Gold Smuggling: మలద్వారంలో 7.3కిలోల బంగారం-శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నలుగురి అరెస్ట్

Gold Seized at Hyderabad airport: దుబాయ్ నుంచి శంషాబాద్ వచ్చిన నలుగురి విదేశీ ప్రయాణికులు అక్రమ బంగారాన్ని తరలిస్తూ పట్టుబడ్డారు. నలుగురు తమ మలద్వారంలో బంగారాన్ని తీసుకునిరావడం గమనార్హం.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 11, 2021, 08:56 AM IST
  • శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత
  • దుబాయ్ నుంచి వచ్చిన నలుగురు విదేశీ ప్రయాణికులు
  • పేస్ట్ రూపంలోని బంగారాన్ని మలద్వారంలో చొప్పించుకుని వచ్చిన వైనం
 Gold Smuggling: మలద్వారంలో 7.3కిలోల బంగారం-శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నలుగురి అరెస్ట్

Gold Seized at Hyderabad airport: హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో (Shamshabad Airport) అక్రమంగా తరలిస్తున్న భారీ బంగారం (Gold Smuggling) పట్టుబడింది. దాదాపు 7.3కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంత భారీ బంగారాన్ని నలుగురు విదేశీ ప్రయాణికులు తమ మలద్వారంలో పెట్టుకుని రావడం గమనార్హం. ఆ నలుగురిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

పట్టుబడిన నలుగురిని సూడాన్ (Sudan) జాతీయులుగా కస్టమ్స్ అధికారులు (Customs Officials) గుర్తించారు. దుబాయ్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో వీరు శంషాబాద్‌కు చేరుకున్నారు. నలుగురి కదలికలపై కస్టమ్స్ అధికారులకు అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని తనిఖీలు చేశారు. నలుగురి వద్ద ఏమీ పట్టుబడకపోయినప్పటికీ అధికారులకు ఎక్కడో అనుమానం వెంటాడుతూనే ఉంది. దీంతో వైద్యులను పిలిపించి మలద్వారం వద్ద (Gold in Rectum) పరిశీలించగా బంగారం బయటపడింది. 7.3 కిలోల బంగారాన్ని ఇలా మలద్వారంలో తీసుకుని రావడంతో అధికారులు షాక్ తిన్నారు.

కరిగించిన బంగారం ముద్దను (Gold Smuggling) ఇలా మలద్వారంలో తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. పట్టుబడిన బంగారం విలువ సుమారు రూ.3.6కోట్లు ఉంటుందని అంచనా వేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో (Shamshabad Airport) అక్రమ బంగారం తరలింపు ఘటనలు తరుచూ బయటపడుతూనే ఉన్నాయి. ఇలా మలద్వారంలో బంగారాన్ని తరలించిన ఘటనలు గతంలోనూ బయటపడ్డాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో సూడాన్‌కి చెందిన ఓ మహిళ తన 1200 గ్రా. బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ పట్టుబడింది. కరిగించిన బంగారం ముద్దను ఆమె తన లోదుస్తుల్లో పెట్టుకుని వచ్చింది. క్యాప్సుల్స్ రూపంలో ఉన్న బంగారాన్ని మలద్వారంలోకి చొప్పించుకుని అక్రమ రవాణా చేస్తున్న ఓ వ్యక్తి గతంలో పట్టుబడ్డాడు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే కాదు దేశవ్యాప్తంగా పలు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో బంగారం అక్రమ తరలింపు ఘటనలు తరచూ బయటపడుతున్నాయి.

Also Read: December 11 Horoscope: నేడు శనివారం- ఆ రాశివారికి సొంత నిర్ణయాలు మంచివి కావు.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News