Rain Alert: ఏపీ, తెలంగాణకు వర్ష సూచన, ఎండలు-ఉక్కపోత నుంచి ఉపశమనం

Rain Alert: వేసవిని తలపించే ఎండల్నించి కాస్త ఉపశమనం కలగనుంది. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారుతోంది. ఏపీ, తెలంగాణలో రేపటి వరకూ తేలికపాటి వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ సూచించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 16, 2023, 06:17 AM IST
Rain Alert: ఏపీ, తెలంగాణకు వర్ష సూచన, ఎండలు-ఉక్కపోత నుంచి ఉపశమనం

Rain Alert: సెప్టెంబర్ నెలాఖరు నుంచి వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఓవైపు ఎండలు, మరోవైపు తీవ్రమైన ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. వాతావరణం పూర్తిగా పొడిగా ఉండటంతో వేసవిని తలపించే ఉక్కపోతను ఎదుర్కోవల్సి వచ్చింది. 

గత కొద్దిరోజులుగా వేసవిని తలపించే ఎండలు, ఉక్కపోతతో బాధపడుతున్న ప్రజానీకానికి ఉపశమనం కల్గించే వార్త ఇది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం నెమ్మదిగా మారుతోంది. తెలంగాణలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు, ఈశాన్యం నుంచి తెలంగాణ మీదుగా చల్లగాలులు వీస్తుండటమే ఇందుకు కారణం. ఈ చల్లగాలుల ప్రభావంతో మేఘాలు కలిగి తేలికపాటి వర్షాలు పడవచ్చు.

ఇక ఏపీ రాయలసీమ ప్రాంతంలో కూడా ఇవాళ తేలికపాటి వర్షాలు పడే అవకాశాలున్నాయి. మరోవైపు దక్షిణాంద్రలో కూడా అక్కడక్కడా వాతావరణం మేఘావృతమై చల్లగా ఉండవచ్చు. ఇప్పటికే పొరుగు రాష్ట్రాలు కేరళ, తమిళనాడులో వర్షాలు పడుతున్నాయి. ప్రస్తుతం బంగాళాఖాతంలో గంటకు 10-20 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుంటే అరేబియా సముద్రంలో 8-18 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా గంటకు 15 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయని ఐఎండీ తెలిపింది. 

వర్షాలు పడే ప్రాంతాల్లో తప్పించి మిగిలిన ప్రాంతాల్లో ఇవాళ పగటి ఉష్ణోగ్రత 24-34 డిగ్రీలు ఉండవచ్చు. ఏపీలో దక్షిణాంధ్రలో కొన్ని ప్రాంతాలు, దక్షిణ రాయలసీమల్లో తేలికపాటి వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వాతారణంలో తేమశాతం పెరగవచ్చు. ఏపీలో 86 శాతం, తెలంగాణలో 79 శాతం తేమ ఉంటుంది. 

Also read: Online Food: వెజ్‌కి బదులుగా నాన్-వెజ్ ఫుడ్‌ డెలివరీ.. జొమాటో-మెక్‌డొనాల్డ్స్‌కు షాకిచ్చిన కస్టమర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News