Cricket Betting: ఐపీఎల్‌ బెట్టింగ్‌కు భార్య బలి.. రూ.కోటిన్నర అప్పులతో సంసారం సర్వనాశనం

IPL Betting Wife Commits Suicide In Karnataka: ఆటను ఆటలాగా చూడాలి. కానీ సులువుగా డబ్బులు సంపాదించాలని బెట్టింగ్‌కు పాల్పడాలని చూస్తే జీవితం నాశనమవుతుంది. బెట్టింగ్‌ ఒకరి సంసారాన్ని కుప్పకూల్చింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 26, 2024, 06:43 PM IST
Cricket Betting: ఐపీఎల్‌ బెట్టింగ్‌కు భార్య బలి.. రూ.కోటిన్నర అప్పులతో సంసారం సర్వనాశనం

IPL Betting: భర్త చేసిన అప్పులు భార్యను బలి తీసుకున్నాయి. కుటుంబ అవసరాల కోసం అప్పులు చేశాడనుకుంటే పొరపాటే. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ల కోసం కోట్లలో అప్పులు చేశాడు. రెండేళ్లుగా ఐపీఎల్‌ మ్యాచ్‌ల కోసం కూడా బెట్టింగ్‌లు చేశాడు. అవి తీర్చాలని అప్పులు ఇచ్చినవారు వేధిస్తుండడంతో ఆ భార్య తట్టుకోలేకపోయింది. సరదాగా మొదలుపెట్టిన బెట్టింగ్‌ అతడి సంసారంలో విషాదం నింపింది. అప్పులు ఇచ్చిన వారి వేధింపులు తాళలేక ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.

Also Read: Egg Clash: హోలీ పండుగలో కోడిగుడ్డు గొడవ.. మహిళపై వేట కొడవలితో దాడి

 

కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాకు చెందిన దర్శన్‌ బాబు ప్రభుత్వ శాఖలో అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా పని చేస్తుంటాడు. అతడికి 2020లో రంజితతో వివాహం జరిగ్గా.. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే దర్శన్‌ బాబు మెల్లగా బెట్టింగ్‌కు అలవాటు పడ్డాడు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో సరదాగా పాల్గొంటున్న దర్శన్‌ బాబు కొన్నాళ్లకు వ్యసనంగా చేసుకున్నాడు. మొదట ఆదాయం వస్తుంటే కొన్నాళ్లకు లాభాలు కాకుండా ఉన్న డబ్బులన్నీ పోయాయి. ఆ డబ్బులు తీర్చేందుకు అతడు ఇంట్లోని సామాన్లను తాకట్టు పెట్టడం ప్రారంభించాడు. డబ్బులు ఇచ్చిన వారు తిరిగిఇవ్వాలని ఇంటి ముందుకు వచ్చి గొడవలు పడుతున్నారు.

Also Read: MP Suicide Attempt: టికెట్‌ రాలేదని పురుగుల మందు తాగిన ఎంపీ.. కొనఊపిరితో గిలగిల

ఈ వ్యవహారం అతడి భార్య రంజితకు చిరాకు తెప్పించింది. అప్పుల వాళ్లు వివాదానికి దిగుతుండడంతో మనస్తాపానికి లోనైంది. భర్త అప్పులతో సంసారం నాశనమైందని బాధపడుతుండేది. అప్పుల వేధింపులు తాళలేక రజిత ఈనెల 18వ తేదీన బలవన్మరణానికి పాల్పడింది. ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య విషయం తెలుసుకున్న అమ్మాయి తండ్రి వెంకటేశ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అల్లుడు అప్పుల వలన తమ కుమార్తె చనిపోయిందని కన్నీరుమున్నీరుగా విలపించాడు. కాగా ఆత్మహత్య చేసుకునేందుకు రంజిత ఒక లేఖ రాసింది. ఆ లేఖలో భర్త దర్శన్‌ బాబు చేసిన అప్పుల చిట్టా మొత్తం వివరించింది. దాదాపు రూ.2 కోట్ల వరకు అప్పులు చేశాడని లేఖలో పేర్కొంది. ఆ అప్పుల్లో రూ.కోటి తిరిగి ఇచ్చేయగా.. ఇంకా రూ.84 లక్షలు కట్టాల్సి ఉందని రంజిత తెలిపింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News