Hero Pleasure Plus Xtec 2024 Vs Honda Activa 6G: స్కూటర్స్‌ కొనుగోలు చేసేవారు తప్పకుండా ఈ ప్రధాన తేడాలు తెలుసుకోండి!

Hero Pleasure Plus Xtec Vs Honda Activa 6G: మార్కెట్లో హోండా యాక్టివా 6జికి మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఈ స్కూటీ ఆటోమొబైల్ మార్కెట్లో తెగ అమ్ముడుపోతోంది. అయితే దీనికి పోటీగా హీరో కొత్త స్కూటీని మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ రెండు స్కూటీల్లో ఏది శక్తివంతమైనదో, ఏది అత్యధిక ఫీచర్లతో అందుబాటులోకి వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 29, 2024, 06:18 PM IST
Hero Pleasure Plus Xtec 2024 Vs Honda Activa 6G: స్కూటర్స్‌ కొనుగోలు చేసేవారు తప్పకుండా ఈ ప్రధాన తేడాలు తెలుసుకోండి!

 

Hero Pleasure Plus Xtec Vs Honda Activa 6G: హోండా యాక్టివా 6జికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. గతంలో మార్కెట్లోకి హోండా లాంచ్ చేసిన యాక్టివా మోడల్ మంచి ప్రజాదరణ పొందడంతో సీరియల్ గా ప్రతి సంవత్సరం కొత్త కొత్త సీరియస్ ల్లో ఈ స్కూటర్ ను విడుదల చేస్తూ వస్తోంది. గత సంవత్సరంలో మార్కెట్లోకి లంచ్ అయిన హోండా యాక్టివా 6జి విక్రయాల్లో దూసుకుపోతోంది. అయితే దీనికి పోటీగా ఇటీవలే లాంచ్ అయిన హీరో ప్లెజర్ ప్లస్ xtec స్కూటర్ రాబోతున్నట్లు మార్కెట్లో టాక్. ఇటీవలే విడుదలైన ఈ స్కూటర్ కూడా అనేక రకాల శక్తివంతమైన ఫీచర్స్ తో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ రెండు స్కూటర్స్ మధ్య ఉన్న ప్రత్యేకమైన తేడాలేంటో..? రెండింటిలో ఏ స్కూటర్ మైలేజీ, ధర, ఫీచర్స్ పరంగా బెస్తో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ముందుగా ఈ రెండు స్కూటర్స్‌కు సంబంధించిన ధర వివరాలు వెళితే, హీరో ప్లెజర్ ప్లస్ xtec ధర రూ.79,117 (ఎక్స్-షోరూమ్)తో లభిస్తోంది. ఇక హోండా యాక్టివా 6G ధర రూ.77,712 (ఎక్స్-షోరూమ్)తో అందుబాటులో ఉంది. ఈ రెండు స్కూటర్స్‌లో తెరపరంగా హోండా యాక్టివా 6జి చాలా బెస్ట్. అయితే ఈ రెండు స్కూటర్స్ ఇతర వివరాల్లోకి వెళితే.. హీరో ప్లెజర్ ప్లస్ xtec స్కూటీ 8 bhp శక్తిని ఉత్పత్తి చేసే 110.9cc ఇంజన్ తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఈ స్కూటర్ 8.7 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక హోండా యాక్టివా 6g విషయానికొస్తే, 7.73 bhp శక్తిని ఉత్పత్తి చేసే 109.51cc ఇంజన్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ స్కూటర్ 8.84 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇక ఈ రెండు స్కూటర్స్ మైలేజ్, ఇతర ఫీచర్స్ వివరాలు, హీరో ప్లెజర్ ప్లస్ xtec 50 kmpl మైలేజ్ ఇస్తుంది. అంతేకాకుండా స్కూటర్ ముందు వీల్ లో డిస్క్ బ్రేక్, ముందు డిస్క్ బ్రేక్లతో అందుబాటులోకి వచ్చింది. ఇక హోండా యాక్టివా విషయానికొస్తే, ఇది లీటర్ పెట్రోల్ కి 50 kmpl మైలేజ్ ఇస్తుంది. యాక్టివా 6Gలో ముందు డ్రమ్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేక్ ఉన్నాయి. హీరో ప్లెజర్ ప్లస్ xtec లో LED హెడ్‌ల్యాంప్, టైల్‌ల్యాంప్, LED DRLs, USB ఛార్జింగ్ పోర్ట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వంటి అనేక టీచర్లతో అందుబాటులోకి వచ్చింది. ఇది సెల్ఫ్ స్టార్ట్, కిక్ స్టార్ట్‌లు ఉన్నాయి. హోండా యాక్టివా 6G లో LED హెడ్‌ల్యాంప్, టైల్‌ల్యాంప్, LED DRLs, USB ఛార్జింగ్ పోర్ట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. ఇందులో కేవలం సెల్ఫ్ స్టార్ట్ మాత్రమే ఉంటుంది.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

ఈ రెండు స్కూటీల సస్పెన్షన్ వివరాల్లోకి వెళితే.. హీరో ప్లెజర్ ప్లస్ xtecలో ముందు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్‌ను కలిగి ఉన్నాయి. హోండా యాక్టివా 6Gలో ముందు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక డ్యూయల్ షాక్ అబ్జార్బర్ ఉంటాయి. వెర్షన్ల వివరాలు చూస్తే..హీరో ప్లెజర్ ప్లస్ xtec ఒకే వెర్షన్‌లో లభిస్తుంది. హోండా యాక్టివా 6G లో STD, డీలక్స్ వెర్షన్లతో అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ రెండింటిలో మంచి స్కూటీని కొనుగోలు చేయాలనుకునేవారు హీరో ప్లెజర్ ప్లస్ xtec మంచి ఎంపికగా భావించవచ్చు. ఇది శక్తివంతమైన ఫీచర్లతో పాటు గొప్ప డిజైన్ కలిగి ఉంది.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News