AR Rahman's Son AR Ameen: ఏ.ఆర్. రెహ్మాన్ కొడుక్కి షూటింగ్ సెట్లో తృటిలో తప్పిన పెను ప్రమాదం

AR Rahman's Son AR Ameen Escapes Accident : ఏ.ఆర్. రహ్మాన్ తనయుడు అమీన్ షేర్ చేసిన ఫోటోలను చూస్తే ప్రమాదం తీవ్రత ఏ స్థాయిలో ఉండేదో ఇట్టే అర్థమవుతోంది. ఒక్కటి కాదు.. రెండు కాదు.. వేదికను పూర్తిగా కవర్ చేసేలా షాండలియా సెట్ ఏర్పాటు చేశారు. అవి కూడా భారీ పరిమాణంలో ఉన్నవే కావడంతో అలాంటివి మీద పడితే జరిగే నష్టం అంతా ఇంతా ఉండదు.

Written by - Pavan | Last Updated : Mar 5, 2023, 10:00 PM IST
AR Rahman's Son AR Ameen: ఏ.ఆర్. రెహ్మాన్ కొడుక్కి షూటింగ్ సెట్లో తృటిలో తప్పిన పెను ప్రమాదం

AR Rahman's Son AR Ameen Escapes Accident: ఏ.ఆర్. రెహ్మాన్ కుమారుడు ఏ.ఆర్. అమీన్‌కి షూటింగ్ సెట్లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. అమీన్ తన బృందంతో కలిసి కెమెరా ముందు పర్‌ఫామ్ చేస్తుండగా పైన వేళ్లాడుతున్న భారీ షాండలియా ఉన్నట్టుండి ఊడి కిందపడింది. ఆ సమయంలో ఏ.ఆర్. అమీన్ అండ్ టీమ్ అంతా అదే వేదికపై ఉంది. వేదికపై భారీ క్రేన్ సహాయంతో వేళ్లాడదీసిన షాండలియా సెటప్ ఊహించని విధంగా ఒక్కసారిగా ఊడి కిందపడటంతో అందరూ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. అయితే, షాండలియా వేదికపైనే కూలినప్పటికీ.. అక్కడ ఎవ్వరికీ ఎలాంటి హానీ జరగకపోవడంతో అమీన్‌తో పాటు అక్కడున్న వాళ్లందరికీ తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఏ మాత్రం అటు ఇటైనా ఆ వేదికపై ఉన్న వారి తలలు పగిలేవే. అయితే అదృష్టవశాత్తుగా అలాంటిదేమీ జరగలేదు.

ఈ ఘటన జరిగి మూడు రోజులు అవుతుంది. అయితే ఇప్పటి వరకు తాను ఆ షాక్ లోంచి తేరుకోలేకపోతున్నాను అంటూ అమీన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ అప్‌లోడ్ చేసి ఆ చేదు ఘటనను అభిమానులతో పంచుకున్నాడు. తన తల్లిదండ్రులు, ఆ దేవుడు, అభిమానులు, శ్రేయోభిలాషుల ఆశీర్వాదం వల్లే తాను ఇవాళ బతికి ఉన్నానని లేదంటే ఘోరం జరిగిపోయి ఉండేదని ఆనాటి చేదు అనుభవాన్ని వెల్లడించాడు. అంతేకాకుండా షాండలియా కూలిన సెట్ ఫోటోలను కూడా షేర్ చేసుకున్నాడు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by “A.R.Ameen” (@arrameen)

 

ఏ.ఆర్. రహ్మాన్ తనయుడు అమీన్ షేర్ చేసిన ఫోటోలను చూస్తే ప్రమాదం తీవ్రత ఏ స్థాయిలో ఉండేదో ఇట్టే అర్థమవుతోంది. ఒక్కటి కాదు.. రెండు కాదు.. వేదికను పూర్తిగా కవర్ చేసేలా షాండలియా సెట్ ఏర్పాటు చేశారు. అవి కూడా భారీ పరిమాణంలో ఉన్నవే కావడంతో అలాంటివి మీద పడితే జరిగే నష్టం అంతా ఇంతా ఉండదు. అందుకే అమీన్ ఆ షాక్ లోంచి ఇంకా బయటికి రాలేకపోతున్నాడు అనిపిస్తోంది. ఏదేమైనా రహ్మాన్ మంచితనమే అతడి కొడుకుని ఈ ప్రమాదం నుంచి కాపాడింది అని నెటిజెన్స్ కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. స్వర మాంత్రికుడు రహ్మాన్ కుటుంబం సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నట్టు ఇంకొంత మంది అభిమానులు కామెంట్స్ చేశారు.

Trending News