Snake Viral News: పాము నాలుక రెండు భాగాలుగా ఎందుకు ఉంటుందో తెలుసా.. ఆ శాపంతోనే ఇలా..!

';

పాముల నాలుకను మీరు ఎప్పుడైనా గమినించారా..? రెండు భాగాలుగా ఉంటుంది.

';

ఇలా ఎందుకు ఉంటుందో ఆలోచించారా..? ఇందుకు మహాభారతంతో సంబంధం ఉందని మన పురాణాలు చెబుతున్నాయి.

';

మహర్షి కశ్యపునికి 13 మంది భార్యలు ఉండేవారు. వారిలో కద్రు ఒకరు. సర్పాలు అన్ని కద్ర అనే సర్పానికి సంతానం.

';

మహర్షి కశ్యపుని మరో భార్య పేరు వినత. ఆమె కుమారుడు పక్షిరాజు గరుడ.

';

ఒకసారి కద్రు, వినత ఒక తెల్లని గుర్రాన్ని దూరం నుంచి చూసి.. తోక నలుపు అని ఒకరు.. తెలుపు ఒకరు అని ఇద్దరూ పందెం వేశారు.

';

కద్ర తన పాము కుమారులను పిలిచి.. చిన్నగా మారి గుర్రం తోకను పట్టుకోవాలని చెబుతుంది. దీంతో తోక నల్లగా కనబడి తాను పందెం గెలుస్తానని చెబుతుంది.

';

అయితే కొన్ని పాములు అలా చేయడానికి నిరాకరించాయి. కుమారులను జనమేజయ రాజు యాగంలో కాల్చివేస్తానని కద్ర శపిస్తుంది.

';

శాపానికి భయపడిన పాములు.. వెంటనే గుర్రం తోకకు ఆతుకున్నాయి. దీంతో దాని తోక నల్లగా మారుతుంది.

';

పందెంలో ఓడిపోయిన గరుడ తల్లి వినత.. కద్రకు బానిసగా మారుతుంది. తన తల్లికి బానిసత్వం నుంచి విముక్తి కల్పించాలని గరుడ వారిని కోరతాడు. స్వర్గం నుంచి అమృతం తీసుకురావాలని వాళ్లు కండీషన్ పెడతారు.

';

గరుడు స్వర్గం నుంచి అమృత పాత్రను తీసుకువచ్చి.. పదునైన గడ్డిపై ఉంచాడు.

';

పాములు అన్నీ అమృతం తాగేందుకు రాగా.. ముందు స్నానం చేసి రావాలని గరుడ చెబుతాడు. పాములు స్నానానికి వెళ్లగా.. ఈలోపు ఇంద్రుడు వచ్చి అమృతం కుండతో స్వర్గానికి తిరిగి వెళ్లిపోతాడు.

';

స్నానం చేసి అక్కడివచ్చిన పాములకు కుండ కనిపించదు. అమృత కుండ కోసం గడ్డిపై వెతుకుతాయి. గడ్డి పదునుగా ఉండడంతో నాలుక రెండు భాగాలుగా వీడిపోయిందని పురణాల ప్రకారం ఉంది.

';

గమనిక: ఇక్కడ అందజేసిన సమాచారం.. పౌరాణిక విశ్వాసాలు, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. zeetelugunews.Com దీన్ని ధృవీకరించలేదు.

';

VIEW ALL

Read Next Story