Periods Problem: పీరియడ్స్ సమస్యకు చెక్. సహజసిద్ధంగా ఇలా వాయిదా వేసుకోండి

Periods Problem: మగవారితో పోలిస్తే మహిళలు ఆరోగ్యపరంగా, శారీరకంగా బలహీనంగా ఉంటారు. ప్రకృతి సిద్ధంగా శరీరంలో మార్పులు కూడా మహిళలకు అసౌకర్యాన్ని కల్గిస్తుంటాయి. కొన్ని సమస్యలు మహిళలకు ఇబ్బందిగా మారుతుంటాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 23, 2023, 12:27 PM IST
Periods Problem: పీరియడ్స్ సమస్యకు చెక్. సహజసిద్ధంగా ఇలా వాయిదా వేసుకోండి

Periods Problem: మహిళలకు ప్రతి నెలా వచ్చే పీరియడ్స్ చాలా అంశాల్లో ఇబ్బంది కల్గిస్తుంటాయి. సరిగ్గా నెలసరి సమయంలో ఏదైనా ముఖ్యమైన వేడుకలు, పార్టీలు, సమావేశాలుంటే హాజరుకాలేని పరిస్థితి. క్రీడాకారులైతే మరింత ఇబ్బంది. ఇలాంటి పరిస్థితి తలెత్తినప్పుడు సహజంగానే మహిళలు పీరియడ్స్ వాయిదా వేయడానికి ఇష్టపడుతుంటారు.

అయితే నెలసరి వాయిదా వేయడం మంచిది కాదు. అప్పడప్పుడూ ఫరవాలేదు కానీ ప్రతిసారీ ఏదో కారణంతో నెలసరి వాయిదా పడేలా చేయడం ఆరోగ్యానికి మంచిది కానేకాదు. నెలసరి వాయిదా వేసేందుకు చాలామంది ట్యాబ్లెట్లు వినియోగిస్తుంటారు. ఈ అలవాటు మరీ ప్రమాదకరం. రుతుస్రావం సమయంలో మహిళలు  ప్యాడ్స్ మారుస్తుండటం వంటివి చేస్తుండాలి. బయట ఉన్నప్పుడు ఇది అసౌకర్యానికి దారి తీస్తుంది. 

ఆరోగ్యపరంగా కూడా అలసట, కడుపు నొప్పి, కండరాల నొప్పి, బ్యాక్ పెయిన్, ఛాతీ నొప్పి వంటి సమస్యలు సర్వ సాధారణం. కొందరిలో తీవ్రమైన తలనొప్పి కూడా ఉంటుంది. అందుకే పార్టీలు, వేడుకలు ఉన్నప్పుడు ట్యాబ్లెట్లతో కాకుండా సహజసిద్ధమైన పద్ధతుల్లో పీరియడ్స్ వాయిదా వేసుకోవచ్చు.

యాపిల్ సైడర్ వెనిగర్‌ను పీరియడ్స్ సమయం కంటే వారం రోజుల ముందు నీటిలో కలిపి తాగితే నెలసరి వాయిదా పడవచ్చు. నెలసరి సమస్యకు ఇది మంచి పరిష్కారం. మరో పద్థతి చాలాకాలంగా ఆచరణలో ఉన్నదే. నిమ్మరసం అధికంగా తాగితే రుతుక్రమం ఆలస్యం అవుతుంది. దీనిగురించి ప్రాచీన వైద్య గ్రంథాల్లో ప్రస్తావన ఉంది. పీరియడ్స్‌కు 3-4 రోజుల ముందు నుంచే జెలటిన్ నీరు తాగితే రుతుక్రమం ఆలస్యం కావచ్చు. అయితే ఎక్కువగా తీసుకోకూడదు. అతిగా సేవిస్తే జీర్ణకోశ సమస్యలు, కడుపు ఉబ్బరం రావచ్చు.

దాల్చిన చెక్క టీ తాగడం వల్ల రుతుస్రావం ఆలస్యం కావచ్చు. ఉబ్బరం, కండరాల తిమ్మిరి, అధిక రక్తస్రావం కూడా నివారించవచ్చు. పుచ్చకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. పీరియడ్స్ సమయానికి వారం రోజుల ముందు ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే నెలసరి వాయిదా పడవచ్చు.

Also read: Cholesterol: కొలెస్ట్రాల్ ఇతర సమస్యల్ని వేళ్లతో పెకిలించే కూరగాయ ఇదే, తినకపోతే చాలా నష్టపోతారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News