వైఎస్ జగన్ ఘన విజయానికి అదే కారణం: లక్ష్మీపార్వతి

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి అందించిన సుపరిపాలనను ఆయన వారసుడిగా వైఎస్ జగన్‌ కూడా అందిస్తారని, జగన్‌కు ఆ సమర్థత ఉందని లక్ష్మీపార్వతి విశ్వాసం వ్యక్తం చేశారు.

Last Updated : Jun 1, 2019, 05:33 PM IST
వైఎస్ జగన్ ఘన విజయానికి అదే కారణం: లక్ష్మీపార్వతి

కొల్లూరు: ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీరీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘన విజయం సాధించడానికి ఆయన ప్రవేశపెట్టిన నవరత్నాలే కారణమని ఆ పార్టీ నాయకురాలు లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. నవరత్నాల పట్ల ఆకర్షితులైనందు వల్లే ఏపీ ప్రజలు జగన్‌కు పట్టంకట్టి ఆయనను ముఖ్యమంత్రిని చేశారని ఆమె అభిప్రాయపడ్డారు. గుంటూరు జిల్లా కొల్లూరులోని వైఎస్సార్సీపీ నేత ఘంటా శివరంగారావు నివాసంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 

రాష్ట్రంలో వైఎస్సార్సీపీ, దేశంలో బీజేపీ ఎవ్వరి ఊహకు అందనంత ఘన విజయాలు సాధించాయని చెబుతూ... దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి అందించిన సుపరిపాలనను ఆయన వారసుడిగా వైఎస్ జగన్‌ కూడా అందిస్తారని, జగన్‌కు ఆ సమర్థత ఉందని లక్ష్మీపార్వతి విశ్వాసం వ్యక్తం చేశారు.

Trending News