Footboard Journey: ప్రాణం తీసిన 'ఉచిత బస్సు' పథకం.. ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తూ మహిళ దుర్మరణం

Young Women Died In RTC Bus Accident: ఉచిత బస్సు పథకంతో ఆర్టీసీ బస్సులు తీవ్ర రద్దీతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. బస్సు రద్దీతో ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తున్న మహిళ ప్రమాదవశాత్తు బస్సు కింద పడి మృతి చెందింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 19, 2024, 10:48 AM IST
Footboard Journey: ప్రాణం తీసిన 'ఉచిత బస్సు' పథకం.. ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తూ మహిళ దుర్మరణం

RTC Bus Accident: కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి ఉచిత బస్సు తీవ్ర వివాదాస్పదమవుతోంది. మహిళల కోసం ప్రవేశపెట్టిన ఈ పథకం ఘర్షణలకు దారి తీస్తోంది. పలువురి మరణాలకు కూడా కారణమవుతోంది. ఇప్పటికే ఈ పథకం కారణంగా గిరాకీ లేక దాదాపు 30 మంది ఆటో డ్రైవర్లు బలవన్మరణానికి పాల్పడ్డారు. తాజాగా ఓ మహిళ ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తూ బస్సులో నుంచి కిందపడి మరణించింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. 

Also Read: Telangana Rains: ఇద్దరి ప్రాణం తీసిన పిడుగులు.. తెలంగాణలో భయంకరంగా అకాల వర్షాలు

 

రోజు విధులు నిర్వహించడానికి వెళ్తున్న మహిళ బస్సులో రద్దీ కారణంగా ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తూ ప్రమాదానికి గురయి మరణించింది. ఈ ఘోర సంఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. కొణిజర్ల మండలం పెద్దమునగాలకు చెందిన దూరి అనూష (26)కు భర్త అశోక్‌, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఖమ్మంలోని ఓ ప్రైవేటు మాల్‌లో చిరుద్యోగిగా పని చేస్తూ ఆమె కుటుంబంతో హాయిగా జీవిస్తుండేది. విధి నిర్వహణ కోసం రోజు ఖమ్మం పట్టణానికి ఆమె రాకపోకలు చేస్తుండేది. శనివారం యథావిధిగా విధుల కోసం కొణిజర్ల నుంచి ఖమ్మం వెళ్లేందుకు భద్రాచలం డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు ఎక్కింది. ప్రయాణికుల రద్దీ ఉండడంతో అలాగే బస్సు ఎక్కి ప్రయాణించింది. బస్సు లోపల రద్దీ అధికంగా ఉండడంతో ఫుట్‌బోర్డుపై నిల్చుని ప్రయాణం చేస్తుంది.

Also Read: Thunderbolt: అమ్మమ్మ ఇంట్లో విషాదం.. క్రికెట్‌ ఆడుతున్న యువకుడిని బలిగొన్న పిడుగు

 

మార్గమధ్యలో ఒకచోట బస్సు డ్రైవర్‌ ముందు వాహనం తప్పించే క్రమంలో సడన్‌ బ్రేక్‌ వేశాడు. అనంతరం వెంటనే కదిలించడంతో ఫుట్‌బోర్డులో ఉన్న అనూష ఒక్కసారిగా కిందపడింది. అనంతరం బస్సు వెనుక చక్రాలు ఆమె మీద నుంచి పోవడంతో అనూష తీవ్ర గాయాలపాలైంది. అక్కడికక్కడే మృతి చెందింది. క్షణాల్లో ఈ ఘోర ప్రమాదం సంభవించడంతో బస్సు డ్రైవర్‌, కండక్టర్‌తోపాటు బస్సులోని ప్రయాణికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న ఎస్సై శంకర్‌ రావు, ఆర్టీసీ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఖమ్మంలోని ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఆమె భర్త అశోక్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

చక్కటి పిల్లలు, భర్తతో హాయిగా సాగుతున్న ఆ కుటుంబంలో బస్సు సంఘటన తీవ్ర విషాదం నింపింది. ఇంకా పిల్లలు చిన్న వయసు వారే. ఆరేళ్ల లోపు పిల్లలు తల్లి లేని బాధతో రోదించడం అందరినీ కలచివేసింది. కాగా ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఆందోళన చేశారు. అనూష మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్‌ చేశాయి. వారి కుటుంబానికి న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తాయని ఆయా పార్టీలు స్పష్టం చేశాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News