Tatikonda Rajaiah: వరంగల్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య..

Tatikonda Rajaiah: తెలంగాణ ఎంపీ ఎన్నికల టికెట్ల కేటాయింపులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గులాబీ బాస్ తాజగా, వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తాటి కొండ రాజయ్యను టికెట్ కేటాయించినట్లు తెలుస్తోంది.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 12, 2024, 02:49 PM IST
  • తాటికొండ రాజయ్యకు బంపర్ ఆఫర్..
  • వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చిన గులాబీ బాస్..
Tatikonda Rajaiah: వరంగల్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య..

Telangana Tatikonda Rajaiah As Warangal BRS MP Candidate: తెలంగాణ ఎంపీ ఎన్నికలు సమ్మర్ లో మరింత హీట్ ను పుట్టిస్తున్నాయి. ఈ క్రమంలో.. ఇప్పటికే ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ, అటు బీఆర్ఎస్, బీజేపీలు నువ్వా.. నేనా అన్న విధంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. పార్టీలన్ని తమదైన స్టైల్ లో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇదిలా ఉండగా...తెలంగాణ లో ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి ఎక్కువ మంది నాయలకు కాంగ్రెస్ లోకి వలసలు వెళ్తున్నారు. ముఖ్యంగా వరంగల్ ఎంపీ స్థానంనుంచి కడియంను బరిలో ఉండాలని, గతంలో బీఆర్ఎస్ కోరింది. కానీ ఆయన తన కూతురు కడియం కావ్యకు ఎంపీ టికెట్ ఇవ్వాలని గులాబీబాస్ ను కోరారు. దీంతో గులాబీ బాస్.. కడియం కావ్యకు టికెట్ ను కేటాయించారు.

Read More: Venu Swami Astrologer: వేణుస్వామి చనిపోవడంపై థంబ్ నెయిల్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన సెలబ్రిటీ ఆస్ట్రాలజర్..

ఈ క్రమంలో..  అనూహ్యంగా లిక్కర్ స్యామ్ లో ఎమ్మెల్సీ కవిత అరెస్టు కావడం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహరాల వల్ల తను వరంగల్ నుంచి బరిలో ఉండలేనని కావ్య గులాబీ బాస్ కు లేఖ రాశారు. ఆ తర్వాత వెనువెంటనే కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయారు. ఈ క్రమంలో గతంలో వరంగల్ లో కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్యల మధ్య ఆధిపత్యపోరు నువ్వా.. నేనా.. అన్న విధంగా ఉండేది. ఇకతెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కూడా గులాబీ బాస్ వరంగల్ నుంచి కడియం శ్రీహరివైపు మాత్రమే మొగ్గుచూపారు. దీంతో తాటికొండ రాజయ్య నొచ్చుకుని, కన్నీళ్లు పెట్టుకుని పార్టీకీ రాజీనామా చేశారు.

కానీ కాంగ్రెస్ లో మాత్రం చేరలేదు. ఇదిలా ఉండగా.. కడియం, కావ్యలు కాంగ్రెస్ లో చేరడం వల్ల, రాజయ్యకు లైన్ క్లియర్ అయ్యిందని చెప్పుకొచ్చు. ఆయనను గులాబీ బాస్ ఈసారి ఎంపీ ఎన్నికలలో వరంగల్ టికెట్ కేటాయించారు. తాటికొండ రాజయ్య... గతంలో డాక్టర్ గా కూడ పనిచేశారు. అంతే కాకుండా రెండు సార్లు ఎమ్మెల్యేగాను, ఒకసారిడిప్యూటీ సీఎంగా కూడా పనిచేశారు.

Read More: Romance In Flight: విమానంలో కపుల్ అరాచకం.. 4 గంటల పాటు హగ్గింగ్ చేసుకుంటూ రొమాన్స్.. వైరగా మారిన ఘటన..

అదే విధంగా పార్టీకీ తొలుత నుంచి ఎంతో నమ్మకంగా మెలిగేవారు. ఈ క్రమంలో ఆయన సేవలు, వరంగల్ లో ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి,తాటికొండ రాజయ్యకే వరంగల్ ఎంపీ టికెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ముఖ్యంగా తాటికొండ రాజయ్యకు వరంగల్ టికెట్ కేటాయించడం, ఇద్దరు కూడా కీలకనేతలు కావడంతో వరంగల్ ఎంపీ ఎన్నికల ఫైట్ టఫ్ గా మారిందని చెప్పుకొవచ్చు. ఇక వరంగల్ నుంచి ఆరూరీ రమేష్ బరిలో ఉన్నారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News