House Rent Allowance: రెండు ఇళ్లకు హెచ్‌ఆర్‌ఏ క్లెయిమ్ చేయవచ్చా..? రూల్స్ ఏం చెబుతున్నాయి..?

Tax Saving Tips: కొంతమందికి ఒకటి కంటే ఎక్కువ హెచ్‌ఆర్‌ఏలు క్లెయిమ్ చేసుకోవచ్చా..? అనే అనుమానం ఉంటుంది. రెండు ప్రాపర్టీలకు రెంట్ చెల్లించేవారికి ఈ డౌట్ ఉంటుంది. ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్ ఏం చెబుతున్నాయి..? వివరాలు ఇలా..  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 5, 2023, 03:06 PM IST
House Rent Allowance: రెండు ఇళ్లకు హెచ్‌ఆర్‌ఏ క్లెయిమ్ చేయవచ్చా..? రూల్స్ ఏం చెబుతున్నాయి..?

Tax Saving Tips: ఓ వ్యక్తి హైదరాబాద్‌లో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. అతని తల్లిదండ్రులు విజయవాడలో మరో ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. అతను రెండు ఇళ్లకు అద్దె చెల్లిస్తున్నాడు. అతని వద్ద రెండు ఇళ్లకు సంబంధించిన రెంట్ అగ్రిమెంట్స్, అద్దె రశీదులు  ఉన్నాయి. ఈ తరుణంలో ఒకటి కంటే ఎక్కువ ఆస్తికి రెంట్‌పై హెచ్‌ఆర్‌ఏ క్లెయిమ్ చేయవచ్చా..? అని ఆ వ్యక్తి అడుగుతున్నాడు. ఇలానే మీకు డౌట్ ఉందా..? రెండు హెచ్‌ఆర్‌ఏలు క్లెయిమ్ చేసుకోవచ్చా..? అనే విషయంపై ఐటీ చట్టం ఏం చెబుతుందంటే..?

ఐటీ చట్టంలోని సెక్షన్ 10 (13ఏ) ప్రకారం.. హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు అందుబాటులో ఉంది. ఆదాయపు పన్ను చట్టంలోని రూల్ 2ఏ హెచ్‌ఆర్‌ఏ మినహాయింపును క్లెయిమ్ చేసుకోవడానికి కొన్ని రూల్స్ పాటించాల్సి ఉంటుంది. రూల్ 2ఏలో నిర్దేశించిన షరతుల్లో ఒకటి ఏమిటంటే.. నివాస గృహానికి సంబంధించి అద్దె చెల్లింపుపై వాస్తవానికి అయ్యే ఖర్చును అతని కంపెనీ జీత భత్యం కింద ప్రత్యేకంగా ఉద్యోగికి చెల్లించాలి.

మీరు అద్దెకు తీసుకున్న ఇంటికి సంబంధించి మాత్రమే హెచ్‌ఆర్‌ఏ మాత్రమే మినహాయింపు అందుబాటులో ఉంటుంది. మీ ఇంటికి చెల్లించిన అద్దె ఆధారంగా మాత్రమే హెచ్‌ఆర్‌ఏను క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీ తల్లిదండ్రులు నివాసం ఉంటున్న ఇంటికి అద్దె చెల్లించినా.. దానిపై హెచ్‌ఆర్‌ఏను క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉండదు. అంతేకాకుండా క్లెయిమ్ చేయాలనుకునే హెచ్‌ఆర్‌ఏ మొత్తంపై కూడా లిమిట్ ఉంటుంది. మీ బేసిక్ శాలరీలో గరిష్టంగా 50 శాతం వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు.

ఉదాహరణకు మీ ప్రాథమిక వేతనం నెలకు రూ.50 వేలు, నెలకు రూ.20 వేలు హెచ్‌ఆర్‌ఏ పొందుతున్నారని అనుకుందాం.. మీరు ప్రతి నెలా రూ.30 వేలు అద్దె చెల్లిస్తున్నట్లయితే.. మీ హెచ్‌ఆర్ఏ మినహాయింపు నెలకు రూ.20 వేలు, ఏడాదికి రూ.2.4 లక్షలు ఉంటుంది. నిబంధనల ప్రకారమే హెచ్‌ఆర్‌ఏను క్లెయిమ్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అద్దెకు సంబంధించిన రశీదులను పక్కాగా ఉంచుకోవాలని చెబుతున్నారు.  

Also Read: ICC World Cup 2023: వరల్డ్ కప్ ఆరంభానికి ముందు బీసీసీఐ షాకింగ్ నిర్ణయం.. నిరాశలో క్రికెట్ అభిమానులు  

Also Read: TSRTC Employees DA: టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. అన్ని డీఏలు మంజూరు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News