Akhil Marriage Matches: అఖిల్ పెళ్లి ప్రయత్నాలు, మంచి సంబంధం కోసం చూస్తున్న అక్కినేని కుటుంబం

Akhil Marriage Matches: అక్కినేని కుటుంబంలో ఇప్పుడంతా పెళ్ళి చర్చ నడుస్తోంది. పెద్దకోడలు విడాకులతో బయటకెళ్లిపోవడంతో చిన్న కోడలి కోసం ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. మొదటి పెళ్లి అచ్చిరాని ఈ కుటుంబానికి చిన్నకోడలు అచ్చొస్తుందా లేదా..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 27, 2022, 04:40 PM IST
Akhil Marriage Matches: అఖిల్ పెళ్లి ప్రయత్నాలు, మంచి సంబంధం కోసం చూస్తున్న అక్కినేని కుటుంబం

Akhil Marriage Matches: అక్కినేని కుటుంబంలో ఇప్పుడంతా పెళ్ళి చర్చ నడుస్తోంది. పెద్దకోడలు విడాకులతో బయటకెళ్లిపోవడంతో చిన్న కోడలి కోసం ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. మొదటి పెళ్లి అచ్చిరాని ఈ కుటుంబానికి చిన్నకోడలు అచ్చొస్తుందా లేదా..

అక్కినేని కుటుంబం మెగా సినీ కుటుంబం. అక్కినేని నాగేశ్వరరావు నుంచి నటనను వారసత్వంగా తీసుకుని అందర్నీ ఆకట్టుకున్న నాగార్జున. అక్కడి నుంచి అతడి తనయులు నాగచైతన్య, అఖిల్‌లతో పాటు నాగార్జున సమీప బంధువులు టాలీవుడ్‌లో తమ ఉనికి చాటుకుంటున్నారు. కెరీర్ పరంగా నాగార్జున ఇప్పటికీ అప్పుడప్పుడూ ఓ సినిమా చేస్తూ..బిగ్‌బాస్ తెలుగుతో బిజీగా ఉన్నాడు. అటు అతడి తనయలు నాగచైతన్య, అఖిల్ కెరీర్ పరంగా నిలదొక్కుకుంటున్నారు. ఈ క్రమంలో అక్కినేని కుటుంబం ఇప్పుడు కోడలి కోసం అణ్వేషిస్తోంది. 

అయితే నాగచైతన్య కోసమనుకుంటున్నారా..కానే కాదు. ఇటీవలే సమంతతో విడాకుల తరువాత కాస్త డిస్ట్రబ్ అయిన చైతూ..ఇప్పుడు సినిమాలపై పూర్తి దృష్టి పెట్టాడు. నాగచైతన్య - సమంతల విడాకుల వ్యవహారం మొత్తం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఎక్కడికి వెళ్లినా ఇదే టాపిక్ చర్చనీయాంశమయ్యేది. ఇప్పటికీ ఆ ఇద్దరి విడాకుల అంశం చర్చకు వస్తూనే ఉంది. అందుకే ఇప్పట్లో నాగ చైతన్యకు మళ్లీ పెళ్లి చేసే ఆలోచన నాగార్జునకు లేదు. అందుకే ఇప్పుడు చిన్న కొడుకు, అమల తనయడు అఖిల్‌కు పెళ్లి చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు అక్కినేని కుటుంబసభ్యులు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ విజయంతో కెరీర్ పరంగా సెట్ అవుతున్న అఖిల్‌కు పెళ్లి చేయాలనేది నాగార్జున-అమల ఆలోచనగా ఉంది. అయితే ఇందుకు తగ్గ అమ్మాయిని వెతికే పనిలో పడ్డారు. అమ్మాయిని అన్ని కోణాల్లో పరిశీలించిన తరువాతే పెళ్లి చేద్దామనేది అక్కినేని కుటుంబం ఆలోచన. 

ఎందుకంటే అక్కినేని కుటుంబంలో మొదటి పెళ్లి సెట్ కావడం లేదు. అక్కినేని నాగార్జున విషయంలోనూ అదే జరిగింది. పెద్ద కొడుకు నాగ చైతన్య విషయంలోనూ అదే రిపీట్ అయింది. ఆఖరికి అఖిల్ తొలి నిశ్చితార్ధం కూడా రద్దైంది. ఈసారి విమర్శలకు, సంఘర్షణలకు, మనస్ఫర్ధలకు తావివ్వకుండా ఉండేలా మంచి సంబంధం కోసం అక్కినేని కుటుంబం ప్రయత్నిస్తోంది. అక్కినేని కుటుంబంలో చిన్న కోడలిగా అడుగుపెట్టేదెవరనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. సినీ పరిశ్రమ నుంచి కాకుండా బయటి నుంచి చిన్న కోడలిని తెచ్చుకునే అవకాశాలెక్కువగా ఉన్నాయి.

Also read: Salman Khan Pooja Hegde: సల్మాన్ భాయ్.. ఏంటా చిలిపి పని! పూజా హెగ్డేను ఏం చేస్తున్నావ్! (వీడియో)

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News