A 350 Flights: దేశంలోని తొలి ఎయిర్ బస్ ఏ 350 జనవరి 22 నుంచి ప్రారంభం, బుకింగ్స్ షురూ, ఏయే మార్గాల్లో, ఎన్నిగంటలకు

A 350 Flights: ఎయిర్ ఇండియా నుంచి కీలకమైన అప్‌డేట్ ఇది. కొత్త ఏడాదిలో ఎయిర్ ఇండియా దేశంలో తొలి ఎయిర్ బస్ ఏ 350  సేవలు ప్రారంభించనుంది. మొదటి ఏ350 విమానం బెంగళూరు నుంచి ముంబైకు ప్రారంభం కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 3, 2024, 12:26 PM IST
A 350 Flights: దేశంలోని తొలి ఎయిర్ బస్ ఏ 350 జనవరి 22 నుంచి ప్రారంభం, బుకింగ్స్ షురూ, ఏయే మార్గాల్లో, ఎన్నిగంటలకు

A 350 Flights: టాటా చేతికి చిక్కిన తరువాత ఎయిర్ ఇండియా సేవలు విస్తృతమౌతున్నాయి. త్వరలో జనవరి 22 నుంచి ఏ350 డొమెస్టిక్ విమాన సేవలు ప్రారంభం కానున్నాయి. దేశంలో మొదటి ఎయిర్ బస్ ఏ350 జనవరి 22 నుంచి ప్రారంభమై..బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, ముంబైకు రాకపోకలు సాగిస్తుంది. 

దేశంలోని తొలి ఎయిర్ బస్ ఏ350ను ఎయిర్ ఇండియా జనవరి 22 నుంచి ప్రారంభించనుంది. దేశం బెంగళూరు, చెన్నై, ముంబై, హైదరాబాద్, ఢిల్లీ నగరాలకు ఏ 350 ఎయిర్ బస్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి త్వరలో లాంగ్ హాల్టింగ్ ఫ్లైట్స్ కూడా ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే సోమవారం నుంచి ఏ 350 ఫ్లైట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 20వ తేదీన తొలి కన్‌సైన్‌మెంట్‌లో భాగంగా 20 ఏ350-900 విమానాలు ఢిల్లీకు చేరుకున్నాయి. 

ఇందులో 28 బిజినెస్ క్లాస్, 24 ప్రీమియం ఎకానమీ, 264 ఎకానమీ క్లాస్ సీట్లు ఉంటాయి. మొదటి ఎయిర్ బస్ ఏ 350 బెంగళూరు నుంచి ముంబైకు నడవనుంది. ఫ్లైట్ నెంబర్ ఏ 1589 బెంగళూరు-ముంబై మంగళవారం తప్పించి అన్నిరోజులుంటుంది. ఉదయం 7.05 గంటలకు బయలుదేరి 8.50 గంటలకు చేరుతుంది. ఇక ముంబై-చెన్నై ఫ్లైట్ నెంబర్ ఏ 1589 కూడా మంగళవారం తప్పించి అన్ని రోజులుంటుంది. ఇది మద్యాహ్నం 10.05 గంటలకు ప్రారంభమై 12.05 గంటలకు చేరుతుంది. 

ఇక చెన్నై బెంగళూరు ఫ్రైట్ నెంబర్ ఏ 1589 మంగళవారం మినహ అన్ని రోజులుంటుంది. ఇది మద్యాహ్నం 1.20 గంటలకు ప్రారంభమై 2.30 గంటలకు చేరుతుంది. ఫ్లైట్ నెంబర్ ఏ 1587 బెంగళూరు-చెన్నై మంగళవారం మినహా అన్నిరోజులు తిరుగుతుంది. సాయంత్రం 4 గంటలకు బయలుదేరి 5.10 గంటలకు చేరుతుంది. చెన్నై-హైదరాబాద్ ఫ్లైట్ నెంబర్ ఏ 1587 మంగళవారం మినహా అన్ని రోజులుంటుంది. సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమై 7.40 గంటలకు చేరుతుంది. 

ఫ్రైట్ నెంబర్ ఏ 1587 హైదరాబాద్-బెంగళూరు మంగళవారం మినహా అన్నిరోజులుంటుంది.  రాత్రి 9.10 గంటలకు ప్రారంభమై 10.20 గంటలకు చేరుతుంది. ఇక ఫ్లైట్ నెంబర్ ఏ 1868 బెంగళూరు-ఢిల్లీ కేవలం మంగళవారమే తిరుగుతుంది. ఉదయం 7.40 గంటలకు ప్రారంభమై  10.30 గంటలకు చేరుతుంది. మరో ఫ్లైట్ నెంబర్ 1869 ఢిల్లీ-బెంగళూరు కేవలం మంగళవారమే ఉంటుంది. సాయంత్రం 7 గంటలకు ప్రారంభమై 9.50 గంటలకు చేరుతుంది. 

Also read: Ind vs SA 2nd Test: ఇండియా దక్షిణాఫ్రికా రెండో టెస్ట్ నేడు, కేప్‌టౌన్ పిచ్, వెదర్ రిపోర్ట్ ఎలా ఉంటుందంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News