Vampire Facial: వామ్మో.. ఫెషియల్ చేసుకున్న మహిళలకు హెచ్ఐవీ.. అసలేం జరిగిందంటే..?

Vampire Facial:స్పాలో "వాంపైర్ ఫేషియల్" చేయించుకున్న తర్వాత ముగ్గురు  మహిళలు హెచ్ ఐవీ బారిన పడ్డారు. మెక్సికోలో చోటు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.    

Written by - Inamdar Paresh | Last Updated : Apr 28, 2024, 06:57 PM IST
  • ఫెషియల్ చేసుకున్నాక ఊహించని ఘటన..
  • ముగ్గురు మహిళలకు హెచ్ ఐవీ..
Vampire Facial: వామ్మో.. ఫెషియల్ చేసుకున్న మహిళలకు హెచ్ఐవీ.. అసలేం  జరిగిందంటే..?

Womens contracted hiv after vampire facial in Mexico: నార్మల్ గా అమ్మాయిలు అందంగా కన్పించడం కోసం రెగ్యులర్ గా ఫెషియల్ లకు వెళ్తుంటారు. కొందరు మరింతగా అందంగా కన్పించడం కోసం ఎంతటి రిస్క్ పనులనైన చేస్తుంటారు. ముఖానికి సర్జరీలు చేసుకుంటారు. ఇటీవల కొందరు ముఖం అందంగా కన్నించడం కోసం, ముఖానికి ముసలి ఛాయలు  రాకుండా ఉండేందుకు ఏకంగా పాముల రక్తం ను కూడా తాగుతున్నారంట. అయితే.. ఇక్కడ కూడా కొందరు మహిళలు అందం కోసం చేసిన పని వారి కొంప ముంచింది.ఈ  ఘటన ప్రస్తుతం ట్రెండింగ్ మారింది.

Read More: Wedding with Robo: లేడీ రోబోతో యువకుడి ప్రేమాయణం.. మూఢాల్లోనే పెళ్లి.. ఎక్కడో తెలుసా..?

న్యూ మెక్సికోలోని స్థానిక  స్పాలో ఫెషియల్ చేయించుకున్న  ముగ్గురు మహిళలు HIV బారిన పడ్డారు. ఇది కాస్మోటిక్ ఇంజెక్షన్ ప్రక్రియ. దీనిలో ఒక వ్యక్తి నుంచి రక్తంను స్వీకరించి, దాన్ని ముఖంకు రాయడం చేస్తారు. వాంపైర్ ఫేషియల్ అనేది ఫేస్‌లిఫ్ట్ పొందడం కంటే మరింత సరసమైన,  తక్కువ ఇన్వాసివ్ ఆప్షన్‌గా పరిగణించబడుతుంది. ఫేషియల్ సమయంలో, ఒక వ్యక్తి యొక్క రక్తం వారి చేతి నుండి తీసుకోబడుతుంది.  ఆపై ప్లేట్‌లెట్‌లను వేరు చేసి, మైక్రోనెడిల్స్‌ని ఉపయోగించి రోగి ముఖానికి అప్లై చేస్తారు. ఈ ప్రక్రియ అపరిశుభ్రమైన పరిస్థితులలో చేస్తే తీవ్రమైన ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది. ఈక్రమంలో ఇటీవల కొందరు మహిళలను టెస్టులు చేయగా హెచ్ ఐవీ పాజిటివ్ అని తెలింది. 

నివేదిక ప్రకారం, అల్బుకెర్కీలోని VIP స్పాకు లింక్ చేయబడిన మొదటి కేసు 2018లో కనుగొనబడింది.  ఆమెకు ఇంజెక్షన్ డ్రగ్స్ వాడకం, ఇటీవలి రక్తమార్పిడి లేదా హెచ్‌ఐవి ఉన్న వారితో ఇటీవల లైంగిక సంబంధాలు లేవు - కానీ ఆమె మెక్సికోలో రక్తంతో ఫెషియల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఒకే నీడిల్ ను, అనేక మందికి ఉపయోగించడం వల్ల.. ఇలాంటి ప్రమాదం జరిగేందుకు అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.

Read More: Doctor left surgery: ఆకలేస్తోంది.. మసాల దోశ తినేసి వస్తా.. సర్జరీ మధ్యలో వెళ్లిపోయిన డాక్టర్..

ఇదిలా ఉండగా.. స్పా ఆపరేట్ చేయడానికి తగిన లైసెన్స్‌లు లేవని, సరైన భద్రతా చర్యలను ఉపయోగించడం లేదని పోలీసులు కనుగొన్నారు. ఇది కిచెన్ కౌంటర్‌లో రక్తం యొక్క లేబుల్ లేని గొట్టాలను అలాగే వంటగది యొక్క రిఫ్రిజిరేటర్‌లో ఆహారంతో పాటు నిల్వ చేసిన ఇతర ఇంజెక్షన్‌లను అక్కడ గుర్తించారు. లైసెన్సు లేకుండా మెడిసిన్ ప్రాక్టీస్ చేసిన ఐదు నేరాల గణనలకు స్పా యజమాని 2022లో నేరాన్ని అంగీకరించాడని ఆరోగ్య శాఖ గత ఏడాది తెలిపింది. ఆమెకు మూడున్నరేళ్ల జైలు శిక్ష పడింది.  ఈస్పాలో దాదాపు.. 59 స్పా క్లయింట్లు HIVకి గురయ్యారని నిర్ధారించారు. వారిలో 20 మంది రక్త పుఫేషియల్ చేయించుకున్నారు. 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News