస్టు 10వ తేదీన రిలీజ్ అవుతోంది. 

Written by - Chaganti Bhargav | Last Updated : May 4, 2023, 08:34 PM IST
Chiranjeevi vs Rajini: చిరుని ఢీ కొట్టనున్న రజనీకాంత్..మరో రెండు సినిమాలు కూడా?

Chiranjeevi Bhola Shankar vs Rajinikanth Jailer: టాలీవుడ్ లో 2023 సంక్రాంతి సమయంలో ఇద్దరు బడా హీరోలు పోటీ పడడం మనందరం చూసాం. నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఒకరోజు వ్యవధితో మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ రెండు సినిమాల్లో వాల్తేరు వీరయ్య సినిమాకి కలెక్షన్లతో పాటు ఎక్కువ పాజిటివ్ టాక్ కూడా అందుకుంది, అది వేరే విషయం.

ఇప్పుడు మరోసారి చిరంజీవి మరో సీనియర్ హీరోతో పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు విషయం ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి హీరోగా భోళా శంకర్ అనే సినిమా ఇప్పుడు రూపొందుతోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ మీద అనిల్ సుంకర నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాని స్టైలిష్ సినిమాలు చేస్తాడనే పేరు ఉన్న మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన తమన్న హీరోయిన్గా నటించిన చిరంజీవి సోదరి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది.

ఆయనే భర్త పాత్రలో సుశాంత్ నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతానికి బెంగాల్ లోని కలకత్తాలో ఈ మధ్యనే మొదలైంది. వీలైనంత త్వరగా సినిమా పూర్తి చేసి ఆగస్టు 11వ తేదీన సినిమా రిలీజ్ చేయబోతున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇక ఇప్పుడు ఆసక్తికరంగా రజనీకాంత్ హీరోగా నటిస్తున్న జైలర్ సినిమాని కూడా ఆగస్టు 10వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించడం హాట్ టాపిక్ అవుతోంది. విజయ్ తో బీస్ట్ శివ కార్తికేయన్ తో డాన్ సినిమాలు తెరకెక్కించిన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా జైలర్ అనే సినిమా తెరకెక్కిస్తున్నారు.

Also Read: Brahmanandam Campaign: బ్రహ్మానందం ఎన్నికల ప్రచారం.. ఎవరి కోసమో తెలిస్తే షాకవుతారు!

నిజానికి ఈ సినిమా ఏప్రిల్ నెలలోనే విడుదల కావాల్సి ఉంది కానీ అనూహ్యంగా సినిమాని వాయిదా వేశారు. సన్ పిక్చర్స్ బ్యానర్ మీద కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమాని ఇప్పుడు ఆగస్టు 10వ తేదీన తెలుగు, తమిళ సహా ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలో రజనీకాంత్ హీరోగా నటిస్తుండగా మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ కూడా నటిస్తున్నారు.

మన తెలుగు సినీ పరిశ్రమకు చెందిన సునీల్ కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో తమన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తోంది. ఇండిపెండెన్స్ డే వీకెండ్ సెలవులు గట్టిగా ఉన్నాయని చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆగస్టు 10వ తేదీన సినిమా రిలీజ్ చేస్తే బాగుంటుందని నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. అయితే ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సినిమా కూడా ఆగస్టు 11వ తేదీ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అదే రోజు రిలీజ్ చేయడం కంటే ఒకరోజు ముందుగా రిలీజ్ చేయడం బెటర్ అని భావించి ఆగస్టు 10వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లుగా ఇప్పుడు అధికారిక ప్రకటన వచ్చినట్లుగా చెబుతున్నారు.

ఈ రిలీజ్ డేట్ ప్రకటించడం కోసం ఒక వీడియో గ్లింప్స్ కూడా విడుదల చేశారు మేకర్స్. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇదే సమయానికి మరో రెండు సినిమాలను కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా యానిమల్ అనే సినిమా రూపొందుతోంది. దాన్ని కూడా ఆగస్టు 11వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ఇప్పటికే ప్రకటించారు. దాన్ని కూడా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇక డిజె టిల్లు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సిద్దు జొన్నలగడ్డ ఆ సినిమాకు సీక్వెల్ టిల్లు స్క్వేర్ తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమాని కూడా ఆగస్టు 11న రిలీజ్ చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.  మొత్తం మీద ఆ వీకెండ్ నాలుగు సినిమాలు పోటీ పడబోతున్నాయన్న మాట. 

Also Read: Rashmika Mandanna Dating: బెల్లంకొండ డేటింగ్ రూమర్స్ పై రష్మిక సైలెన్స్.. ఎందుకబ్బా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News