April Bank Holidays: బ్యాంక్ కస్టమర్స్‌కు భారీ అలర్ట్.. ఏప్రిల్ నెలలో బ్యాంకులకు భారీ సెలవులు.. లిస్ట్ ఇదే..

Bank Holidays in April Month: బ్యాంకులకు ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్ధిక సంవత్సరం మొదలవుతోంది. ఈ సందర్భంగా భారత దేశంలోని అన్ని బ్యాంకులు వార్షిక ముగింపు నేపథ్యంలో ఏప్రిల్ 1న బ్యాంకులకు సెలవులు ఉంటాయి. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నెలలో బ్యాంక్ హాలీడేస్ జాబితాను రిలీజ్ చేసింది. దీంతో బ్యాంక్ కస్టమర్స్ వాటికి అనుగుణంగా తమ బ్యాంకింగ్ కార్యకలాపాలను షెడ్యూల్ చేసుకోవడం బెటర్.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 2, 2024, 12:50 PM IST
April Bank Holidays: బ్యాంక్ కస్టమర్స్‌కు భారీ అలర్ట్.. ఏప్రిల్ నెలలో బ్యాంకులకు భారీ సెలవులు.. లిస్ట్ ఇదే..

Bank Holidays in April Month: భారత దేశంతో పాటు చాలా దేశాల్లో మార్చి నెలలో ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అవుతోంది. ఈ సందర్భంగా ఏప్రిల్ 1న కొత్త ఆర్ధిక సంవత్సరం మొదలవుతుంది. ఈ సందర్బంగా బ్యాంకులకు ఏప్రిల్ 1న సెలవు ఉంటుంది. దాదాపు దేశంలోని అన్ని బ్యాంకులకు సంబంధించిన ఉద్యోగులు తమ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ సందర్బంగా ఉద్యోగులు ఓవర్ టైమ్ కూడా పనిచేస్తూ ఎంతో బిజీగా ఉంటారు. అందువల్ల ఏప్రిల్ 1వ తేదిన బ్యాంకులకు సెలవు ఉంటుంది. బ్యాంకులకు సెలవుల నేపథ్యంలో ఏదైనా పని ఉంటే ఇంట్లో కూర్చొని నెట్ బ్యాంకింగ్, ఫోన్ బ్యాంకింగ్ ద్వారా పనులను చక్కబెట్టుకోవచ్చు.

2024 ఏప్రిల్ నెలలో బ్యాంకులకు సగం రోజులు అంటే 14 రోజుల పాటు సెలవులున్నాయి. ఇందులో గవర్నమెంట్ హాలీడేస్, ప్రాంతీయ సెలవులు, శని, ఆదివారాలు కలిపితే 14 ఉన్నాయి. సెలవులకు సంబంధించిన క్యాలెండర్‌ను RBIతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. సెలవులకు సంబంధించిన క్యాలెండర్ రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం .. ఏప్రిల్‌లో 14 రోజులు పాటు బ్యాంకులు పనిచేయవు. నెల ప్రారంభ రోజైన ఏప్రిల్ 1న అన్ని బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఇవి కాకుండా.. రంజాన్ పండగ, ఉగాదితో పాటు పలు సెలవులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అనుగుణంగా మారిపోతూ ఉంటాయి.
 
1 ఏప్రిల్ 2024.. ఫైనాన్షియల్ ఇయర్ సందర్భంగా ఏప్రిల్ 1న బ్యాంకులకు సెలవు. ముఖ్యంగా అగర్తల, అహ్మదబాద్, హైదరాబాద్ సహా దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ఈ రోజు సెలవు ఉంది.
5 ఏప్రిల్ 2024.. మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ పుట్టినరోజుతో జమాత్ ఉల్ విదా కారణంగా హైదరాబాద్, జమ్మూ కశ్మర్‌లో బ్యాంకులకు సెలవు.

7 ఏప్రిల్ 2024.. ఆదివారం సందర్భంగా సాధారణ సెలవు..

9 ఏప్రిల్ 2024.. తెలుగు నూతన సంవత్సరాదితో పాటు, గుడిపడ్వా.. హైదరాబాద్, చెన్నై, జమ్మూ, మహారాష్ట్ర, జమ్మూ కశ్మీర్‌ సహా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.

10 ఏప్రిల్ 2024.. ఈద్ పండగ పందర్భంగా కొచ్చి మరియు కేరళలో బ్యాంకులకు సెలవు.
11 ఏప్రిల్ 2024.. రంజాన్ పండగ సందర్భంగా దేశ వ్యాప్తంగా బ్యాంకులకు హాలీడే.
13 ఏప్రిల్ 2024.. ఏప్రిల్ నెల రెండో శనివారం కారణంగా దేశ వ్యాప్తంగా హాలీడే సందర్భంగా బ్యాంకులకు సెలవు.
14 ఏప్రిల్ 2024.. ఆదివారం సాధారణ సెలవు... బ్యాంకులకు సెలవు.
15 ఏప్రిల్ 2024.. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సిమ్లాలో బ్యాంకులకు సెలవు.
17 ఏప్రిల్ 2024.. శ్రీరామ నవమి పండగ సందర్భంగా అహ్మదాబాద్, బేలాపూర్, భువనేశ్వర్, చండీగఢ్, డెహ్రాడూన్, హైదరాబాద్, గాంగ్‌టక్, లక్నో, పాట్నా, రాంచీ, సిమ్లా, ముంబై, నాగ్‌పూర్‌లలో బ్యాంకులకు సెలవు.
20 ఏప్రిల్ 2024.. గరియా పూజ కారణంగా అగర్తలాలో బ్యాంకులకు సెలవు.
21 ఏప్రిల్ 2024.. ఆదివారం సాధారణ సెలవు..
27 ఏప్రిల్ 2024.. నెలలో నాల్గో శనివారం సందర్భంగా దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
28 ఏప్రిల్ 2024.. ఆదివారం, దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సాధారణ సెలవు.

బ్యాంకులు సెలవులు ఉన్నా.. ఆన్ లైన్ సేవలు కొనసాగుతాయి. ముఖ్యంగా నెట్ బ్యాంకింగ్, సంబంధించిన పనులు చేయవచ్చు. మీరు డబ్బును విత్ డ్రా చేసుకోవడానికి ATMను ఉపయోగించవచ్చు. ఇది కాకుండా మీ దగ్గరనున్న క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా డిజిటల్ చెల్లింపులు చేయవచ్చును.

Also Read: AP Pensions: ఏపీ ప్రజలకు భారీ షాక్.. ఇకపై ఇంటింటికి పథకాలు రావు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

FacebookTwitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News