Income tax Alert: వెంటనే చేయకపోతే పాన్‌కార్డు హోల్డర్లకు 10 వేల భారీ జరిమానా

Income tax Alert: ఇన్‌కంటాక్స్ శాఖ కీలకమైన అప్‌డేట్ జారీ చేసింది. పాన్‌కార్డ్‌ను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయకపోతే భారీ మూల్యం చెల్లించుకోవల్సివస్తుంది. ఇప్పటికైనా ఆ పని తక్షణం పూర్తి చేయండి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 28, 2023, 11:18 AM IST
Income tax Alert: వెంటనే చేయకపోతే పాన్‌కార్డు హోల్డర్లకు 10 వేల భారీ జరిమానా

పాన్‌కార్డు అనేది ప్రస్తుతం ప్రతి ఆర్ధిక లావాదేవీకు అత్యవసమైన డాక్యుమెంట్. ప్రతి బ్యాంకు లావాదేవీ, ట్యాక్స్ రిటర్న్స్‌కు చాలా అవసరం. అందుకే పాన్‌కార్డుకు సంబంధించి ఎప్పటికప్పుడు ఇన్‌కంటాక్స్ శాఖ నుంచి కీలకమైన అప్‌డేట్స్ వెలువడుతుంటాయి. ఈ అప్‌డేట్స్ పూర్తి చేయకపోతే పాన్‌కార్డు నిరుపయోగమైపోతుంది.

పాన్‌కార్డును గుర్తింపు కోసం ఆర్ధిక లావాదేవీల కోసం ఉపయోగపడుతుంది. ఒక్కోసారి పొరపాటున 1-2 పాన్ కార్డులు ఉంచుకుంటారు. బహుశా అందుకే ఈసారి కేంద్ర బడ్జెట్‌లో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాన్‌కార్డు విషయంలో కీలకమైన ప్రకటన చేశారు. పాన్‌కార్డుకు ఈసారి కొత్త గుర్తింపును ఇచ్చారు. ఇక పాన్‌కార్డు అందరికీ కామన్ అని తెలిపారు. అంటే సాధారణమైన గుర్తింపు కార్డుగా పాన్‌కార్డును ఉపయోగించుకోవచ్చు. 

ఈ పరిస్థితుల్లో పాన్‌కార్డు యాక్టివ్‌గా ఉండటం చాలా అవసరం. ఈ ఏడాది అంటే 2023 మార్చ్ 31 లోగా పాన్‌కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాల్సి ఉంటుంది. పాన్‌కార్డును ఆధార్ కార్డుతో నిర్ణీత గడువులోగా అనుసంధానం చేయకపోతే పాన్‌కార్డు డీ యాక్టివేట్ అయిపోతుంది. దీంతోపాటు అనుసంధానం చేసేందుకు 1000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

10 వేల రూపాయల జరిమానా

ఎవరైనా వ్యక్తి డీయాక్టివేట్ అయిన పాన్‌కార్డు సమర్పిస్తే ఇన్‌కంటాక్స్ చట్టం 1961 సెక్షన్ 272 ఎన్ ప్రకారం ఆ వ్యక్తికి 10 వేల రూపాయలు జరిమానా విధించవచ్చు. 

జైలు శిక్ష కూడానా

కొన్ని సందర్భాల్లో పొరపాటున 1 కంటే ఎక్కువ పాన్‌కార్డులు కలిగి ఉంటారు. పాన్‌కార్డు అనేది సరైన ఐడెంటిటీ ఆధారంగానే జారీ అయినా..2016 కంటే ముందు ఇన్‌కంటాక్స్ శాఖకు ఒకటి కంటే ఎక్కువ పాన్‌కార్డులున్నాయనే విషయమై చాలా ఫిర్యాదులు అందాయి. మీ వద్ద కూడా ఒకటి కంటే ఎక్కువ పాన్‌కార్డులుంటే..ఒకదానిని సరెండర్ చేయాల్సి ఉంటుంది. ఎవరివద్దనైనా ఒకటి కంటే ఎక్కువ పాన్‌కార్డులుంటే కనీసం 6 నెలలు జైలు శిక్ష,10 వేల రూపాయల జరిమానా ఉంటుంది. లేదా రెండింటిలో ఏదో ఒకటి కూడా ఉండే అవకాశముంది.

ఆధార్ కార్డుతో పాన్‌కార్డు ఎలా లింక్ చేయాలి
How to link pancard with aadhaar card

ముందు ఇన్‌కంటాక్స్ శాఖ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. మీ పేరు, పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఈ వివరాలు ఆధార్ కార్డులో ఉన్నట్టే ఉండాలి. ఆధార్ కార్డులో పుట్టిన సంవత్సరం ఉంటే సంబంధిత బాక్స్ టిక్ చేయాలి. ఇప్పుడు క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. లింక్ ఆధార్ బటన్ ప్రెస్ చేయాలి. అంతే మీ పాన్‌కార్డుతో ఆధార్ కార్డు లింక్ అయిపోయినట్టే.

ఎస్ఎంఎస్ ద్వారా ఎలా లింక్ చేయవచ్చు
How to link pancard with aadhaar through sms

మీ ఫోన్‌లో UIDPAN అని టైప్ చేసి మీ 12 అంకెల ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తరువాత పది అంకెల పాన్ నెంబర్ టైప్ చేయాలి. ఈ మెస్సేజ్‌ను 567678  లేదా 56161 కు పంపించాలి. 

డీయాక్టివ్ పాన్‌కార్డును ఎలా యాక్టివేట్ చేయాలి
How to acitve deactivated pancard

డీయాక్టివేట్ అయిన పాన్‌కార్డును యాక్టివేట్ చేయవచ్చు. దీనికోసం మీరు ఎస్ఎంఎస్ పంపించాల్సి ఉంటుంది. మెస్సేజ్ బాక్స్‌లో మీ పది అంకెల పాన్ నెంబర్ రిజిస్టర్ మొబైల్ నుంచి టైప్ చేసి 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి 567678  లేదా 56161 కు పంపించాలి.

Also read: Tatkaal passport: తత్కాల్ పాస్‌పోర్ట్ కోసం ఎలా అప్లై చేయాలి, కావల్సిన అర్హతలేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News