Chandrababu Naidu Birthday: చంద్రబాబు చాణక్యం పనిచేస్తుందా..?.. ఏపీ రాజకీయాల్లో తన మరోసారి తన మార్కు చూపిస్తారా..?

HBD Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజున తన 74 వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు. 1950 ఏప్రిల్ 20న చంద్రబాబు జన్మించారు.  అసలే ఆంధ్రప్రదేశ్ లో  ఎన్నికల  సీజన్ నడుస్తోంది. అధికార వైఎస్సార్పీపీ కూడా బలంగానే ప్రచారం నిర్వహిస్తుంది. ఇక టీడీపీ పొత్తులో భాగంగా.. జనసేన, బీజేపీలతో కలిసి ఎన్నికల బరిలో దిగింది.

Written by - Inamdar Paresh | Last Updated : Apr 20, 2024, 01:14 PM IST
  • 74 పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నచంద్రబాబు..
  • ఏపీలో రాజకీయాల్లో బాబు చరిష్మా పనిచేస్తుందా..?
Chandrababu Naidu Birthday: చంద్రబాబు చాణక్యం పనిచేస్తుందా..?.. ఏపీ రాజకీయాల్లో తన మరోసారి తన మార్కు చూపిస్తారా..?

Chandrababu Naidu Political History: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ గా మారాయి. పద్నాళుగేళ్లు సీఎం గా ఉండి, ప్రస్తుతం అపోసిషన్ లో ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఎలాగైన ఈసారి అధికారం సాధించేందుకు పావులు కదుపుతున్నారు. తనదైన శైలీలో రాజకీయాల్లో వ్యూహా ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. దీనిలో భాగంగానే కేంద్రంలో ఉన్న బీజేపీతో సంప్రదింపులు జరిపారు. ఇక జనసేనతో కూడా కలుపు కొన్ని పొత్తులు కుదుర్చుకున్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ, శాశ్వత ఎనిమీస్ కానీ ఉండదరు. దీన్ని చక్కగా అవపోసిన చంద్రబాబు ఎప్పటి కప్పుడు ఎన్నికలు రాగానే తనదైన స్టైల్ లో పావులు కదుపుతుంటారు. గతంలో కాంగ్రెస్ తో కలిసి పొత్తులు పెట్టుకున్నారు.

Read More: Chandrababu Naidu Birthday: చంద్రబాబు నాయుడు బర్త్ డే.. విద్యార్థి నాయకుడి నుంచి ముఖ్యమంత్రి వరకు రాజకీయ ప్రస్థానం ఇలా..!

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సోనియాలతో ఎంతో భక్తుడిగా, నమ్మిన  బంటుగా వ్యవహరించారు. అంతేకాకుండా.. ఏపీలో అధికారంలోకి రావడం పక్కా అన్న విధంగా ప్రచారం కూడా నిర్వహించారు. అదే సందర్బంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పీఎం మోదీని నోటికొచ్చినట్లు నానా బండబూతులు తిట్టారు. మోదీ ఏపీకి చేసిందేమీ లేదంటూ కూడా బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా.. అనూహ్యంగా గత అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్సార్పీపీ అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలోనే వెంటనే చంద్రబాబు.. అలర్ట్ అయ్యారు. ఇక మోదీని ఆకర్షించేపనిలో పడ్డారు. పీఎం మోదీని భజన చేయడం మొదలు పెట్టారు.

జనసేన రాయబారంతో.. మోదీని, అమిత్ షాను కలిసేందుకు కూడా తెగ ప్రయత్నాలు చేశారు. కానీ మోదీ నుంచి సరైన రెస్పాన్స్ రాకపోవడంతో వెంటనే కాళ్లబెరానికి వెళ్లారు. ఇక ఎలాగోలా ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో గెలుపొందేందుకు మరోసారి పొత్తులు పెట్టుకున్నారు. బీజేపీ, జనసేనలతో కలిసి బరిలోకి దిగారు. ఆయన పధ్నాళుగేళ్ల రాజకీయ అనుభవంలో ప్రతిసారి ఎన్నికలలో ఎవరితోనైన పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి వెళ్లినట్లు తెలుస్తొంది. ఇప్పుడు అపోసిషల్ లీడర్ గా ఉన్న చంద్రబాబు గతంలో అధికారంలో ఉన్నప్పుడు మంచి పనులు కూడా చేశారని చెబుతుంటారు.  ముఖ్యంగా ఆయన అవిభజిత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక విదేశాల నుంచి అనేక ఐటీ కంపెనీలు, హైటెక్ సిటీ, వంటి వాటిని ఎంతో డెవలప్ చేశారని చెబుతుంటారు.

Read More: Heavy Rainfall In Hyderabad: చల్లబడిన భాగ్య న'గరం'.. పలు ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో వర్షం.. పవర్ కట్..

చంద్రబాబు ఎక్కువగా పథకాల మీద కాకుండా.. ఉపాధి కల్పనపై ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటారని చెబుతుంటారు.జనాల చేతపనులు చేయించి ఆ తర్వాత డబ్బులను ఇచ్చేలా చేసేవారు. కేవలం కూర్చున్న చోటే మనిషికి డబ్బులు వచ్చి పడితే దాని విలువ తెలియంటారు. మనం కష్టపడి సంపాదిస్తే దాన్నిఖర్చుచేయాలంటూ ఎంతో ఆలోచిస్తాం అదే ప్రభుత్వం పథకాలు రూపంలో డబ్బులు, ప్రతిదానికి ఏవోపథకాలు పెడితే.. జనాలు బద్దకస్తులై, ఉత్పాదకత తగ్గుతుందని చెబుతుంటారు. దీంతో వ్యక్తిలో ఉన్న నైపుణ్యం పూర్తిగా కనుమరుగై పోతుందని చెబుతుంటారు. అయితే.. ప్రస్తుతం అధికార వైఎస్సార్పీపీ మాత్రం ప్రజలందరికి తమ గడపకే అనేక పథకాలను వచ్చిచేరేలా చేసింది. మరీ ఈ ఎన్నికలలో ప్రజలు చంద్రబాబుకు పట్టం కడతారా.. లేదా వైఎస్సార్పీపీకే జిందాబాద్ కొడతారా అనేది తెలియడానికి మాత్రం ఇంకాస్త సమయం వేచిచూడాల్సి ఉంటుంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News