Antarvedi chariot fire case: అంతర్వేది రథం దగ్ధం కేసులో ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

అంతర్వేది ఆలయంలో రధం దగ్ధమైన ఘటనలో ( Antarvedi ratham fire case ) ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొడుతూ ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.

Last Updated : Sep 10, 2020, 10:25 PM IST
Antarvedi chariot fire case: అంతర్వేది రథం దగ్ధం కేసులో ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

అమరావతి: అంతర్వేది ఆలయంలో రధం దగ్ధమైన ఘటనలో ( Antarvedi ratham fire case ) ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొడుతూ ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఉన్న భారీ రథం అగ్నికి ఆహుతి అవడాన్ని ఇప్పటికే తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ( AP CM YS Jaganmohan Reddy ).. ఈ ఘటనపై కేసు విచారణను సీబీఐకి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతర్వేది ఘటనపై ( Antarvedi ratham issue ) ఓవైపు పోలీసులు దర్యాప్తు చేపట్టినప్పటికీ.. అక్కడ అన్యమత ప్రచారం జరుగుతోందని, పోలీసుల విచారణపై తమకు నమ్మకం లేదని పలు రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఏపీ సర్కార్ పారదర్శకతను నిరూపించుకునేందుకు వైఎస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఈ ఘటనలో సీబీఐ దర్యాప్తును కోరుతూ హోం శాఖకు రాష్ట్ర డీజీపీ కార్యాలయం లేఖ రాసినట్టు తెలుస్తోంది. దీనిపై రేపు అధికారిక జీవో వెలువడనున్నట్టు సమాచారం. Also read : Antarvedi temple issue: రధం దగ్దంపై ప్రభుత్వం సీరియస్..ఈవో సస్పెన్షన్

అంతర్వేది రథం దగ్ధం ఘటన వెనుక ఉన్న దోషులు ఎవరైనా, ఎంతటివారైనా.. వారిని కఠినంగా శిక్షించేందుకు వైసిపి సర్కార్ సిద్ధంగా ఉందని చెప్పేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. Also read : Antarvedi radham issue: అంతర్వేది రథం దగ్ధం.. సర్కారుపై పవన్ ఘాటు వ్యాఖ్యలు

Trending News