Income tax Returns: ఇన్‌కంటాక్స్ నుంచి కీలక అప్‌డేట్, ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ ప్రారంభం, జూలై 31 చివరి తేదీ

Income tax Returns: ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి కీలకమైన అప్‌డేట్ వెలువడింది.2023-24 ఆర్ధిక సంవత్సరం కోసం ఆన్‌లైన్ ఐటీఆర్ -1, ఐటీఆర్ -4 ఫైల్ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఇతర సేవలు సైతం త్వరలో ప్రారంభం కానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 23, 2023, 05:12 PM IST
Income tax Returns: ఇన్‌కంటాక్స్ నుంచి కీలక అప్‌డేట్, ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ ప్రారంభం, జూలై 31 చివరి తేదీ

Income tax Returns: 2022-23 ఆర్ధిక సంవత్సరం ముగిసి కొత్త ఆర్ధిక సంవత్సరం 2023-24 ప్రారంభమై రెండో నెల పూర్తి కావస్తోంది. ఇప్పుడిక ఐటీ రిటర్న్స్, ఐటీ రిటర్న్స్ రిఫండ్ క్లైమ్ చేసే సమయం ఆసన్నమైంది. ఆన్‌లైన్ ద్వారా ఐటీ రిటర్న్స్ -1,4 ఫైల్ చేసే ప్రక్రియను ప్రారంభించినట్టు ఇన్‌కంటాక్స్ శాఖ ట్వీట్ ద్వారా వెల్లడించింది. 

ఆదాయపు పన్ను శాఖ అధికారిక ట్విట్టర్ ఎక్కౌంట్‌లో వ్యక్తులు, ఉద్యోగులు, చిరు వ్యాపారుల ఈ ఫైలింగ్ ప్రక్రియ ప్రారంభించినట్టు ట్వీట్ చేసింది. 2023-24 ఆర్ధిక సంవత్సరం ఐటీ రిటర్న్స్ -1, ఐటీ రిటర్న్స్ -4 ఫైల్ చేసే ప్రక్రియ ప్రారంభమైందని అర్ధం. 2022-23 ఆర్దిక సంవత్సరానికి సంబంధించిన ఎక్కౌంట్లకు ఆడిట్ అవసరం లేదని తెలిపింది. వీటికి సంబంధించి ఐటీ రిటర్న్స్ భర్తీ చేసేందుకు చివరి తేదీ జూలై 31గా ఉంది. ఐటీ రిటర్న్స్ -1 అనేది ఉద్యోగులు, సీనియర్ సిటిజన్లు, ఇతర వ్యక్తులు ఫైల్ చేస్తారు. ఇక ఐటీ రిటర్న్స్ -2 అనేది కంపెనీలు, వృత్తిపరులు భర్తీ చేస్తారు. ఏడాది ఆదాయం 50 లక్షలు దాటనివారికి ఇది వర్తిస్తుంది. 

ఆఫ్‌లైన్ ఐటీఆర్-2 ఫారమ్ 

ఇంతకుముందు కొద్దిరోజుల క్రితం ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేసేందుకు ఐటీఆర్-2 ఆఫ్‌లైన్  దరఖాస్తు కూడా విడుదలైంది. ఐటీఆర్ దరఖాస్తులో ఓ కీలకమైన మార్పు చోటుచేసుకుంది. ఇందులో వర్చువల్ కరెన్సీ, డిజిటల్ ఎస్సెట్స్ గురించి సమాచారముంది. ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్ విధానంలో ఐటీఆర్ ఫామ్ జమ చేస్తే దానిని నిర్ధారించాల్సి ఉంటుంది. ఐటీ రిటర్న్స్‌ను నిర్ధారించకపోతే ఇన్‌కంటాక్స్ శాఖ తరుపున ప్రోసెస్ కాదు. 

ఐటీఆర్-2 ఎవరు ఫైల్ చేస్తారు

ఒకవేళ మీ వార్షిక ఆదాయం 50 లక్షల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మీరు ఐటీఆర్-2 దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇందులో ఒకటి కంటే ఎక్కువ రెసిడెన్షియల్ ఆస్థులు, ఇన్వెస్ట్‌మెంట్స్‌పై లభించే లాబాలు లేదా నష్టాలు, 10 ఏళ్ల కంటేఎక్కువ డివిడెంట్ ఆదాయం, పొలాలపై వచ్చే ఆదాయం గురించి వివరణ ఉంది. అంతేకాకుండా పీఎఫ్‌పై వడ్డీ వస్తుంటే దానిపై కూడా ఫామ్ భర్తీ చేయాల్సి ఉంటుంది.

Also read: Nokin C32: నోకియా నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్, నోకియా సి32 లాంచ్ తేదీ, ధర ఎంతంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News