Polling Rules: పోలింగ్ కేంద్రంలో ఫోన్ తీసుకెళ్లవచ్చా, ఏయే వస్తువులు తీసుకెళ్లకూడదు

Polling Rules: దేశవ్యాప్తంగా నాలుగో దశ ఎన్నికలు రేపు మే 13న జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు ఏపీ, తెలంగాణ లోక్‌సభ ఎన్నికలున్నాయి. దేశంలోని 10 రాష్ట్రాల్లో 96 లోక్‌సభ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 12, 2024, 03:46 PM IST
Polling Rules: పోలింగ్ కేంద్రంలో ఫోన్ తీసుకెళ్లవచ్చా, ఏయే వస్తువులు తీసుకెళ్లకూడదు

Polling Rules: ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వివిధ ప్రాంతాల్లో ఉద్యోగ, వ్యాపార రీత్యా వెళ్లినవారంతా ఓటేసేందుకు తిరిగొస్తున్నారు. ఇప్పటికే చాలామంది సొంతూర్లకు వచ్చేశారు. మీరు కూడా ఓటేసేందుకు వెళ్తుంటే కొన్ని వస్తువులు వెంట తీసుకెళ్లకుండా జాగ్రత్త పడండి. పోలింగ్ కేంద్రాల్లో కొన్ని వస్తువలపై నిషేధముంది.

ఓటు వేసేందుకు వెళ్లేటప్పుడు పోలింగ్ కేంద్రానికి మొబైల్ ఫోన్, కెమేరా, ఇయర్ ఫోన్స్ వంటివి తీసుకెళ్లకూడదు. పోలింగ్ కేంద్రంలో ఈ వస్తువులకు అనుమతి లేదు. వీలైనంతవరకూ ఇంట్లోనే పెట్టుకుని వెళితే మంచిది. లేదంటే మొబైల్ ఫోన్ స్విచ్ చేసుకోవాలి. ఒక్కోసారి భద్రతా సిబ్బంది లేదా పోలీసులు స్విచ్ ఆఫ్ చేసినా లోపలకు అనుమతించరు. ఆ సిబ్బందికి మీ ఫోన్ అప్పగించి వెళ్లాల్సి ఉంటుంది. పోలింగ్ కేంద్రం వద్ద బూత్ లెవెల్ ఆఫీసర్లు విధి నిర్వహణలో ఉంటారు. వారికైనా అప్పగించవచ్చు. పోలింగ్ బూత్‌లోకి మాత్రం ఫోన్‌తో ప్రవేశించకూడదు. 

చాలామంది ఓటర్లు తమ ఓటు ఎక్కుడుందో, పోలింగ్ కేంద్రం ఎక్కడో తెలియక ఇబ్బంది పడుతుంటారు. పోలింగ్ సిబ్బంది లేదా వివిధ రాజకీయ పార్టీల ఏజెంట్లు జారీ చేసే ఓటరు స్లిప్పుల్లో ఆ వివరాలు పూర్తిగా ఉంటాయి. ఎన్నికల సంఘం కొత్తగా డిజిటల్ ఓటర్ స్లిప్పులు జారీ చేసింది. ఈ స్లిప్పులపై ఉండే స్కాన్ కోడ్ సహాయంతో పోలింగ్ కేంద్రం రూట్ కూడా తెలుసుకోవచ్చు.

Also read: Voter Slip: ఓటరు స్లిప్ అందకున్నా నో ప్రాబ్లెమ్, ఇలా సింపుల్‌గా డౌన్‌లోడ్ చేయవచ్చు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News