Renu Desai: ఆ బాధ నాకూ తెలుసు.. కానీ అలా చేయకండి

తెలుగు సినీ పరిశ్రమలో నటి రేణు దేశాయ్‌ (Renu Desai) తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఒకప్పుడు నటిగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న రేణూ దేశాయ్.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ ( Pawan Kalyan ) ను ప్రేమించి పెళ్లి చేసుకోని విడిపోయిన సంగతి తెలిసిందే.

Last Updated : Nov 27, 2020, 03:32 PM IST
 Renu Desai: ఆ బాధ నాకూ తెలుసు.. కానీ అలా చేయకండి

Renu Desai talks about love failure: తెలుగు సినీ పరిశ్రమలో నటి రేణు దేశాయ్‌ (Renu Desai) తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఒకప్పుడు నటిగా తెలుగు (Tollywood) ప్రేక్షకులను ఆకట్టుకున్న రేణూ దేశాయ్.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ ( Pawan Kalyan ) ను ప్రేమించి పెళ్లి చేసుకోని విడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా రేణూ దేశాయ్ నిర్మాతగా, ద‌ర్శ‌కురాలిగా, వక్తగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే రేణూ దేశాయ్ నెటిజ‌న్స్‌తో త‌ర‌చూ ముచ్చ‌టిస్తూ.. వారు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు సమాధానాలిస్తూ సలహాలు సూచనలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఆమె గురువారం ఇన్‌స్టాలో అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రేమ విఫ‌లమైతే సూసైడ్ చేసుకోవాల‌నే ఆలోచ‌న చేసే వారికి పలు సూచ‌న‌లు చేస్తూ వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by renu desai (@renuudesai)

ప్రేమలో విఫలమైతే తట్టుకోవడం కష్టమని, ఆ బాధ తనకు తెలుసంటూ రేణూ దేశాయ్ పేర్కొన్నారు. అలాగే ప్రేమలో విఫలమైనంత మాత్రాన ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం సరికాదని సూచించారు. మనం ఎంతగానో ప్రేమించిన వ్యక్తి మన పక్కన లేడని, మనం మోసపోయామని అనిపించినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం తప్పు. నీ జీవితం, ప్రాణం కంటే ఎవరూ ఎక్కువ కాదని ఆలోచించాలంటూ సూచనలు చేశారు. కౌన్సిలింగ్ తీసుకుంటూ కుటుంబ సభ్యులు, స్నేహితుల సాయంతో సులభంగా ఆ బాధ నుంచి బయటపడొచ్చని ఈ విధంగా అందరూ ఆలోచించాలని రేణు దేశాయ్ నెటిజన్లకు పలు సూచనలు చేశారు. 

Also read: Kiara Advani: ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్న కియారా అద్వానీ.. లేటెస్ట్ పిక్స్

Also read: Nidhhi Agerwal: హుషారెక్కిస్తున్న ‘నిధి’‌ సోయగాలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News