CIBIL Score Checking: పాన్ కార్డు లేకున్నా సిబిల్ స్కోర్ చెక్ చేసుకోండి.. సింపుల్ స్టెప్స్ ఇవిగో..!

CIBIL Score Check Without PAN Card: ప్రస్తుతం ఎక్కడికి వెళ్లి లోన్ తీసుకోవాలన్నా.. తప్పకుండా సిబిల్ స్కోరు ఎంత ఉందో అడుగుతారు. సిబిల్ స్కోరు ఎంత ఎక్కువ ఉంటే.. అంత మంచి లోన్ ఆఫర్లు వస్తాయి. సిబిల్ స్కోరు ఎంత ఉందో పాన్ కార్డు లేకున్నా చెక్ చేసుకోవచ్చు. ఎలాగో ఇక్కడ ఫాలో అవ్వండి..   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 30, 2024, 04:27 PM IST
CIBIL Score Checking: పాన్ కార్డు లేకున్నా సిబిల్ స్కోర్ చెక్ చేసుకోండి.. సింపుల్ స్టెప్స్ ఇవిగో..!

CIBIL Score Check Without PAN Card: మనిషి గుండె కొట్టుకునే స్పీడ్, పల్స్ రేటు చూసి ఆ వ్యక్తి హెల్తీగా ఉన్నాడో లేదో చెప్తారు. అదే అతని ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో చెక్ చూడాలంటే.. క్రెడిట్ స్కోరు ఎంత ఉందో తెలుసుకోవాలి. క్రెడిట్ స్కోరు ఎంత ఎక్కువగా ఉంటే.. అతను ఆర్థికంగా కరెక్ట్‌గా మెయింటెన్ చేస్తున్నాడని అర్థం. బ్యాంకులు కూడా సిబిల్ స్కోరు చూసే లోన్లు ఇస్తాయి. క్రెడిట్ స్కోరు ఎంత ఉందో చెక్ చేసుకోవడానికి క్రెడిట్ బ్యూరోలో పాన్ కార్డు నంబరు ఎంటర్ చేయాలి. ఇన్‌కమ్ ట్యాక్స్ సంబంధిత ప్రయోజనాల కోసం పాన్‌ కార్డును ఉపయోగించాల్సి ఉంటుంది. 

క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్‌ను వాడుకలో సిబిల్ (CIBIL) అని ఎక్కువగా పిలుస్తారు. ఇది కంపెనీలకు క్రెడిట్ రేటింగ్‌లను అందించే సంస్థ. మన దేశంలో క్రెడిట్ స్కోర్ 300 నుంచి 900 వరకు లెక్కిస్తారు. ఎక్కువ క్రెడిట్ స్కోరు ఉంటే.. అతను అన్ని లోన్లు, క్రెడిడ్ కార్డు బిల్లులు సక్రమంగా చెల్లిస్తున్నాడని అర్థం. క్రెడిట్ స్కోరు తెలుసుకోవాలంటే అందరూ తప్పనిసరిగా పాన్ కార్డు కావాలని అనుకుంటారు. అయితే పాన్ కార్డు లేకున్నా.. సిబిల్ స్కోరు తెలుసుకోవచ్చు. ఎలాగో ఇక్కడ తెలుసుకోండి.

==> ముందుగా అధికారిక CIBIL వెబ్‌సైట్‌ని సందర్శిండి.
==> 'పర్సనల్ CIBIL స్కోర్' అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి.. 'ఫ్రీగా CIBIL స్కోర్‌ను తెలుసుకోండి.' ఆప్షన్‌ను ఎంచుకోండి.
==> లేదా https://myscore.cibil.com/CreditView/enrollShort_new.page?enterprise=CIBIL లింక్‌పై క్లిక్ చేయండి. ఈమెయిల్ ఐడీను ఉపయోగించి.. అకౌంట్‌ను ఓపెన్ చేయాలి. సీక్రెట్ పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసుకోండి.
==> పూర్తి పేరును ఎంటర్ చేసి.. పాన్ కార్డ్ స్థానంలో పాస్‌పోర్ట్, ఓటర్ ID లేదా డ్రైవర్ లైసెన్స్ వంటి ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలను ఎంచుకోండి.
==> పుట్టిన తేదీ, పిన్ కోడ్‌ను ఎంటర్ చేయండి. రాష్ట్రాన్ని ఎంచుకోండి. చివరగా మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి. 'అంగీకరించి కొనసాగించు'పై క్లిక్ చేయండి.
==> మీ నంబరుకు వచ్చిన ఓటీపీని ధృవీకరించండి. ఆ తరువాత 'కొనసాగించు'పై క్లిక్ చేయండి.
==> మీ అకౌంట్‌ను మీరు వినియోగిస్తున్న సిస్టమ్‌తో యాడ్ చేయాలని అనుకుంటున్నారా..? అని అడుగుతుంది. మీరు సేఫ్ అనుకుంటే.. 'YES' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. వద్దనుకుంటే 'NO'పై క్లిక్ చేసి కంటిన్యూ చేయండి.
==> సక్సెస్‌ఫుల్‌గా రిజిస్ట్రేషన్‌ పూర్తయిందని స్క్రీన్‌పై మెసేజ్ కనిపిస్తుంది. 
==> మీ మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.'గో టు డాష్‌బోర్డ్' ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఇక్కడ CIBIL స్కోర్‌ను వీక్షించడానికి అనుమతిస్తుంది.
==> కనీసం నెలకు ఒకసారి సిబిల్ స్కోర్‌ను చెక్ చేసుకోవడం మంచి పద్ధతి. బ్యాంకులు మెరుగైన లోన్ ఆఫర్‌లను అందిచేందుకు అవకాశం ఉంటుంది. 

Also Read:  Redmi Note 13 5G Price: అమెజాన్‌లో దిమ్మతిరిగే ఆఫర్స్‌..Redmi Note 13 5G మొబైల్‌ను రూ.800కే పొందండి!   

Also Read:  Heat Waves: రానున్న 3-4 రోజుల్లో ఈ జిల్లాల్లో తీవ్రమైన ఎండలు, వడగాలులు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News