Vijaysai Reddy: ఢిల్లీలో విజయసాయి అంత పవర్ ఫుల్లా? బీజేపీ నిర్ణయాలు ఆయనకే ముందు తెలుస్తాయా?

Vijaysai Reddy: విజయసాయి రెడ్డి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. జగన్ ఆస్తుల కేసులో ఏ2గా ఉన్న విజయసాయి రెడ్డి.. జైలుకు కూడా వెళ్లారు. వైసీపీలో విజయసాయి రెడ్డే నెంబర్ టు అనే ప్రచారం ఉంది.

Written by - Srisailam | Last Updated : Jun 21, 2022, 06:59 PM IST
  • అనసూయా ఉయికేను కలిసిన సాయిరెడ్డి
  • ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా అనసూయా
  • బీజేపీ నిర్ణయం సాయిరెడ్డికి ముందే తెలిసిందా?
Vijaysai Reddy: ఢిల్లీలో విజయసాయి అంత పవర్ ఫుల్లా? బీజేపీ నిర్ణయాలు ఆయనకే ముందు తెలుస్తాయా?

Vijaysai Reddy: విజయసాయి రెడ్డి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. జగన్ ఆస్తుల కేసులో ఏ2గా ఉన్న విజయసాయి రెడ్డి.. జైలుకు కూడా వెళ్లారు. వైసీపీలో విజయసాయి రెడ్డే నెంబర్ టు అనే ప్రచారం ఉంది. వైసీపీ నిర్ణయాల్లో విజయసాయి రెడ్డి కీలక పాత్ర పోషిస్తారని అంటారు. పార్టీ, ప్రభుత్వానికి సంబంధించిన కీలక అంశాలు ఉంటే.. సాయిరెడ్డికే జగన్ అప్పగిస్తారనే టాక్ ఉంది. కేంద్రంలో సీఎం జగన్ పనులన్ని సాయిరెడ్డే చూసుకుంటారు. ఒక రకంగా ఢిల్లీలో వైసీపీకి అంతా తానై నడిపిస్తారు. వైసీపీలో జగన్ తర్వాత సాయిరెడ్డి పవర్ ఫుల్ కాబట్టే.. తెలుగుదేశం పార్టీ అతన్ని టార్గెట్ చేస్తుందని అంటారు. అయితే వైసీపీలోనే కాదు బీజేపీ ప్రభుత్వంలోనూ విజయసాయి రెడ్డి పవర్ ఫుల్ అంటున్నారు. అందుకు సంబంధించిన కొన్ని విషయాలు బయటికి వస్తున్నాయి.

బీజేపీ పెద్దలతో విజయసాయి రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయని మొదటి నుంచి వార్తలు వస్తున్నాయి. ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షాను ఈజీగానే వెళ్లి కలుస్తుంటారు విజయసాయి రెడ్డి. ముఖ్యమంత్రులకు అపాయింట్ మెంట్లు ఇవ్వని మోడీ.. సాయిరెడ్డి మాత్రం వెంటనే ఇస్తారనే టాక్ ఢిల్లీ వర్గాల్లో ఉంది. బీజేపీలో తీసుకునే నిర్ణయాలు ముందే సాయిరెడ్డికి తెలుస్తాయని అంటారు. కేంద్ర సర్కార్ నిర్ణయాలు కూడా ఆయనకు ముందే లీకవుతాయని తెలుస్తోంది. బీజేపీ లీడర్లకు తెలియని విషయాలు కూడా సాయిరెడ్డికి తెలుస్తాయంటారు. తాజాగా జరిగిన ఘటనతో ఢిల్లీలో విజయసాయి రెడ్డి ఎంత పవర్ ఫుల్లో తెలుస్తోందని అంటున్నారు.

జూన్ 18న ఛత్తీస్ ఘడ్ వెళ్లారు విజయసాయి రెడ్డి. అక్కడి రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ అనసూయా ఉయికేని కలిశారు. ఆమెకు పుష్పగుచ్చం ఇచ్చారు. ఈ విషయాన్ని అనసూయా తన ట్వీట్ ద్వారా వెల్లడించింది. విజయసాయి రెడ్డి కలిసిన అనసూయా ఉయికేనే ఇప్పుడు ఎన్డీఏ కూటమి రాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారయ్యారని తెలుస్తోంది. రాష్ట్రపతి అభ్యర్థిగా ఆమెను ఎంపిక చేశారని తెలిశాకే విజయసాయి రెడ్డి ఛత్తీస్ ఘడ్ వెళ్లి ముందే ఆమెను అభినందించారని అంటున్నారు. ఇందుకు బలమైన కారణం కూడా ఉంది. 2017 రాష్ట్రపతి ఎన్నికల సమయంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. పాట్నా వెళ్లి అప్పడు బీహార్ గవర్నర్ గా ఉన్న రాం నాధ్ కోవింద్ ని కలిశారు విజయసాయి రెడ్డి.. . ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు. సాయిరెడ్డి కలిసి వచ్చిన కొన్ని రోజులకే ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా రాంనాథ్ కోవింద్ పేరును బీజేపీ ప్రకటింటింది. ఇప్పుడు కూడా విజయసాయి రెడ్డి కలిసిన అనసూయా ఉయికేనే ఎన్డీఏ ప్రెసిడెంట్ అభ్యర్థి అంటున్నారు.

ఈ రెండు ఘటనలను ఉదహరిస్తూ కేంద్రంలో, ఢిల్లీలో విజయసాయి రెడ్డి ఎంత పవర్ ఫుల్లో తెలుస్తుందని అంటున్నారు. బీజేపీ పెద్దల నుంచి సాయిరెడ్డికి సమాచారం వస్తుందని తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగానే వైసీపీ ఉంది. అధికారికంగా ప్రకటించకపోయినా.. కేంద్ర పెద్దలకు సీఎం జగన్ హామీ ఇచ్చారని టాక్. ఈ నేపథ్యంలోనే బీజేపీ పెద్దలతో వైసీపీ ప్రతినిధిగా మాట్లాడుతున్న విజయసాయి రెడ్డికి రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో సమాచారం వచ్చిందని అంటున్నారు. మరోవైపు సాయిరెడ్డికి ఢిల్లీలో ఉన్న పవర్ చూసి మిగితా నేతలు షాకవుతున్నారు. తమ పార్టీకి సంబంధించి కీలక విషయాలు తమకంటే ముందు విజయసాయి రెడ్డికే తెలుస్తున్నాయని ఏపీ, తెలంగాణ బీజేపీ నేతలు కూడా అంగీకరిస్తున్నారు.

Read also: President Election: కాంగ్రెస్ కూటమితోనే కేసీఆర్.. కొత్త పార్టీ లేనట్టేనా? తెలంగాణలో ఏం జరగబోతోంది?

Read also: Virat Kohli: పదేళ్ల నాటి ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ ఎందుకవుతుంది, కోహ్లీపై సంచలన వ్యాఖ్యలు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News