Air India Dispute: మరోసారి వివాదంలో ఎయిర్ ఇండియా, చికాగో విమానాశ్రయంలో చిక్కుకున్న 300 మంది ప్రయాణీకులు

Air India Dispute: ఇటీవలి కాలంలో వివిధ కారణాలతో ఎయిర్ ఇండియా వ్యవహారం వివాదాస్పదమౌతోంది. ఇప్పుడు మరోసారి ఎయిర్ ఇండియా ప్రయాణీకులు దేశం కాని దేశంలో ఇరుక్కుపోయారు. 24 గంటలకు పైగా చిక్కుకుపోవడంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 16, 2023, 01:38 PM IST
Air India Dispute: మరోసారి వివాదంలో ఎయిర్ ఇండియా, చికాగో విమానాశ్రయంలో చిక్కుకున్న 300 మంది ప్రయాణీకులు

Air India Dispute: ఎయిర్ ఇండియాపై ఇటీవలి కాలంలో విమర్శలు అధికమౌతున్నాయి. తోటి ప్రయాణీకులపై మూత్ర విసర్జన, సిబ్బంది నిర్లక్ష్యం ఫలితంగా ఇప్పటికే భారీగా జరిమానా విధించుకుంది. ఇప్పుడు దేశం కాని దేశంలో ఎయిర్ ఇండియా ప్రయాణీకులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. అసలేం జరిగిందంటే..

ఎయిర్ ఇండియాకు చెందిన ఓ విమానం చికాగో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మంగళవారం మద్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరి మార్చ్ 15 మద్యాహ్నం 2.20 గంటలకు ఢిల్లీలో ల్యాండ్ కావల్సి ఉంది. అయితే ఏ కారణం లేకుండా, సమాచారం లేకుండా విమానం రద్దు కావడంతో దాదాపు 300 మంది ప్రయాణీకులు 24 గంటలకు పైగా చికాగో విమానాశ్రయంలో ఉండిపోవల్సి వచ్చింది.

విమానం రద్దై సమాచారం ప్రయాణీకులకు ఇవ్వడంలో ఎయిర్ ఇండియా విఫలమైందనే విమర్శ ఉంది. 24 గంటలకు పైగా విమానాశ్రయంలో పడిగాపులు కాయాల్సివచ్చిందని ఓ ప్రయాణీకుడు ఆవేదన చెందాడు. ఢిల్లీకు ఎప్పుడు బయలుదేరుతామో తెలియక, చెప్పే నాధుడు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని ప్రయాణీకులు వాపోయారు. ఇందులో కొంతమంది విదేశీ ప్రయాణీకులు కూడా ఉన్నారు. 

వాస్తవానికి సాంకేతిక కారణాలతో ఫ్లైట్ నెంబర్ ఏఐ 126 విమానం మార్చ్ 14న రద్దైంది. కానీ ఈ సమాచారం ప్రయాణీకులకు చేరలేదు. దాంతో విమానం కోసం 24 గంటలకు పైగా నిరీక్షించారు. ఈ వ్యవహారంపై విమర్శలు పెరగడం, ప్రయాణీకుల ఆందోళన నేపధ్యంలో ఎయిర్ ఇండియా స్పందించింది. ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణీకుల్ని పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఎయిర్ ఇండియా తెలిపింది. ఇలాగే వివిధ రకాల సాంకేతిక కారణాలతో 2022లో 1171 మంది, 2021లో 931 మంది, 2020లో 1481 మంది విమానాల రద్దు కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఎయిర్ ఇండియా వెల్లడించింది. చికాగో విమానాశ్రయంలో ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. 

Also read: MLC Kavitha: మార్చ్ 24 వరకూ విచారణకు హాజరుకాలేను.. తిరస్కరించిన ఈడీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News