AP Land titling Act: ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై కేంద్రం ఉద్దేశ్యం ఏమిటి.. ?

AP Land titling Act: ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ల్యాండ్ టైటిల్ యాక్ట్ చుట్టే తిరుగుతోంది. దీనిపై ఏపీలో ప్రతిపక్షాలు మంచిది కాదంటూ దుష్ప్రచారం చేస్తుంటే.. ఈ ముసాయిదా చట్టంపై కేంద్రం వైఖరి ఏమిటన్నది ఇపుడు  హాట్ టాపిక్‌గా మారింది.  

Written by - TA Kiran Kumar | Last Updated : May 7, 2024, 12:42 PM IST
AP Land titling Act: ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై కేంద్రం ఉద్దేశ్యం ఏమిటి.. ?

AP Land titling Act: ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కానీ భూ వివాదాల పరిష్కారం కోసమే కేంద్రం ల్యాండ్ టైటిల్ యాక్ట్‌ను తీసుకొచ్చింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అమల్లోకి తీసుకురావాలన్నదే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యం. అంతేకాదు దేశ వ్యాప్తంగా ఒకే టైటిల్‌ రిజిస్టర్ అమలు చేయాలన్నదే కేంద్ర ధృఢ సంకల్పం. ఒకే రిజిస్టర్‌లో దేశంలోని అన్ని భూముల వివరాలు ఉంటాయి. దీని వల్ల ఏ భూమి ఎవరిదో తెలిసిపోతుంది. దురాక్రమణలకు ఎలాంటి అవకాశం ఉండదు.

దీనివల్ల ఎక్కడైనా పారదర్శకంగా ఎవరైనా..ఎక్కడైనా భూములు  కొనుగోలు చేయోచ్చు. అమ్మకాలను కూడా కొనసాగించవచ్చు. దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఎక్కడ భూమి కొనుగోలు చేసినా.. అందుబాటులో ఉన్న ప్రాంతంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టవచ్చు. భూములు అమ్మకాలు.. కొనుగోళ్లకు సంబంధించి ఋణాల వివరాలు.. అందుబాటులో ఉంటాయి. దీనివల్ల ఇపుడున్న తరహాలో ఒకే భూమిని అనేక మందికి అమ్మడం వంటివి ఉండవు. ఒకే భూమిని అనేక సంస్థలు బ్యాంకుల దగ్గర తనఖా పెట్టి ఋణాలు తీసుకోవడం వంటి ఆర్ధిక నేరాలకు పాల్పడే అవకాశం ఇకపై ఉండదు.  

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయాలన్న ఆలోచన కేంద్రంలోని ప్రభుత్వాలకు ఇపుడే పుట్టింది కాదు. 1989లోని అప్పట్లో నీతి ఆయోగ్ స్థానంలో ఉండే ప్రణాళిక సంఘం ఈ చట్టం అమలుకు సిఫార్సు చేసింది. 2008, 2011, 2019లో నాలుగు సార్లు కేంద్ర ప్రభుత్వాలు ముసాయిదా చట్టాన్ని రాష్ట్రాలకు పంపాయి. ఇక 2019లో నీతి ఆయోగ్ ల్యాండ్ టైటిల్ పై కొత్త ముసాయిదాను రాష్ట్రాలకు పంపింది.

Read More: UP Teen Collapses: టెన్షన్ పుట్టిస్తున్న ఘటనలు.. హాల్దీ వేడుకలో డ్యాన్స్ చేస్తూ చనిపోయిన యువతి..వైరల్ గా మారిన వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News